
ఢిల్లీలోని తుగ్లకాబాద్ స్లమ్‌లో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని తుగ్గకాబాద్ ప్రాంతంలో ఓ మురికివాడలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 200 గుడిసెలు దగ్ధమవడంతో వందలాది మంది నిరాశ్రయులయ్యారు. వాల్మీకి బస్తీలో అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతానికి అగ్నిమాపక యంత్రాలు చేరుకుని మంటలను ఆర్పివేశాయి. రాత్రి 1.30 గంటల ప్రాంతంలో ఘటనకు సంబంధించి సమాచారం అందగానే 20 అగ్నిమాపక యంత్రాలను హుటాహుటిన తరలించామని, ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని అధికారులు వెల్లడించారు. కాగా ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లకపోవడం ఊరట కలిగిస్తోంది. మరోవైపు ఇదే ప్రాంతంలో మే 26న సిలిండర్ పేలడంతో వందలాది గుడిసెలు దగ్ధమయ్యాయి.