
కార్టోశాట్–2డీతో భౌగోళిక సమాచారం
శ్రీహరికోట (సూళ్లూ రుపేట): దేశీయ అవసరాల కోసం , భౌగోళిక సమాచారం కోసం కార్టోశాట్ ఉపగ్రహాల సిరీస్‌ను 2005లోనే ఇస్రో రూపొందించింది. దీనిని 2007 నాటికి రూపకల్పన చేసి అదే ఏడాది జనవరి 10న పీఎస్‌ఎల్‌వీ సీ7 ద్వారా కార్టోశాట్–2, 2008 ఏప్రిల్ 28న పీఎస్‌ఎల్‌వీ సీ9 ద్వారా కార్టోశాట్–2ఏ, 2010 జులై 12న పీఎస్‌ఎల్‌వీ సీ15 ద్వారా కార్టోశాట్–2బీ, 2016 జూన్ 22న పీఎస్‌ఎల్‌వీ సీ34 ద్వారా కార్టోశాట్–2సీని కక్ష్యలోకి పంపారు. ఈ 4 ఉపగ్రహాలు ఇప్పటికే పని చేస్తున్నాయి. మరింత సమాచారాన్ని అందించేం దుకు బుధవారం 714 కిలోల బరువు ఉన్న కార్టోశాట్–2డీని పీఎస్‌ఎల్‌వీ సీ37 ద్వారా ప్రయోగించారు.
ఈ ఉపగ్రహం 510 కిలోమీటర్లు ఎత్తులోని సూర్యానువర్తన ధృవకక్ష్యలో పరిభ్రమిస్తూ భౌగోళిక పరమైన సమాచారాన్ని అందజేస్తుంది. అందులో అమర్చిన ఫ్రాంక్రో మాటిక్ మల్టీ స్పెక్ట్రల్ కెమెరా భూమిని పరిశోధిస్తూ నాణ్యమైన ఛాయాచిత్రాలను అందిస్తుం ది. పట్టణ, గ్రామీణాభివృద్ధి ప్రణాళికలు, తీర ప్రాంతాల నిర్వహణ, రహదా రుల పర్యవేక్షణ, నీటి పంపిణీ, భూ వినియోగంపై మ్యాప్‌లు తయారు చేయ డం, విపత్తుల విస్తృతిని అంచనా వేసే పరిజ్ఞానం, వ్యవసాయ సంబంధి తమై న సమాచారం దీని ద్వారా అందుబాటులోకి వస్తుంది. నిఘాలో తోడ్పాటుగా సైనిక అవసరాలకు ఉపయోగపడుతుంది. దీనికి రూ.350 కోట్లు వ్యయం చేసినట్టు సమాచారం. ఈ ఉపగ్రహం అయిదేళ్లపాటు సేవలు అందిస్తుంది.
నానోశాటిలైట్స్ పనితీరు: ఇస్రో నానో శాటిలైట్స్ (ఐఎన్‌ఎస్–1ఏ, ఐఎన్‌ఎస్–1బీ) ఉపగ్రహాలను కూడా ఈ ప్రయోగంలో కక్ష్యలోకి పంపారు. అహమ్మదాబాద్‌లో స్పేస్ అప్లికేషన్ సెంటర్ వారు ఈ 2 చిన్న తరహా ఉపగ్ర హాలను తయారు చేసి ప్రయోగిస్తున్నారు. ఇందులో బిడిరెక్షనల్ రెఫ్లెక్టెన్సీ డిస్ట్రి బ్యూషన్ ఫంక్షన్ రేడియో మీటర్ (బీఆర్‌డీఎప్), సింగల్ ఈవెంట్ అప్‌సెట్ మానిటర్ పేలోడ్స్ అమర్చారు. ఇది కూడా రిమోట్ సెన్సింగ్ శాటిలైట్. ఈ పేలోడ్ భూమిమీద పడే సూర్య ప్రతాపాన్ని తెలియజేస్తుంది. భూమి మీద రేడియేషన్ ఎనర్జీని మదింపు చేస్తుంది. ఇది 6 నెలలు మాత్రమే పని చేస్తుంది.
డవ్ శాటిలైట్స్, లెమూర్ ఉపగ్రహాల పనితీరు
అమెరికాకు చెందిన డవ్ ఫ్లోక్–3పీ శాటిలైట్స్‌లో 88 చిన్న తరహా ఉపగ్రహా లున్నాయి. ఇవి ప్రతిరోజూ వాణిజ్య, వాతావరణ సమాచారాన్నిస్తాయి.
విదేశీ ఉపగ్రహాలు: నెదర్లాండ్‌కు చెందిన 3 కేజీల బరువైన పీయాస్, స్విట్జర్లాండ్‌కు చెందిన 4.2 కేజీల డిడో–2, ఇజ్రాయెల్‌కు చెందిన 4.3 బీజీయూ శాట్, కజికిస్తాన్‌కు చెందిన 1.7 కేజీల ఆల్–ఫరాబి–1, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన 1.1 కేజీల బరువు కలిగిన నాయిప్ అనే ఉపగ్రహాలు కూడా టెక్నాలజీ డిమాన్‌స్ట్రేషన్‌కు ఉపయోగించనున్నారు.