swati singh
-
భార్య గెలిచింది.. మాఫీ చేసేశారు
మళ్లీ బీజేపీలోకి దయాశంకర్ సింగ్ బీఎస్పీ అధినేత్రి మాయవతిపై గతంలో అత్యంత మొరట వ్యాఖ్యలు చేసిన వివాదాస్పద నేత దయాశంకర్ సింగ్ తప్పును బీజేపీ మాఫీ చేసింది. ఆయనపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేస్తూ.. మళ్లీ పార్టీలోకి తీసుకుంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరునాడే.. బీజేపీ ఈమేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మాయావతి తీరు వేశ్యకంటే దారుణమంటూ గతంలో దయాశంకర్సింగ్ హేయమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై పార్లమెంటు లోపలా.. బయటా తీవ్ర దుమారం రేగింది. బీజేపీ సహా అన్ని పార్టీలను ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. దళిత నాయకురాలిని ఉద్దేశించి ఇలా మొరటు వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై బీజేపీ అప్పట్లో సస్పెన్షన్ వేటు వేసింది. దయాశంకర్పై బీజేపీ బహిష్కరణ వేటు వేసినప్పటికీ ఆయన భార్యకు కీలక పదవి అప్పగించింది. ఆమెను యూపీ బీజేపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా నియమించింది. అంతేకాకుండా ఆమె తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున విజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే దయాశంకర్పై విధించిన సస్పెన్షన్ వేటును బీజేపీ యూపీ చీఫ్ కేవశ్ప్రసాద్ మౌర్య ఎత్తివేశారు. యూపీలో బీజేపీ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో తనను తిరిగి పార్టలోకి తీసుకోవడంపై దయాశంకర్ సంతోషం వ్యక్తం చేశారు. -
బహిష్కృతనేత భార్యకు కీలక పదవి
లక్నో: ఉత్తరప్రదేశ్ బీజేపీ మాజీ ఉపాధ్యక్షుడు దయాశంకర్ భార్య స్వాతి సింగ్కు పార్టీలో కీలక పదవి దక్కింది. యూపీ బీజేపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఆమెను నియమించారు. బీఎస్పీ చీఫ్ మాయావతిపై తీవ్ర వ్యాఖ్యలు చేసినందుకు దయాశంకర్ను బీజేపీ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. మాయావతి టికెట్లు అమ్ముకుంటున్నారని దయాశంకర్ ఆరోపిస్తూ ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు రావడంతో బీజేపీ ఆయనపై వేటు వేసింది. కాగా ఆయన భార్యకు బీజేపీలో అమిత ప్రాధాన్యం ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
'నన్ను, నా కూతుర్ని వేధిస్తున్నారు'
-
'నన్ను, నా కూతుర్ని వేధిస్తున్నారు'
లక్నో: బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు తమను బెదిరిస్తున్నారని ఉత్తరప్రదేశ్ బీజేపీ మాజీ ఉపాధ్యక్షుడు దయాశంకర్ భార్య స్వాతి సింగ్ ఆరోపించారు. తమ 12 ఏళ్ల కుమార్తెను మానసికంగా వేధిస్తున్నారని వాపోయారు. మాయావతిపై మొరటు వ్యాఖ్యలు చేయడంతో దయాశంకర్ కు వ్యతిరేకంగా బీఎస్పీ కార్యకర్తలు ఆందోళనలు, ప్రకటనలు చేశారు. బీఎస్పీ మద్దతు చేసిన ప్రకటనలు అభ్యంతకరంగా ఉన్నాయని స్వాతి సింగ్ అన్నారు. 'వివాదస్పద వ్యాఖ్యలు చేసిన నా భర్తపై కేసు నమోదు చేశారు. పార్టీ నుంచి బహిష్కరించారు. ఆయన క్షమాపణ కూడా చెప్పారు. అయినా మాయావతి సంతృప్తి చెందలేదు. మమ్మల్ని బయటకు ఈడ్చాలని బీఎస్పీ నేతలు బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారు. దీంతో నా కుమార్తె చాలా బాధ పడింది. బీఎస్పీ నేతలు చేస్తున్న వివాదస్పద వ్యాఖ్యలను ఎందుకు ఖండించరు? అలాంటి వారిని పార్టీ నుంచి ఎందుకు తొలగించరు? నా భర్త నాలుక కోసి తెస్తే రూ.50 లక్షలు ఇస్తామని ఒకావిడ ప్రకటించింది. బలహీన వర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్నామని చెప్పుకుంటున్న పార్టీ నేతలు ఇలాగేనా ప్రవర్తించేది? నన్ను, నా కుమార్తెను మానసికంగా వేధింపులకు గురిచేసిన వారిపై కేసులు నమోదు చేయాల'ని స్వాతి సింగ్ డిమాండ్ చేశారు.