ఢిల్లీలో మరోసారి అగ్నిప్రమాదం | Fire breaks out in two factories in Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో మరోసారి అగ్నిప్రమాదం

Published Tue, Dec 24 2019 10:10 AM | Last Updated on Tue, Dec 24 2019 11:52 AM

Fire breaks out in two factories in Delhi - Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీ నరేలా ఇండస్ట్రియల్‌ ప్రాంతంలోని రెండు ఫ్యాక్టరీల్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ రెండు ఫ్యాక్టరీల్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 22 ఫైరింజన్లు సంఘటనా స్థలంలో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. మొదట ఓ షూ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించిందని, అక్కడి నుంచి పక్కనే ఉన్న మరో ఫ్యాక్టరీకి మంటలు వ్యాపించాయని తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement