పెళ్లి వద్దన్నాడని.. ప్రియుడిపై యాసిడ్ దాడి
పెళ్లి వద్దన్నాడని.. ప్రియుడిపై యాసిడ్ దాడి
Published Tue, Jan 12 2016 3:26 PM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM
బిజ్నోర్
యాసిడ్ దాడులు కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఇంతకుముందు అమ్మాయిలు తమ ప్రేమను నిరాకరించారని అబ్బాయిలు వాళ్ల మీద యాసిడ్ పోసిన కేసులు చూశాం. కానీ,తనను ప్రేమించి.. తనతో పెళ్లి వద్దని.. వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధపడ్డాడని ఓ అమ్మాయి తన మాజీ ప్రియుడిని ఇంటికి పిలిపించి మరీ ముఖం మీద యాసిడ్ పోసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నూర్‌లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఇనాంపురా గ్రామానికి చెందిన ఆఫ్రీన్ (19), సూరజ్‌కుమార్ (21) కొంతకాలంగా నుంచి ప్రేమించుకుంటున్నారు. ఆఫ్రీన్, సూరజ్ కుమార్ ఇద్దరు బిజ్నూర్‌లోని ఒకే కాలేజిలో చదువుతున్నారు. వీరిద్దరూ ఏడాదిన్నర నుంచి ప్రేమలో ఉన్నారు. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకుందామని యువతి ఎన్నిసార్లు అడిగినా.. సూరజ్ నిరాకరించడతో ఆగ్రహంతో ఆఫ్రీన్ అతడిని తన ఇంటికి పిలిచి, అతడి మొహంపై యాసిడ్ పోసింది.
తన పుట్టినరోజు పార్టీ ఉందంటూ ఆమె ఆదివారం రాత్రి సూరజ్‌ను పార్టీకి ఆహ్వానించింది. విందు తర్వాత అందరూ వెళ్లిపోయిన తర్వాత అతడికి మళ్లీ ఫోన్ చేసి మరోసారి ఇంటికి రావాలని పిలిపించింది. ఇద్దరి మధ్యా ఆ సమయంలో వాగ్వాదం నడిచింది. ఈ క్రమంలోనే సూరజ్ పై ఆఫ్రిన్ యాసిడ్తో దాడిచేసింది.
తమ ఇద్దరి కులాలు, మతాలు వేర్వేరనీ.. అందుకే తమమధ్య పెళ్లి కష్టమని ఆమెకు చెప్పినట్లు సూరజ్ పోలీసులకు తెలిపాడు. తన స్నేహితుడు అర్జున్ కుమార్ తనను ఆస్పత్రికి తరలించాడని బాధితుడు సూరజ్ కుమార్ తెలిపాడు. బాధితుని ఫిర్యాదు ఆధారంగా యాసిడ్ దాడికి పాల్పడిన యువతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Advertisement
Advertisement