
చెన్నై : దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) సోకిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో తమిళనాడులో బుధవారం తొలి కరోనా మరణం చేటు చేసుకుంది. మధురైలోని రాజాజీ ఆస్పత్రిలో కరోనా పాజిటివ్‌తో బాధపడుత్ను 54 ఏళ్ల వ్యక్తి మృతి చెందినట్లు తమిళనాడు ఆరోగ్య మంత్రి సీ విజయ్‌భాస్కర్ తెలిపారు. ఆ వ్యక్తి రక్తపోటుతో పాటు మధుమేహంతో బాధపడుతున్నట్లు ఆయన చెప్పారు. కరోనా లక్షణాలు ఉన్నమరో ముగ్గురిని గుర్తించి, ఐసోలేషన్‌లో ఉంచామని ఆయన వెల్లడించారు. దీంతో భారత్‌లో కరోనా మరణాల సంఖ్య 11కు చేరింది. కాగా, ఇప్పటివరకు దేశంలో 519 కరోనా పాజటివ్ కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరోవైపు తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 19కి చేరింది. (భారత్ @ 519)