slum area
-
14 ఏళ్ల బాలిక ఘనత.. స్లమ్ నుంచి లగ్జరీ బ్యూటీ బ్రాండ్ అంబాసిడర్‌గా..
టాలెంట్ ఏ ఒక్కరి సొత్తు కాదు.. ప్రతిభకు డబ్బుతో సంబంధం లేదు. గుడిసెలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారిలోనూ విశేష ప్రతిభ దాగి ఉంటుంది. కానీ టాలెంట్‌ను నిరూపించుకునేందుకు సమయం, అవకాశాలు, వేదికలు కావాలి.. అంతేగాదు సరైన ప్రోత్సాహం ఉండాలి. తాజాగా టాలెంట్ ఉంటే చాలు ఏదైనా సాధించవచ్చని నిరూపించింది మురికి వాడల్లో నివసించే 14 ఏళ్ల అమ్మాయి. చిన్న వయసులోనే గొప్ప విజయాన్ని అందుకొని తనలాంటి మరెంతో మందికి ఆదర్శంగానూ నిలిచింది. ముంబై ధారవి స్లమ్ వాడల్లో నివసించే మలీషా ఖర్వా.. ప్రఖ్యాతి గాంచిన లగ్జరీ బ్యూటీ బ్రాండ్ ఫారెస్ట్ ఎసెన్షియల్స్ సంస్థ కొత్తగా ప్రారంభించిన ‘ది యువతి కలెక్షన్’కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైంది. స్లమ్ ఏరియాలో ఉండే మలీషా ఇప్పుడు ‘యువతి కలెక్షన్’ను ముందుండి నడిపించనుంది. ఇది యువ శక్తిని పెంపొందించే లక్ష్యంతో మొదలు పెడుతున్న ఓ సామాజిక కార్యక్రమం. ఈ మేరకు ఏప్రిల్‌లో మలీషాను తమ సంస్థలోకి స్వాగతం పలుకుతూ ఓ అందమైన వీడియో షేర్ చేసింది ఫారెస్ట్ ఎసెన్షియల్స్. #BecauseYourDreamsMatter అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో బ్రాండ్ స్టోర్‌లోకి వెళ్లి అక్కడ ప్రదర్శనకు ఉంచిన తన ఫోటోలను చూస్తూ ఆనందంతో మురిసిపోతుంది. ఈ వీడియో.. నెటిజన్ల మనసు దోచుకుంటోంది. దీనికి 5 మిలియన్ల వ్యూస్, 4 లక్షలకు పైగా కామెంట్లు వచ్చాయి. ‘అందాన్ని చూసే ధృక్పథంలో మార్పు అవసరం. ఇది సామాన్యుడికి దక్కిన విజయం. ఇంత గొప్ప ఘనత అందుకున్న మలీషాకు అభినందనలు. భవిష్యత్తులో ఆమె మరింత ఎత్తుకు ఎదగాలి’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనిపై మలీషా మాట్లాడుతూ.. ఫారెస్ట్ ఎసెన్షియల్స్‌తో తన ప్రచారం ఇప్పటి వరకు తనకు దక్కిన పెద్ద గౌరవమని తెలిపింది. భవిష్యత్తులో మోడల్‌గా రాణించాలనుకుంటున్నట్లు పేర్కొంది. అందుకు చదవును నిర్లక్ష్యం చేయనని.. చదువే తన మొదటి ప్రధాన్యమని తెలిపింది. View this post on Instagram A post shared by @forestessentials కాగా మూడేళ్ల కిత్రం 2020లో మలీషా ప్రతిభను హాలీవుడ్ డైరెక్టర్ రాబర్ట్ హాఫ్మన్ గుర్తించారు. ఆమె కోసం గో ఫండ్ మీ పేజ్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2, 25,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇటీవల అనేక మోడలింగ్ ప్రదర్శనలు ఇచ్చింది. ర్సాలా ఖురేషి, జాన్ సాగూ రూపొందించిన ‘లివ్ యువర్ ఫెయిరీటేల్’ అనే షార్ట్ ఫిల్మ్‌లో కూడా నటించింది. -
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల బరిలో దినసరి కూలీ.. రూపాయి నాణేలతో..
గాంధీనగర్: డిసెంబర్ మొదటి వారంలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో దినసరి కూలీగా పనిచేసే ఒక యువకుడు బరిలోకి దిగుతున్నాడు. గాంధీ నగర్‌లోని ఓ మురికివాడలో నివసించే మహేంద్ర పాట్నీకి స్థానికులు మద్దతుగా నిలుస్తున్నారు. వీరి నుంచి ఇతడు రూ.10వేలు సేకరించాడు. ఈ డబ్బంతా రూపాయి నాణేల రూపంలోనే ఉండటం గమనార్హం. ఈ మొత్తాన్ని తీసుకెళ్లి అతడు ఎన్నికల సంఘం వద్ద సెక్యూరిటీ డిపాజిట్ చేశాడు. దీంతో డిసెంబర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నాడు. మహేంద్ర పాట్నీ గాంధీనగర్ నార్త్ నుంచి పోటీ చేస్తున్నాడు. అయితే ఈ యువకుడు స్వతహాగా ఎన్నికల బరిలో దిగడానికి బలమైన కారణమే ఉంది. 2019లో ఓ హోటల్‌కు దారికోసం ఇతడు నివసించే మురికివాడను అధికారులు తొలగించారు. 521 గుడిసెలను నేలమట్టం చేశారు. దీంతో వారు గత్యంతరంలేక వేరేప్రాంతానికి తరలివెళ్లారు. కానీ అక్కడ విద్యుత్, నీటి సరఫరా వంటి కనీస సౌకర్యాలు లేవు. వీరిని పట్టించుకునే నాథుడు కూడా లేడు. దీంతో ఈ ప్రాంతంలో నివసించే వారంసా తమ ప్రతినిధిగా మహేంద్ర పాట్నీని నిలబెట్టారు. ఏ రాజకీయ పార్టీ మద్దతు లేకున్నా స్వతంత్రంగా బరిలోకి దింపుతున్నారు. 2010లోనూ మహెంద్ర పాట్నీ నివసించే మురికివాడను అధికారులు తొలగించారు. మహాత్మా గాంధీకి అంకితం చేస్తూ ప్రభుత్వం నిర్మించిన దండీ కుటీర్ మ్యూజియం కోసం వీరి గుడిసెలను తొలగించారు. ఇప్పుడు మళ్లీ మరోమారు ఓ హోటల్‌కు దారికోసం వీరి కాలనీని కాళీ చేయించారు. దీంతో తమ సమస్యను పరిష్కరించునేందుకు అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయించుకుని మహేంద్ర పాట్నీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఎన్నికలకు ముందు ఓట్ల కోసం అన్ని రాజకీయ పార్టీలు తమ వద్దకు వస్తాయని, కానీ ఎన్నికల తర్వాత తమ గోడు ఎవరూ వినిపించుకోవడం లేదని వీరు వాపోతున్నారు. అందుకే తామే స్వతంత్రంగా బరిలోకి దిగుతున్నట్లు చెప్పారు. అయితే ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా వచ్చి తమ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇస్తే పోటీ నుంచి తప్పుకుంటానని మహేంద్ర పాట్నీ చెబుతున్నాడు. తాము నివసించేందుకు శాశ్వతంగా ఒక స్థలాన్ని కేటాయించాలని కోరుతున్నాడు. అంతేకాదు తమ దుకాణాలు, తోపుడు బండ్లను అధికారులు తరచూ సీజ్ చేస్తున్నారని, తిరిగి వాటిని విడిచిపెట్టేందుకు రూ.2500-3000 తీసుకుంటున్నారని తెలిపాడు. ఇలా జరగకుండా ఆపాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు డిసెంబర్ 2, 5 తేదీల్లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు డిసెంబర్ 8న ప్రకటిస్తారు. చదవండి: అది మసాజ్ కాదు.. ట్రీట్మెంట్.. జైలు వీడియోపై ఆప్ కౌంటర్.. -
ఐశ్వర్యం వస్తుందని.. బాలుడి నరబలి
న్యూఢిల్లీ: మూఢనమ్మకం అభంశుభం తెలియని ఓ ఆరేళ్ల చిన్నారి ప్రాణం తీసింది. సంపద వస్తుందనే అంధ విశ్వాసంతో మానవత్వం మరిచి పసివాడిని నరబలి ఇచ్చారు. దేశ రాజధానిలో∙ఈ ఘోరం చోటుచేసుకుంది. బిహార్‌కు చెందిన అజయ్ కుమార్, అమర్ కుమార్ దక్షిణ ఢిల్లీ లోధి కాలనీలోని మురికివాడలో ఉంటున్నారు. అక్కడే యూపీకి చెందిన బాధిత బాలుడి కుటుంబం ఉంటోంది. వీరంతా భవన నిర్మాణ కార్మికులు. అజయ్, అమర్ శనివారం రాత్రి తమ గుడిసెలో పాటలు పాడుతూ పూజలు మొదలుపెట్టారు. అది చూసేందుకు బాలుడు వెళ్లాడు. పూజలు ముగిశాక అందరూ ఇళ్లకు వెళ్లిపోయారు. కానీ, తన కుమారుడు ఎంతకీ రాకపోయేసరికి వెతుక్కుంటూ తండ్రి వెళ్లాడు. ఆ గుడిసెలో నుంచి రక్తం చారికలుగా ప్రవహిస్తూ కనిపించింది. లోపల మంచం కింద తన కొడుకు విగతజీవిగా పడి ఉండటంతో హతాశుడయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డబ్బు వస్తుందనే మూఢ నమ్మకంతోనే తమ వద్దకు వచ్చిన బాలుడి తలపై మోది, చాకుతో గొంతుకోసి చంపినట్లు అజయ్, అమర్ పోలీసుల విచారణలో వెల్లడించారు. -
ఆమె చూపిన అధోజగత్తు..
‘ఘోడే కో జలేబి ఖిలానే లేజా రియా హూ’ సినిమా జూన్ 10న రిలీజైంది. దీని అర్థం ‘గుర్రానికి జిలేబీ తినిపించడానికి తీసుకెళుతున్నా’. పాత ఢిల్లీ అధోజగత్ జీవులపై తీసిన ఈ సినిమా అంతర్జాతీయ ఖ్యాతి పొంది ‘సండాన్స్ ఫెస్టివల్’లో ఏకైక భారతీయ ఎంట్రీగా ఎంపికైంది. వందల కోట్లు ఖర్చు పెట్టి అధివాస్తవిక కథలను తీస్తున్న ఈ రోజుల్లో అతి తక్కువ ఖర్చుతో తీసిన గొప్ప వాస్తవ సినిమాగా దీనిని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రశంసిస్తున్నారు. దర్శకురాలు అనామిక హక్సర్ ఏడేళ్ల పాటు పరిశోధన చేసి ఈ సినిమా ఎందుకు తీసింది? అంత గొప్ప దర్శకురాలిగా ఎలా మారింది? ‘మురికివాడల జనులు’, ‘అధోజగత్ జీవులు’ మళ్లీ భారతీయ సినిమా మీద కనిపిస్తున్నారు. కథలో పాత్రలు అవుతున్నారు. ఇటీవలే నాగపూర్ మురికివాడల మీద ‘ఝుండ్’ సినిమా వచ్చింది. ఏకంగా అమితాబ్ బచ్చన్ నటించాడు. దానికి ముందు ‘గల్లీబాయ్’లో రణ్వీర్ సింగ్ నటించాడు. ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ అందరికీ తెలిసిందే. దీనంతటిని మొదట మీరా నాయర్ ‘సలాం బాంబే’తో మొదలుపెట్టింది. ఆమె ఆ సినిమా తీసేంత వరకూ మురికివాడలనేవి ఎంత ఘోరంగా ఉంటాయో వాటిలోని మనుషుల జీవితాలు ఎంత దారుణంగా ఉంటాయో ప్రేక్షకులకు తెలియదు. నిజానికి ఆ కథలు, గాథలు అనంతం. కాని కమర్షియల్ సినిమాకు అది ‘లాభసాటి’ బేరం కాదు. అందుకని గొప్ప గొప్ప దర్శకులు కూడా ఆ వైపు చూడరు. కాని ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరు వారి జీవితాల్లో కెమెరాను పెడదామనుకుంటారు. వారి ఆక్రందనల ఎదుట మైక్రోఫోన్‌ను ఉంచుదామనుకుంటారు. అప్పుడు ఆ చేదు వాస్తవానికి ప్రపంచం ఉలిక్కి పడుతుంది. ఒక పెద్ద ప్రపంచం తమకు సంబంధం లేకుండా బతుకుతుందని తెలుసుకుంటుంది. తాజాగా అనామిక హక్సర్ ఈ పని చేసింది. ఘోడే కో జలేబి ఖిలానే లేజారియా హూ... గుర్రానికి గడ్డి పెడతారు ఎవరైనా. జిలేబీ పెడతారా? ఇప్పుడు పాత ఢిల్లీగా అందరూ పిలుస్తున్న నగరం పేరు ‘షాజహానాబాద్’. ఎప్పుడో షాజహాన్ ఈ నగరాన్ని నాలుగు గోడల మధ్య నిర్మించాడు. కాని ఇప్పుడు ఇక్కడ అన్ని మతాల వాళ్లు, అన్ని వర్గాల వాళ్లూ జీవిస్తుంటారు. అందరూ నిరుపేదలు. కూలీలు. చిల్లర బేరగాళ్లు. బిచ్చగాళ్లు. పిక్పాకెటర్లు. మురికివాడల జనులు. దర్శకురాలు అనామిక హక్సర్‌ది కూడా పాత ఢిల్లీయే. వాళ్ల ఇంటి దగ్గర ఒక జట్కా ఉండేది. ఆ జట్కావాడు ఆదరాబాదరా గుర్రాన్ని తీసుకుపోతుంటే అనామిక హక్సర్ ‘ఏంటి అంత కొంపలు మునిగేంతగా గుర్రాన్ని ఎక్కడకు తీసుకెళుతున్నావు?’ అనడిగితే ఆ జట్కావాడు వ్యంగ్యంగా ‘జలేబీ తినిపించడానికి’ అని సమాధానం ఇచ్చాడు. తాత్పర్యం ఏమింటంటే ‘పిర్ర గీరుకోవడానికి టైము లేదు. పరిగెత్తి పోయి పనులు చేయకపోతే కడుపెలా నిండుతుంది’ అని. నేటికీ పాత ఢిల్లీలో ఎవరికీ తల గీరుకోవడానికి కూడా టైమ్ ఉండదు. ఉదయం లేస్తే బతుకుబాదరబందీ కోసం పరుగులెట్టాల్సిందే. కష్టపడో, మోసం చేసో బతకాల్సిందే. అందుకే అదే టైటిల్ పెట్టి సినిమా తీసింది అనామిక హక్సర్. నాలుగు పాత్రల కథ ఈ సినిమాలో నాలుగు పాత్రలు ఉంటాయి. ఒకడు పిక్‌పాకెటర్. ఒకడు టూరిస్ట్ గైడ్. ఒకడు కచోరీవాలా (కచోరీలు అమ్మేవాడు). ఒకడు హమాలీ. ఈ నలుగురి జీవితాలు, వీరి చుట్టూ ఉండే అనేకానేకమంది జీవితాలు... వారి కోరికలు, కలలు, ఆరాటలు, దిగుళ్లు, సాహసాలు, వ్యంగ్యం, హాస్యం... వీటన్నింటిని రక్తమాంసాలతో పట్టుకోవాలని నిశ్చయించుకుంది అనామిక హక్సర్. అందుకే మూడు నాలుగేళ్ల పాటు మనుషుల్ని స్టడీ చేయడమే పనిగా పెట్టుకుంది. కథ జరిగేది పాత ఢిల్లీ కాబట్టి అక్కడ ఎక్కువగా ఉర్దూ మాట్లాడతారు కాబట్టి సినిమా అంతా ఉర్దూ సంభాషణలు ఉంటాయి. కథనం నేరుగా సినిమా కథనంలాగా ఉండదు. సన్నివేశాలు, మధ్యలో డాక్యుమెంటరీల్లా ఇంటర్వ్యూలు, సింబాలిజం, సర్రియలిజం... ఇవన్నీ ఉంటాయి. ఒక విధంగా ఇది ‘మేజిక్ రియలిజం’లో చెప్పిన సినిమా. ప్రేక్షకులు రకరకాల మీడియమ్స్ ద్వారా కథను అర్థం చేసుకుంటారు. ఇంత సంక్లిష్టమైన నేరేషన్‌తో సినిమాను చెప్పినా గొప్ప సహానుభూతిని సాధించడం ద్వారా అనామిక హక్సర్ ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకుంది. విదేశీ పత్రికలు ఈ సినిమాపై గొప్ప రివ్యూలు రాశాయి. రెండు దారులు ఈ సినిమాలో టూరిస్ట్ గైడ్ రోజూ విదేశీ టూరిస్ట్‌లను పాత ఢిల్లీలో ‘హెరిటేజ్ వాక్’ చేయిస్తుంటాడు. అంటే మొఘల్ కట్టడాల గొప్పదనం చూపిస్తుంటాడు. కాని ఒకరోజు కథలోని పిక్‌పాకెటర్ తాను ‘రియల్ వాక్’ చేద్దామనుకుంటాడు. అంటే టూరిస్ట్ గైడ్ హెరిటేజ్ వాక్ చేస్తుంటే పిక్ పాకెటర్ అసలైన పాతఢిల్లీలోని పాత్రల మధ్య తన వాక్ కొనసాగిస్తాడు. అంటే ఏకకాలంలో ‘మా తాతలు నేతులు తాగారు’ భావన, అదే సమయంలో ‘పట్టెడు మెతుకులు లేని స్థితి’ని పక్కపక్కనే చూస్తారు ప్రేక్షకులు. ‘మనుషులంతా తాము బాగుండాలని అనుకుంటారు. కొద్దోగొప్పో బాగుండాలని. చిన్న చిన్న కలలు కంటారు. కాని అవేవీ తీరని వారు ఎలాగోలా తమ బతుకును అలంకరించుకోవడానికి పెనుగులాడతారు. ఆ విషయాన్నే ఈ సినిమా చెబుతుంది’ అంటుంది అనామిక హక్సర్. అతి తక్కువ చోట్ల ఈ సినిమా ఆడుతోంది. కాని త్వరలో ఓటిటిలో వస్తేనే అందరూ చూడగలరు. -
అదో మురికివాడ.. కానీ చాలా ప్రత్యేకం!
సాధారణంగా నిరుపేదలు ఎక్కువగా జీవించే ప్రదేశాలను మురికివాడలు అంటాం. నీటి ప్రవాహం, పారిశుధ్య వ్యవస్థ, కనీసం మౌలిక సదుపాయాలు లేని మురికి వాడల్ని చాలానే చూసుకుంటాం. కానీ బ్రెజిల్‌లోని రియోలో ‘శాంటా మర్ట ఫావెల’ అనే మురికివాడ చాలా ప్రత్యేకం. అత్యంత ఏటవాలైన, అందమైన మురికివాడ ఇది. అక్కడ ప్రజల్లో నైతికతను పెంపొందించేందుకు, అంటువ్యాధులను ఎదుర్కోవడానికి స్లమ్ పెయింటింగ్స్ అనే వినూత్న ప్రయోగమే.. ఈ మురికి వాడని ప్రపంచానికి ప్రత్యేకంగా పరిచయం చేసింది. నిత్యం రద్దీగా ఉండే, మురికి భవనాలను రంగుల కాన్వాస్‌గా మార్చి చూపించింది.ఇక్కడే మైకేల్ జాక్సన్ ప్రసిద్ధిగాంచిన ‘దే డోంట్ కేర్ అబౌట్ అస్’ పాట చిత్రీకరణ చేశారు. దానికి గుర్తుగా అక్కడ స్థానికులు మైకేల్ జాక్సన్ విగ్రహాన్ని కూడా పెట్టుకున్నారు. చదవండి: Cracked Heels Remedy: కాళ్ల పగుళ్లు వేధిస్తున్నాయా.. గోరువెచ్చటి నీటిలో కాస్తంత ఉప్పు వేసి. -
ఈ పిల్లలు మన పిల్లలు కాదా?
మన పిల్లలు స్కూళ్లకు వెళతారు. ఆపై ఉద్యోగాలకు వెళతారు. ఆపై జీవితాల్లో స్థిరపడతారు. కాని సమాజం ఒక కుటుంబం అనుకుంటే ఇవన్నీ దక్కని పిల్లలున్న భారతదేశం ఒకటి ఉంది. అది మురికివాడల భారతదేశం. ‘వాళ్లూ మన పిల్లలే. వాళ్లను ఇలాగే వదిలేస్తామా?’ అంటాడు అమితాబ్ ‘ఝండ్’లో. వ్యసనాలతో బాధ పడుతూ నేరాలు చేస్తూ జైళ్ల పాలవుతూ వీరు పడే సలపరింతకు సమాజానిదే బాధ్యత. వారి కోసం పట్టించుకుందాం అని గట్టిగా చెప్పిన ఝండ్ ఈవారం సండే సినిమా. ‘ప్రపంచ మురికివాడల సాకర్ కప్’కి ఇండియా టీమ్‌కు ఆహ్వానం అందుతుంది. ఆ టీమ్‌లో ఉన్నది ఎవరు? చెత్త ఏరుకుని జీవించే మురికివాడల పిల్లలు, తల్లిదండ్రులు నిరక్షరాస్యులు కావడం వల్ల చదువుకోలేకపోయిన ఆడపిల్లలు, కుటుంబ కష్టాల్లో ఉన్న మైనారిటీలు, రైళ్లలో బొగ్గు దొంగతనం చేసే దొంగలు, సారాయి బానిసలు, వైటనర్‌ను పీల్చే వ్యసనపరులు... వీళ్లంతా మహా అయితే 20 ఏళ్ల లోపు వారు. ఒక రకంగా వారి జీవితం నాశనమైపోయింది. కాని వారికి ఒక్క చాన్స్ ఇవ్వదలిస్తే? ఆ ఒక్క చాన్సే ‘వరల్డ్ హోమ్‌లెస్ సాకర్ కప్’లో పాల్గొనడమే అయితే... ఆహ్వానం అందింది కాని మరి అందుకు పాస్‌పోర్ట్‌లు? పాస్‌పోర్ట్ పొందడం ఈ దేశంలో కొంతమందికి ఎంత కష్టమో దర్శకుడు ఈ సినిమా లో వివరంగా చూపిస్తాడు. కొందరి దగ్గర పాస్‌పోర్ట్‌కు అప్లై చేయడానికి ఏ కాగితమూ ఉండదు. ఒకడికి పాస్‌పోర్ట్ ఇవ్వడానికి వాడి మీద ఉండే పోలీస్కేసు అడ్డంకిగా మారుతుంది. ఆ వంకతో వాడికి పాస్‌పోర్ట్ ఇవ్వడం మానేస్తే వాడు సమాజం మీద మరింత ద్వేషం పెంచుకుంటాడు. తనను తాను మరింతగా ధ్వంసం చేసుకుంటాడు. అందుకే వాడికి పా‹స్పోర్ట్ ఇప్పించేందుకు తానే జడ్జి ముందు మొరపెట్టుకుంటాడు ఫుట్‌బాల్ కోచ్ అయిన అమితాబ్. ‘మన కళ్లెదురుగా ఉన్నదే మనకు తెలిసిన భారతదేశం కాదు. మనం చూడని భారతదేశం ఒకటి ఉంది. దానిని చూడకుండా మన కళ్లకు అడ్డుగా ఒక పెద్ద గోడ ఉంది. ఆ గోడ అవతల ఎంతోమంది బాల బాలికలు దీనమైన బతుకులు బతుకుతున్నారు. సమాజం పట్టించుకోకపోవడం వల్ల అరాచకంగా మారి సమాజం దృష్టిలో మరింత చెడ్డ అవుతున్నారు. ఈ పిల్లలు అద్భుతంగా ఫుట్‌బాల్ ఆడుతున్నారు. వీరు ఇలాంటి ఆటల్లో పడితే, వ్యసనాల నుంచి బయటపడి ఒక అర్థవంతమైన బతుకు బతుకుతారు’ అంటాడు అమితాబ్. ఝండ్ (గొడ్ల గుంపు. స్లమ్ పిల్లల ఫుట్‌బాల్ టీమ్‌ను కనీసం టీమ్ అనైనా పిలవకుండా గొడ్లగుంపు అని పిలుస్తారు డబ్బున్నవాళ్లు ఈ సినిమాలో) మార్చి 4న విడుదలైంది. అమితాబ్ ప్రధాన పాత్రలో నటించాడు. మిగిలిన వాళ్లలో చాలామంది స్లమ్ కుర్రాళ్లు నటించారు. మరాఠీలో ‘సైరాట్’ తీసి భారీ పేరు గడించిన దర్శకుడు నాగరాజ్ మంజులే ఈ సినిమాతో కూడా ప్రశంస లు అందుకుంటున్నాడు. ఈ సినిమాను నాగ్‌పూర్‌కు చెందిన విజయ్ బర్సే అనే టీచర్ జీవితం ఆధారంగా తీశారు. ఆ పాత్రనే అమితాబ్ పోషించాడు. నాగ్‌పూర్‌లో ఒక కాలేజ్ లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా పని చేసిన విజయ్ బర్సే ఆ పక్కనే ఉండే మురికివాడల్లోని పిల్లలు అద్భుతంగా ఫుట్‌బాల్ ఆడటం చూసి వారికోసం ‘స్లమ్ సాకర్ క్లబ్’లను స్థాపించాడు. వారికి కొత్త జీవితం ప్రసాదించాడు. అందుకు తగ్గట్టుగా ‘ఝండ్’ మొత్తం సినిమాను నాగ్‌పూర్‌లో తీశారు. అయితే ఈ సినిమా చూస్తున్నంతసేపూ ఇది నాగ్‌పూర్‌కు చెందినది మాత్రమే కాదని, దేశంలో ఉన్న ఏ మురికివాడకు చెందిన కథేనేమోనని అనిపిస్తుంది. ముఖ్యంగా పాత్రలను మురికివాడల నుంచే తీసుకోవడం వల్ల వారి బతుకు తీవ్రమైన వేదన కలిగిస్తుంది. మర్యాదకరమైన జీవితాన్ని అనుభవిస్తున్న మధ్యతరగతి, ధనిక వర్గాలతో పోలిస్తే వారి జీవితంఘోరంగా ఉంటుంది. సమాజపు ఫలాలకు వారూ హక్కుదారులే. వారూ దేశం బిడ్డలే. వారూ అందరిలాంటి పిల్లలే. వారి కోసం ఎందుకు సమాజం ఆలోచించదు? ఎందుకు వారిని ఈసడించుకుని పదే పదే వారిని మరింత నిరాశలోకి తిరుగుబాటులోకి నెడుతుంది అనిపిస్తుంది. ఈ కథలో నాగ్‌పూర్‌లోని ఒక మధ్యతరగతి కాలనీని ఆనుకుని ఉండే మురికివాడలోని పిల్లలకు ఆ మధ్యతరగతి కాలనీలో నివసించే అమితాబ్ దగ్గర అవుతాడు. అప్పటికే వాళ్లు అరాచకంగా ఉంటారు. వారికి జీవితం మీద ఏ ఆశా లేదు. వారికి ఫుట్‌బాల్ ఆడితే డబ్బు ఇస్తూ ఆ ఆట మీద మోజు కలిగిస్తాడు. మెల్లమెల్లగా వారికి ఆ ఆట నిజమైన నషాగా మారుతుంది. అందరూ ఆటగాళ్లు అవుతారు. అప్పుడు అమితాబ్ తన కాలేజీలో దేశంలోని అన్ని మురికివాడల టీమ్‌లను పిలిపించి జాతీయ టోర్నమెంట్ ఆడిస్తాడు. ఆ తర్వాత ఈ టీమ్లన్నింటి నుంచి ఒక టీమ్ తయారు చేసి వరల్డ్‌కప్‌కు తీసుకువెళతాడు. అయితే ఆ మొదలు నుంచి ఈ చివరకు మధ్య ఎన్నో బరువెక్కే సన్నివేశాలు. కన్నీటి గాధలు. నిస్సహాయ క్షణాలు. సామాజిక చైతన్యం కలిగించే ఇటువంటి కథలకు హిందీలో పెద్ద పెద్ద స్టార్లు మద్దతు ఇస్తున్నారు. రణ్వీర్ సింగ్ ‘గల్లీ బాయ్’ చేశాడు. అమితాబ్ ‘ఝండ్’ చేశాడు. దక్షిణాదిలో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరగాలి. మనం రోడ్డు మీద వెళుతున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర పిల్లలు బిచ్చమెత్తుతూ కనిపిస్తే తప్పక ‘ఝండ్’ సినిమా గుర్తుకొస్తుంది. ఎందుకంటే అది చూపే ప్రభావం అలా ఉంటుంది. చూడండి. -
కలలో రాజకుమారి
తానొక రాజ కుమారిగా మారినట్టు కల కనే హక్కు ప్రతి అమ్మాయికీ ఉంటుంది. అయితే ఆ కల అందరికీ నిజం కాదు. నిజం కాదని అందరికీ తెలుసు. కాని కొందరు కలను నిజం చేసుకుంటారు. ముంబై వర్లీ సమీపంలో మురికివాడలో నివసించే 13 ఏళ్ల మలీషా ఖర్వా యూ ట్యూబ్‌లో ప్రియాంకా చోప్రా ర్యాంప్ వాక్‌ను చూసి తానొక మోడల్ని, డాన్సర్‌ని కావాలనుకుంది. అయితే ఆమె చాలా గట్టిగా అనుకుంది. విశ్వమంతా కుట్ర చేసి మరీ ఆమె కలను నిజం చేశాయి. ఇటీవల ఆమెపై నిర్మించిన డాక్యుమెంటరీ ‘లివ్ యువర్ ఫెయిరీటేల్’ విడుదలైన సందర్భంగా మలీషా పరిచయం. మలీషా ఖ్వారా వాళ్ల నాన్న చిన్న పిల్లల బర్త్‌డే పార్టీల్లో ‘జోకర్’ వేషం వేసుకుని వినోదం అందించి ఆ వచ్చే కొద్దిపాటి డబ్బుతో బతుకుతుంటాడు. ముంబైలో మురికివాడలో బతకడమే ఒక పెద్ద యుద్ధం అతనికి. అతని కుమార్తె 13 ఏళ్ల మలీషా మాత్రం ఆ జీవితంతో రాజీ పడదల్చుకోలేదు. ఒకసారి ఫోన్లో ఎవరో యూ ట్యూబ్‌లో ఆ అమ్మాయికి ప్రియాంకా చోప్రా ర్యాంప్‌వాక్ చూపించారు. ‘ఇలా నడవాలంటే ఏం చేయాలి’ అని అడిగింది మలీషా. ‘మోడల్ అవ్వాలి’ అని చెప్పారు ఎవరో. అప్పుడే నిశ్చయించుకుంది మోడల్ అవ్వాలని. ఆ తర్వాత డాన్సర్ కూడా అవ్వాలని. ఆ కలకు తోడు హాలీవుడ్ నటుడు రాబర్ట్ హాఫ్‌మేన్ ఒక మ్యూజిక్ వీడియో కోసం ఇండియా వచ్చి అందులో నటించడానికి కావలిసిన అమ్మాయి కోసం ముంబై మురికివాడల్లో తిరగసాగాడు. అప్పుడే మలీషా మరో కజిన్‌తో అతణ్ణి కలిసింది. హాఫ్‌మేన్ మలీషాను గమనించాడు కాని ఇంకా చిన్నపిల్ల... వీడియోకు పనికి రాదని అనుకున్నాడు. కాని మాటల్లో ‘నువ్వేం అవుదామనుకుంటున్నావు’ అని అడిగితే ‘నేను మోడల్ అవుదామనుకుంటున్నాను’ అని చాలా ఆత్మవిశ్వాసంతో మలీషా చెప్పిన తీరు హాఫ్మేన్కు నచ్చింది. ‘అయితే నీకు సాయం చేస్తాను. నీ పేరుతో ఇన్స్టాగ్రామ్ పేజీ ఓపెన్ చేస్తాను’ అని ఆమె పేరుతో ఇన్స్టాగ్రామ్ పేజీ ఓపెన్ చేశాడు. మలీషా ఫొటోలు అందులో పోస్ట్ చేశాడు. ఆ ఫొటోలలో మలీషా ముగ్ధత్వాన్ని, రూపాన్ని, నవ్వును ఇష్టపడిన నెటిజన్లు అతి త్వరలోనే దాదాపు లక్షన్నర ఫాలోయెర్స్గా మారారు. డాక్యుమెంటరీ డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్స్ జస్గురు, అర్సలా ఖురేషి కలిసి మలీషా మరో నలుగురు స్లమ్ పిల్లల మీద ‘లివ్ యువర్ ఫెయిరీటేల్’ డాక్యుమెంటరీ తీశారు. అనుకున్నది సాధించడానికి స్లమ్స్, పేదరికం, పరిమితులు అడ్డం కావని ఈ డాక్యుమెంటరీ చెబుతుంది. దీనిని మొన్న (ఏప్రిల్ 16) మలీషా అఫీషియల్ యూట్యూబ్ చానెల్లో విడుదల చేశారు. మలీషా గ్లామర్ రంగంలో భవిష్యత్తులో ఎన్నో వండర్స్ చేయనుంది. మనం వాటిని చూడనున్నాం. ఆల్‌ది బెస్ట్ మలీషా. కవర్ గర్ల్ అంతర్జాతీయ పత్రిక ‘పీకాక్ మేగజీన్’ మలీషాను అక్టోబర్ 2020న కవర్ పేజీ మీద వేసి ‘ద ప్రిన్సెస్ ఫ్రమ్ ది స్లమ్’ పేరుతో లోకానికి పరిచయం చేశాక మలీషాకు ఫొటోషూట్ల గిరాకీ అమాంతం పెరిగింది. పీకాక్ మేగజీన్ కోసం ఆ ఫొటోషూట్ నిర్వహించిన జంట షేన్–ఫాల్గుణి పీకాక్‌లు మలీషాతో ఫొటోషూట్ అనుభవాలను చెప్తూ ‘ఫొటోషూట్ వరకూ మలీషా ఎంత ఆంబీషియసో వింటూ వచ్చాం. కాని ఫొటోషూట్‌లో ఆ అమ్మాయి అంకితభావం చూశాక పెద్ద పెద్ద కలలు కనే యోగ్యత ఉందని అనుకున్నాం. ఆ అమ్మాయి చాలా శ్రద్ధగా పని చేసింది’ అన్నారు. – సాక్షి ఫ్యామిలీ -
ముంబై మురికివాడ ప్రపంచానికి అడుగుజాడ
ముంబై : వాళ్లంతా నిరుపేదలు, రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు. కిక్కిరిసినట్లుండే జనం. 10 లక్షల మంది జనాభాతో ఆసియా లో అతి పెద్ద మురికివాడ ధారావి. ఏప్రిల్ 1న అక్కడ మొదటి కరోనా కేసు వెలుగులోకి రాగానే అందరూ తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. కరోనా బాం బు పేలి శవాల దిబ్బగా మారుతుందని అనుకున్నారు. కానీ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చేసిన కృషి అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంది. డబ్ల్యూహెచ్ఓ ధారావిలో కరోనా కట్టడి చర్యల్ని కొనియాడింది. కోవిడ్–19ను నియంత్రించడం లో ప్రపంచ దేశాలకు ఆదర్శనీయంగా నిలిచిన ధారావి మురికివాడ మెరిసిన ముత్యం లా తళుకులీనుతోంది. ముంబైలో కేసులు విశ్వరూపం దాల్చి సినీ ప్రముఖుల్ని కూడా భయపెడుతున్న వేళ ధారావిలో కరోనా కేసులు రోజుకి రెండు లేదంటే మూడు మాత్రమే నమోదవుతున్నాయి. సామాజిక భాగస్వామ్యంతో ధారావి కరోనా చీకట్లను పారద్రోలి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది. సవాళ్లు ► సుమారు 2.5 చ. కి మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ధారావిలో జనాభా 10 లక్షలు. ఒకే చిన్న గదిలో 8–10 మంది నివాసంతో భౌతిక దూరాన్ని పాటించడం అసాధ్యం ► కమ్యూనిటీ టాయిలెట్స్ మీద ఆధారపడిన 80% ప్రజలు ► ప్రతి రోజూ 450 కమ్యూనిటీ టాయిలెట్స్ వినియోగం ► స్ట్రీట్ ఫుడ్‌పై ఆధారపడిన అత్యధిక జనం 4 టీ ఫార్ములా ► ట్రేసింగ్ 47,500 గృహాలకు వైద్యులు స్వయంగా వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితి విచారించారు. ప్రతీ ఒక్క కేసు నమోదవగానే వారితో కాంటాక్ట్ అయిన 24 మందిని గుర్తించారు. వైద్యలు ప్రతీ రోజూ వచ్చి వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించేవారు. ఇలా 59 వేల మందిని గుర్తించారు. ► ట్రాకింగ్ 6 లక్షల మందిని స్క్రీన్ చేశారు. ప్రతీ ఒక్క పాజిటివ్ కేసుకి 5 మందిని క్వారంటైన్‌కి తరలించారు. ► టెస్టింగ్ 13,500 కోవిడ్ పరీక్షలు నిర్వహించారు ► ట్రీటింగ్ ధారావిలో ఉన్న వారు బయటకు అడుగు పెట్టకుండా విస్తృతంగా మౌలికసదుపాయాలు కల్పించారు.కేవలం 14 రోజుల్లో 200 పడకల తాత్కాలిక ఆస్పత్రిని నిర్మించి సీరియస్ కేసులకు చికిత్స అందించారు. స్వల్ప లక్షణాలున్నవారిని క్వారంటైన్ హోమ్స్‌కి తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. పాఠశాలలు, ఫంక్షన్ హాళ్లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లను క్వారంటైన్ హోమ్స్‌గా మార్చారు. కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేసి అందరి కడుపు నింపారు. కమ్యూనిటీ టాయిలెట్లను రోజుకి నాలుగైదు సార్లు శానిటైజ్ చేశారు. -
కరోనా కట్టడిలో ధారావి భేష్
సాక్షి, ముంబై: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఉగ్రరూపం చూపిస్తున్న వేళ దానిని కట్టడి చేయడం సాధ్యమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆశాభావం వ్యక్తం చేసింది. ఆసియాలోనే అతి పెద్ద మురికివాడ అయిన ముంబైలోని ధారావి దీనికి అతి పెద్ద ఉదాహరణ అని ప్రశంసించింది. కరోనా బాంబు పేలుతుందనుకున్న ప్రాంతంలో కట్టుదిట్టమైన ప్రణాళికతో కరోనాని కట్టడి చేశారంటూ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయేసస్ ధారావిలో తీసుకున్న చర్యల్ని కొనియాడారు. జన సాంద్రత అత్యధికంగా ఉన్న ధారావిలో భౌతిక దూరం పాటించడం అసాధ్యమని అందరూ అనుకున్నారు. కానీ ప్రభుత్వం టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ విధానం ద్వారా మూడు నెలల్లోనే కరోనాని నియంత్రించింది. శుక్రవారం టెడ్రోస్ వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ సామాజిక సహకారం, జాతీయ ఐక్యత, ప్రపంచ సంఘీభావంతో తీసుకునే చర్యల ద్వారా కరోనాకు అడ్డుకట్ట వేయగలమని అన్నారు. ఇటీవల చాలా దేశాల్లో కరోనా తీవ్రత పెరిగిపోతూ ఆందోళన పెంచుతున్న సమయంలో ధారావిలో తీసుకున్న చర్యలు వైరస్‌ని నియంత్రించగలమన్న భరోసాని నింపుతున్నాయని ప్రశంసించారు. ‘కరోనాని మనం కట్టడి చేయగలం. ఇటలీ, స్పెయిన్, దక్షిణ కొరియా, «ముంబైలో జనసాంద్రత్య అత్యధికంగా ఉన్న ధారావి.. ఇలా ఎన్నో ఉదాహరణలున్నాయి’అని టెడ్రోస్ పేర్కొన్నారు. సమర్థవంతమైన నాయకత్వం, వివిధ వర్గాల భాగస్వామ్యం, సమష్టి బాధ్యతతో వైరస్‌ను నియంత్రించగల మన్నారు. టెస్టింగ్, ట్రేసింగ్, ఐసోలేటింగ్, ట్రీటింగ్ విధానం ద్వారా కరోనా చైన్‌ను బద్దలు కొట్టవచ్చునని టెడ్రోస్ పేర్కొన్నారు. మరోవైపు కజకిస్తాన్‌లో న్యుమోనియా లక్షణాలతో వస్తున్న కేసులు కరోనా వైరస్‌కి చెందినవేనని డబ్ల్యూహెచ్ఓ అదికారి డాక్టర్ ర్యాన్ అనుమానం వ్యక్తం చేశారు. కజకిస్తాన్‌లో ఇప్పటివరకు 50 వేలకు పైగా న్యుమోనియా కేసులు నమోదయ్యాయి. -
మురికివాడలో అగ్నికీలలు..
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని తుగ్గకాబాద్ ప్రాంతంలో ఓ మురికివాడలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 200 గుడిసెలు దగ్ధమవడంతో వందలాది మంది నిరాశ్రయులయ్యారు. వాల్మీకి బస్తీలో అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతానికి అగ్నిమాపక యంత్రాలు చేరుకుని మంటలను ఆర్పివేశాయి. రాత్రి 1.30 గంటల ప్రాంతంలో ఘటనకు సంబంధించి సమాచారం అందగానే 20 అగ్నిమాపక యంత్రాలను హుటాహుటిన తరలించామని, ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని అధికారులు వెల్లడించారు. కాగా ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లకపోవడం ఊరట కలిగిస్తోంది. మరోవైపు ఇదే ప్రాంతంలో మే 26న సిలిండర్ పేలడంతో వందలాది గుడిసెలు దగ్ధమయ్యాయి. చదవండి: కరోనా : కొత్త యాప్ ప్రారంభించిన ఢిల్లీ సీఎం -
ధారావిలో ఒక్కరోజే 94 కరోనా కేసులు
సాక్షి, ముంబై : ఆసియాలోనే అతిపెద్ద మురికివాడల్లో ఒకటైన ముంబైలోని ధారావిలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లోనే 94 కొత్త కోవిడ్ కేసులు నమోదుకాగా, ఇద్దరు మరణించారు. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో ఒక్కరోజే ఇన్ని కేసులు నమోదవడం ఇదే తొలిసారి. ఇరుకైన వీధులు, అపరిశుభ్ర వాతావరణంతో పాటు ఒకే గదిలో పది నుంచి ఇరవై మంది వరకూ నివసించడం వల్ల ధారావిలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. పదిలక్షల మందికి పైగా నివసించే ఈ ప్రాంతంలో ఇప్పటివరకు 590 కి పైగా కోవిడ్-19 కేసులు నమోదుకాగా, మరణాల సంఖ్య 20కి పెరిగింది. (‘ధారావి’లో కరోనా విజృంభణ) ముంబై పురపాలక సంస్థ నుంచి కమ్యూనిటీ హెల్త్ కేర్ కార్మికులు, వైద్య బృందాలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఇతర సిబ్బంది ధారావిలో కోవిడ్–19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ మురికివాడపై ప్రత్యేక దృష్టి సారించారు. అయినప్పటికీ అత్యధిక జనసాంద్రత, ఇరుకు ప్రాంతం కావడంతో భౌతిక దూరం పాటించడం కష్టతరం అయ్యింది. దీంతో పరిస్థితిని అదుపు చేయడం అధికారులకుసవాల్గా మారింది. మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దేశంలో కరోనా మహమ్మరి వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే 40 వేలకిపైగా కేసులు నమోదు కాగా, అత్యధికంగా మహారాష్ర్టలోనే వెలుగుచేస్తున్నాయి. -
మురికివాడ నుంచి మ్యూనిక్ క్లబ్‌కు...
11 ఏళ్ల ఒడిశా కుర్రాడికి అరుదైన అవకాశం భువనేశ్వర్: ఒడిశా మురికివాడలోని పదకొండేళ్ల కుర్రాడికి... జర్మనీలోని ప్రముఖ ఫుట్‌బాల్ క్లబ్లో శిక్షణ పొందే అవకాశం వచ్చింది. భువనేశ్వర్‌లోని సబర్ షాహీ మురికివాడలో ఉండే చందన్ నాయక్... జర్మన్ జాతీయ చాంపియన్స్ బాయెర్న్ మ్యూనిక్‌లో రెండు నెలలపాటు శిక్షణ పొందనున్నాడు. పేదరికంతో తినేందుకు తిండిలేకపోయినా... భారత్‌కు ఫుట్‌బాల్ ఆడాలన్న కలను సాకారం చేసేందుకు చందన్ తీవ్రంగా శ్రమించాడని అతని కోచ్ మహాపాత్ర తెలిపారు. సాధారణంగా ప్రపంచ వ్యాప్తంగా 14 నుంచి 16 ఏళ్లలోపు వారిని పరీక్షించి ఈ శిక్షణ కార్యక్రమానికి ఎంపిక చేస్తారు. కానీ కోచ్ కోరిక మేరకు ఒకసారి పదకొండేళ్ల చందన్‌కు పరీక్ష పెట్టారు. ఈ చిన్నోడి చురుకుదనానికి ఆశ్చర్యపోయిన నిర్వాహకులు.. శిక్షణలో పాల్గొనే అవకాశం ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా 200 మందికి రానుపోనూ ఖర్చులతోపాటు.. అన్ని వసతులు కల్పించి.. ప్రపంచ స్థాయి కోచ్‌లతో ఈ క్లబ్లో శిక్షణ ఇస్తారని మహాపాత్ర తెలిపారు. చందన్ తండ్రి చిన్నప్పుడే కుటుంబాన్ని వదిలి వెళ్లినా... ఆమె తల్లి నాలుగిళ్లలో పనిమనిషిగా చేసి పిల్లలను ఉన్నత స్థానంలో చూసేందుకు చాలా కష్టపడిందన్నారు. -
మురికి కూపాల్లో జనావాసాలు
ఇండ్ల మధ్యలో నిలుస్తున్న మురుగునీరు చిత్తడవుతున్న అంతర్గత రోడ్లు ప్రబలుతున్న వ్యాధులు పట్టించుకోని అధికారులు దిలావర్పూర్ : పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు. 70శాతానికి పైగా ప్రజలు పల్లెలోనే జీవనం సాగిస్తున్నారు. అందుకే గాంధీజీ పల్లెలు బాగుపడితేనే దేశం బాగుపడుతుందన్నాడు. కానీ ప్రస్తుతం పల్లెలను పట్టించుకునే నాథుడు కూడా లేకుండా పోయాడు. కనీస సదుపాయాలకు నోచుకోవడం లేదు. గ్రామాభివృద్ధే ధ్యేయం అంటూ సభల్లో ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే నేతలు, అధికారులు పల్లె ముఖం చూడడం లేదు. ఇందుకు తార్కాణమే మండల కేంద్రమైన దిలావర్పూర్ గ్రామం. దిలావర్పూర్ గ్రామంలో ప్రస్తుతం గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పలు వార్డుల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే వ్యాధులు ప్రబలుతాయి అని జిల్లా అధికారులు తరచూ పేర్కొనే మాటలివి. వాస్తవానికి గ్రామంలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. డ్రై నేజీ వ్యవస్థ సక్రమంగా లేక మురుగునీరు ఇండ్ల మధ్యలో ప్రవహించి అంతర్గత రోడ్లపైకి వస్తోంది. దీంతో రోడ్లన్నీ బురదమయం కావడంతో ప్రజలు ఇండ్లలోంచి బయటకు వెళ్లాలంటేనే ఇబ్బందుల పాలవుతున్నారు. ఎక్కడికక్కడ మురుగునీరు నిలిచి ఉండడంతో దోమలు పెరిగి వ్యాధుల బారిన పడుతున్నామని గ్రామీణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టించుకోవాల్సిన స్థానిక పంచాయతీ పాలకవర్గం, అధికారులు సంబంధం లేనట్లు వ్యవహరిస్తోంది. సాక్షాత్తు గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసరాల్లోని ఇండ్ల మధ్య మురుగునీరు ప్రవహించి ఎక్కడికక్కడ నిలిచి పోవడంతో తీవ్ర దుర్గందంతో పాటు దోమల వ్యాప్తి అధికంగా ఏర్పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. అలాగే పలు వార్డుల్లో సైతం అంతర్గత రోడ్లు డ్రై నేజీలు లేని కారణంగా కురుస్తున్న వర్షాలకు జనావాసాలన్నీ కంపుకొడున్నా పట్టించుకోవడం లేదని ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రస్తుత వర్షా కాలంలో తాము ఇబ్బందులకు గురికాకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రుల పాలవుతున్నాం గామ్ గంగారాం, దిలావర్పూర్ తమ కాలనీలో అనేక రోజులుగా తీవ్ర సమస్యలు పడుతున్నా పట్టించుకునే వారు లేకుండా పోయారు. మా ఇండ్ల మధ్య మురుగునీరంతా ఒకచోటికి చేరి తీవ్ర దుర్గందం వ్యాపిస్తోంది. దోమలు, ఈగల బెడదతో నిత్యం ఇబ్బందులు పడుతూ జ్వరాల బారిన పడుతున్నాం. ఇకనైనా అధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలి. రోడ్లు బురదగా మారుతున్నాయి – ఖలీం, దిలావర్పూర్ గ్రామంలో డ్రెయినేజీలు సక్రమంగా లేకపోవడంతో ఎక్కడికక్కడ మురుగునీరు ప్రవహించి రోడ్లన్నీ బురదగా మారుతున్నాయి. నీరు నిలిచి ఉండడంతో దోమలు, ఈగలు అధికమయ్యాయి. దీంతో ఇండ్లలో నివసించాలంటేనే ఇబ్బందిగా ఉంది. పలుమార్లు పంచాయతీ వారికి తమగోడును విన్నవించినా పట్టించుకోవడంలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. దోమలతో వేగలేకపోతున్నం – చాతిరి లక్ష్మి, దిలావర్పూర్ రోడ్లు, మురుగు కాలువలు అధ్వానంగా ఉండడంతో రోజూ ఇబ్బందుల పాలవుతున్నం. నాలుగు రోజులగా వర్షం పడుతోంది. దీంతో నీరు అంతా రోడ్లపైకి రావడంతో దోమల బెడద ఎక్కువగా ఉంది. సర్కారోళ్లు ఇప్పటికైనా మమ్మల్ని పట్టించుకుని రోగాల బారిన పడకుండా చూడాలి. చర్యలు చేపడతాం.... – సరస్వతి, కార్యనిర్వహణాధికారిణి, దిలావర్పూర్ గ్రామ శివారు కాలనీలతో పాటు గ్రామంలోని కొన్ని వార్డుల్లో రోడ్లు బురదమయంగా ఉన్న మాట వాస్తవం. పరిస్థితి జఠిలంగా ఉన్న ప్రాంతాల్లో తక్షణ చర్యలు చేపట్టి మురుగునీరు నిలువ ఉండకుండా చేసి దోమల వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపడతాం. అలాగే ఇండ్ల మధ్యలో ఉన్న గుంతలను పూడ్చి నీరు నిలువ ఉండకుండా చర్యలు చేపడతాం. నూతనంగా రోడ్లనిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు పంపించాం. త్వరలోనే సీసీ రోడ్ల నిర్మాణాన్ని సైతం చేపట్టి ప్రజల ఇబ్బందులు తొలగిస్తాం. -
కోల్‌కత్తాలో అగ్నిప్రమాదం.. ఒకరి మృతి
కోల్కత్తా: కోల్‌కత్తాలో శనివారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. దమ్‌దమ్ పార్క్ సమీపంలో ఉన్న మురికివాడలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో ఒకరు మృతిచెందినట్టు తెలిసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. 12 అగ్నిమాపక యంత్రాలతో ఘటనా స్థలికి చేరుకున్నారు. ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. అందిన తాజా సమాచారం ప్రకారం.. ఈ ప్రమాదంలో కనీసం 8 గ్యాస్ సిలీండర్లు పేలినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
చిన్నవాడి పెద్ద మనసు
ఆదర్శం బడి అయిపోయిన తరువాత ఆరో క్లాసు పిల్లాడు ఏం చేస్తాడు? కాసేపు హోమ్‌వర్క్ చేస్తాడు. కాసేపు స్నేహితులతో ఆడుకుంటాడు. కాసేపు వీడియోగేమ్స్ ఆడుకుంటాడు. అంతేగా! కానీ లక్నోకు చెందిన పదకొండేళ్ల ఆనంద్ కృష్ణ మిశ్రా అలా కాదు. సాయంత్రం స్కూల్ నుంచి రాగానే మురికి వాడల్లోకి వెళ్లి పిల్లలకు పాఠాలు బోధిస్తాడు. ఆదివారం, సెలవు రోజుల్లో కూడా పిల్లలకు పాఠాలు చెప్పడంతోనే రోజంతా గడుపుతాడు. అందుకే ఆనంద్‌ని అందరూ ‘చోటా మాస్టర్జీ’ అని పిలుస్తారు. సుమారు 125 గ్రామాల్లో ఈ చోటా మాస్టర్జీ పాఠాలు బోధిస్తున్నాడు. స్కూల్లో తాను నేర్చుకున్న పాఠాలను మురికివాడల్లోని పిల్లలకు బోధిస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు. తన స్కూల్‌కు ‘బాల్ చౌపాల్’ (పిల్లల వరండా) అని పేరు కూడా పెట్టాడు. ‘‘లెక్కలు అంటే చాలా భయంగా ఉండేది. ఆనంద్ భయ్యా ఆ భయాన్ని పోగొట్టాడు. ఇప్పుడు నాకు మ్యాథ్స సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం’’ అని చెబుతున్నాడు లక్నోలోని ఒక మురికివాడకు చెందిన వికాస్ అనే నాలుగవ తరగతి విద్యార్థి. ‘‘స్కూల్లో టీచర్ పాఠం చెబుతున్నప్పుడు ఏదైనా డౌట్ వస్తే... టీచర్ ఎక్కడ తిడతాడో అని అడగడానికి భయం. భయ్యా దగ్గర అలా కాదు. డౌటు వచ్చిన వాళ్లను మెచ్చు కొని, డౌటు తీరే వరకు ఎంతసేపైనా ఓపిగ్గా చెబుతూనే ఉంటాడు’’ అంటుంది సునీత అనే విద్యార్థిని. ఇలాంటి కామెంట్లు ఓ అనుభవజ్ఞుడైన ఉపాధ్యాయుడి విషయంలోనే వింటాం. అలాంటిది ఓ పదకొండేళ్ల పిల్లాడి విషయంలో వినడం ఆశ్చర్యంగా లేదూ! ఆనంద్ చేసే పని అలాంటిది మరి. స్కూలుకు వెళ్లని వాళ్లే కాదు... వెళ్లే వాళ్లు కూడా ఈ చోటా మాస్టారి దగ్గర పాఠాలు వినడానికి ఉత్సాహం చూపడానికి కారణం... గణితం, కంప్యూటర్స్, ఇంగ్లిష్ సబ్జెక్ట్‌లను అరటి పండు ఒలిచి పెట్టినట్టు సులభంగా అర్థమయ్యేలా చెప్పడమే. చదువు చెప్పడమే కాదు... చదువు మానేసిన విద్యార్థులను ప్రోత్సహించి, తిరిగి బడిలో కూడా చేర్పిస్తున్నాడు ఆనంద్. అలా ఇప్పటి వరకు 700 మంది పిల్లలను బడిలో చేర్పించాడు. ‘‘తన చదువు మీద శ్రద్ధ పెట్టకుండా... మీవాడు ఇలా చేస్తున్నాడేమిటి!’’ అని కొంతమంది ఆనంద్ తల్లిదండ్రుల దగ్గర అంటుంటారు. అయితే ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖలో పనిచేసే ఆనంద్ తల్లిదండ్రులు అనూప్, రీనా మిశ్రాలు మాత్రం ఆ మాటలకు ఎంత మాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా కొడుకును అభినందిస్తారు. మంచి పని చేస్తున్నావు అంటూ ప్రోత్సహిస్తారు. తనను తలచుకుని గర్వపడుతుంటారు. నిజానికి బయట ఎంత సమయం వెచ్చించినా తన చదువును మాత్రం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు ఆనంద్. ఎప్పుడూ మంచి మార్కులే తెచ్చు కుంటాడు. అయినా అసలు ఇంత చిన్న వయసులో తనకు ఇంత సేవ చేయాలన్న ఆలోచన ఎలా వచ్చినట్టు! ఓసారి సెలవుల్లో ఆనంద్ కుటుంబం మహారాష్ట్రకు వెళ్లింది. ఓ రాత్రి పూట ఒక చోట డిమ్ లైట్ కింద ఒక పిల్లాడు శ్రద్ధగా చదువుకుంటున్నాడు. అతని దుస్తులు చిరిగి ఉన్నాయి. ఆ అబ్బాయిని చూస్తే బాధగా అనిపించింది ఆనంద్ తండ్రికి. దాంతో అతనికి కొత్త బట్టలు కొనిస్తాను అన్నాడు. దానికి ఆ అబ్బాయి ఒప్పుకోలేదు. ‘బట్టలు వద్దు, పుస్తకాలు లేవు, అవి ఇప్పించండి’ అన్నాడు. దాంతో ఆనందంగా ఆ పుస్తకాలు కొనిచ్చారు మిశ్రా. పుస్తకాలు చేతుల్లో ఉన్నప్పుడు ఆ పిల్లాడి కన్నుల్లో కనిపించిన వెలుగు ఇంతా అంతా కాదు. ట్రిప్ నుంచి తిరిగి వచ్చిన తరువాత కుటుంబమంతా కలిసి లక్నో చుట్టుపక్కల కొన్ని గ్రామాలకు వెళ్లారు. ఆ గ్రామాల్లో ఎందరో విద్యార్థులు చదువుకు దూరమై బాల కార్మికులయ్యారు. వాళ్లకీ ఏదో చేతనైనంత సాయం చేశారు. ఈ రెండు సంఘటనలూ ఆనంద్‌పై తీవ్ర ప్రభావం చూపించాయి. తనకు చదువు మీద మునపటి కంటే శ్రద్ధ పెరగడమే కాక బీద పిల్లలకు చదువు చెప్పాలనే కోరిక ెకలిగింది. నాటి నుంచీ అదే పని చేస్తున్నాడు ఈ బుల్లి మాస్టారు. ఆనంద్ సేవ అప్పుడే ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ‘సత్యపథ్ బాల్ రతన్’, ‘సేవా రతన్’ అవార్డ్‌లతో పాటు ఎన్నో అవార్డ్లు అతణ్ని వరించాయి. అయితే వాటిని పట్టించుకోడు ఆనంద్. తెలిసిన వాళ్లందరి దగ్గరా డబ్బులు సేకరించి మురికి వాడల్లో గ్రంథాలయాలను స్థాపించడానికి నడుం కట్టాడు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో మొదలుపెట్టాడు. తల్లి దండ్రులతో కలిసి ‘చలో పడో అభియాన్’ ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. ప్రతి విద్యావంతుడు తన బాధ్యతగా కనీసం ఒక్కరినైనా చదివించాలని, అండగా నిలవాలనేది దీని లక్ష్యం. దీనికి మంచి స్పందన వస్తోంది. అది చూసి ఆనంద్ పెదాల మీద చిరునవ్వు మెరుస్తోంది. అది చిరునవ్వు మాత్రమే కాదు... అతని ఆత్మవిశ్వాసానికి నిదర్శనం! -
మున్సిపాలిటీల్లో మురికివాడలే అధికం
32.18 శాతం మందికి సురక్షిత మంచినీరూ లేదు సాక్షి, హైదరాబాద్: మున్సిపాలిటీల్లో మురికివాడల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆయా ప్రాంతాల నుంచి పన్నులు సరిగా రావనే భావనతో వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. కొన్ని మున్సిపాలిటీల్లో సాధారణ ప్రజలకంటే మురికివాడల్లో నివసిస్తున్న వారే ఎక్కువగా ఉండటం విశేషం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న వివిధ పట్టణాభివృద్ధి పథకాలు నామమాత్రంగానైనా మురికివాడవాసులకు ఉపయోగపడడం లేదనే విషయం దీన్ని బట్టి స్పష్టమవుతోంది. వందలాది స్వచ్ఛంద సంస్థలు, జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ వంటి కార్యక్రమాలు మురికివాడ వాసులకు కనీస వసతులు కల్పించలేకపోయాయి. దేశంలోనే రెండో స్థానం: దేశంలోని మురికివాడల జనాభాలో మన రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. దేశంలోని మురికివాడల జనాభాలో 15.6 శాతం మంది జనాభా 13 జిల్లాల్లోనే ఉన్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. 111 మున్సిపాలిటీల్లో మురికివాడవాసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. వీధి దీపాలూ కరువే: పట్టణ స్థానిక సంస్థల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. మెజారిటీ మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు సకాలంలో నిధులు ఇవ్వకపోవడం, ఇచ్చినవాటిని సకాలంలో ఖర్చుచేయకపోవడం వంటి కారణంగా వీధి దీపాలు కూడా లేని పరిస్థితి కొనసాగుతోంది. కొన్ని చోట్ల వారానికోసారి కూడా మంచినీరు లభించ డం లేదు. పట్టణ స్థానిక సంస్థల్లో మురికివాడ వాసుల సంఖ్యే అధికంగా ఉంది.