మరొకరితో చనువుగా ఉందని.. హతమార్చాడు | GIRL 3 held for murder of 16-year old girl | Sakshi
Sakshi News home page

మరొకరితో చనువుగా ఉందని.. హతమార్చాడు

Published Fri, Mar 27 2015 11:31 AM | Last Updated on Sat, Sep 2 2017 11:28 PM

మరొకరితో చనువుగా ఉందని.. హతమార్చాడు

మరొకరితో చనువుగా ఉందని.. హతమార్చాడు

నామక్కాల్:  తాను ప్రేమించిన అమ్మాయి ఇంకొకరితో చనువుగా ఉండటం చూసి సహించలేని ఓ యువకుడు ఆమెను గొంతునులిమి చంపేశాడు. ఇద్దరి స్నేహితులతో కలిసి తన ప్రియురాలిని దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన తమిళనాడులోని నమక్కల్ అనే గ్రామంలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక పోలీసు టీంను ఏర్పాటు చేసి ఆ దిశగా  విచారణ చేపట్టారు. బాలికను హత్యచేసిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే...  పెరియాన్ మలాయి అనే గ్రామంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న 16 ఏళ్ల అమ్మాయిని దిలీప్ కుమార్(20) అనే యువకుడు ప్రేమించాడు. తాను ప్రేమించిన అమ్మాయి మరొకరితో చనువుగా ఉండటం చూసి దిలీప్ సహించలేకపోయాడు. పథకం ప్రకారం.. దిలిప్ తన ఇద్దరి స్నేహితుల సహాయంతో ఆమెను హత మార్చాలనుకున్నాడు. స్కూలుకు వెళుతుండగా అమ్మాయిని అడ్డగించాడు. బలవంతంగా తీసుకెళ్లి ఆమె గొంతునులిమి హతమార్చాడు.  అనంతరం ఆమె మృతదేహాన్ని గోనెసంచెలో మూట కట్టి ఖాళీ ప్రదేశంలో పడేశారు.

అయితే స్కూలుకి వెళ్లిన బాలిక సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామ శివారులో ఖాళీ ప్రదేశంలో  గొనెసంచెలో ఉన్న మృతదేహన్ని చూసి తన కూతురిగా తండ్రి గుర్తించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. బాలికను హతమార్చిన లవర్ దిలీప్ కుమార్ (20)తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement