పాట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితిన్ రాం మాంజీ కాన్వాయ్ లోని కారుకు నిప్పంటించిన ఘటన గయ జిల్లాలోని దమారియాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. లోక్ జన శక్తి పార్టీ (ఎల్ జేపీ) నాయకుడు సుధీష్ పాశ్వాన్ హత్యకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో పాల్గొని వస్తున్న ఆయన కాన్వాయ్ పై దాడిచేసిన కొందరు కారుకు నిప్పంటించారు. ఈ ఘటనలో మాంజీకి ఎటువంటి హానీ జరగలేదు.
దాడి ఘటనపై స్పందించిన ఎల్ జేపీ అధ్యక్షుడు రాంవిలాస్ పాశ్వాన్ ప్రభుత్వమే మాంజీపై దాడి చేయించిందని ఆరో్పించారు. మంగళ్ రాజ్ అంటే ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. ఎల్ జేపీ నాయకులపై దాడులు పెరిగాయని పాశ్వాన్ ఆరోపించారు. పంచాయత్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సుదీష్, అతని సోదరున్ని మావోయిస్టులు హత్య చేసినట్లుగా భావిస్తున్నారు .