మీడియాతో మంత్రి.. అమ్మాయి కొంటెపని! | Girl Photobombs Jayant Sinha After Budget Speech and Wins Internet | Sakshi
Sakshi News home page

Published Sat, Feb 2 2019 8:55 AM | Last Updated on Sat, Feb 2 2019 11:57 AM

Girl Photobombs Jayant Sinha After Budget Speech and Wins Internet - Sakshi

న్యూఢిల్లీ : కేంద్ర సహాయ మంత్రి జయంత్‌ సిన్హా మీడియాతో సీరియస్‌గా మాట్లాడుతుండగా.. ఓ అమ్మాయి చేసిన తమషా ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. తాత్కాలిక ఆర్థిక శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ శుక్రవారం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలోనే ప్రవేశ పెట్టిన ఈ బడ్జెట్‌లో రైతులు, వేతన జీవులపై వరాల జల్లు కురిపించారు. అయితే బడ్జెట్‌ సెషన్‌ అనంతరం జయంత్‌ సిన్హా మీడియాతో మాట్లాడుతుండగా.. ఓ ఫన్నీ ఘటన చోటుచేసుకుంది. ఆయన సీరియస్‌గా తమ ప్రభుత్వ బడ్జెట్‌పై ప్రశంసలు కురిపిస్తూ మాట్లాడుతుండగా..  ఆయన వెనకాల ఉన్న ఓ అమ్మాయి కొంటె పనిచేసింది. కెమెరాను చూసి నాలుకను బయటపెట్టి వెక్కిరిచ్చింది.

అయితే ఆమె తమాషా కొద్ది చేసిన ఈ పని ఇప్పుడు నెట్టింట వైరల్‌ అయింది. ఆ అమ్మాయి బడ్జెట్‌పై తన అభిప్రాయాన్ని తెలిపిందని ఒకరు, బడ్జెట్‌కు సూపర్బ్‌ రివ్యూ అని మరొకరు కామెంట్‌ చేస్తున్నారు. ఇక 2019 లోక్‌సభ ఎన్నికల అనంతరం భారత్‌ పురోభివృద్ధికి ఏయే అంశాలు దోహదం చేస్తాయన్నదానికి తాజా బడ్జెట్‌ ట్రైలర్‌ మాత్రమేనని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడగా..  ప్రతిపక్షాలు మాత్రం కేవలం ఎన్నికల జిమ్మిక్కేనని విమర్శిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement