టీచర్‌పై గ్యాంగ్ రేప్
మెయిన్‌పురి: ఉత్తర్‌ప్రదేశ్‌లో సోమవారం పట్టపగలు.. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలిపై ముగ్గురు కీచకులు సామూహిక అత్యాచారం చేసి ఆమె నగదు, నగలను దోచుకున్నారు. భోన్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగ్లా మధు ప్రాంతంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలైన బాధితురాలు.. స్కూల్‌కు నడిచి వెళ్తున్న క్రమంలో ముగ్గురు వ్యక్తులు ఆమెను అనుసరించి సమీపంలోని పొదల్లోకి లాక్కునివెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం.. ఆమె వద్ద ఉన్న రూ.5 వేల నగదు, ఒక పసిడి గొలుసును దోచుకుని పరారయ్యారు. కాగా, ఆ దారిలో వెళ్తున్న కొందరు వీరిలో ఒకరిని పట్టుకుని తమకు అప్పగించినట్టు పోలీసులు తెలిపారు.