కోల్‌కత్తాలో అగ్నిప్రమాదం.. ఒకరి మృతి | Fire breaks out at Kolkata slum near Dum Dum park | Sakshi
Sakshi News home page

కోల్‌కత్తాలో అగ్నిప్రమాదం.. ఒకరి మృతి

Published Sat, Dec 26 2015 9:17 PM | Last Updated on Sun, Sep 3 2017 2:37 PM

కోల్‌కత్తాలో అగ్నిప్రమాదం.. ఒకరి మృతి

కోల్‌కత్తాలో అగ్నిప్రమాదం.. ఒకరి మృతి

కోల్‌కత్తా: కోల్‌కత్తాలో శనివారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. దమ్‌దమ్‌ పార్క్‌ సమీపంలో ఉన్న మురికివాడలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో ఒకరు మృతిచెందినట్టు తెలిసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. 12 అగ్నిమాపక యంత్రాలతో ఘటనా స్థలికి చేరుకున్నారు. ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు.

అందిన తాజా సమాచారం ప్రకారం.. ఈ ప్రమాదంలో కనీసం 8 గ్యాస్‌ సిలీండర్లు పేలినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement