'అమ్మాయిలు ఆ దుస్తులు ధరించకూడదు' | Girls in Jeans Force Men to Sin: Kerala Pastor's Sermon Goes Viral | Sakshi
Sakshi News home page

'అమ్మాయిలు ఆ దుస్తులు ధరించకూడదు'

Published Mon, Feb 27 2017 9:57 PM | Last Updated on Tue, Sep 5 2017 4:46 AM

'అమ్మాయిలు ఆ దుస్తులు ధరించకూడదు'

'అమ్మాయిలు ఆ దుస్తులు ధరించకూడదు'

తిరువనంతపురం: పురుషులను రెచ్చగొట్టే విధంగా మహిళలు దుస్తులు ధరించకూడదంటూ ఓ క్రైస్తవ మత ప్రభోదకుడు చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఇందుకు సంబంధించిన పాస్టర్‌ సెర్మొన్‌ వీడియో ఫేస్‌బుక్‌లో సంచలనం సృష్టిస్తోంది. వీడియోలో ఆయన ఏమన్నారంటే.. కొన్ని చర్చిల్లో చెప్పినట్లు పెద్ద గుంపుకు తాను బోధనలు చేయనని చెప్పారు. అలాంటి చోట్ల అమ్మాయిలు ముందు వరుసలో మోడరన్‌ వేర్‌ ధరించి.. సెల్‌ఫోన్‌ను చేతిలో పట్టుకుని కూర్చుంటారని అది తనకు నచ్చదని తెలిపారు. కనీసం జుత్తును కూడా వారు సరిగా దువ్వుకుని రారని.. చర్చికి వచ్చే సమయంలో కూడా ఇలా ఎందుకు చేస్తున్నారో తనకు ఇప్పటివరకూ అర్ధం కాలేదని చెప్పారు.
 
అలా దుస్తులు ధరించి చర్చికి రావొచ్చా? అని ఆయన సభకు వచ్చిన అమ్మాయిలను ప్రశ్నించారు. కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు ధరిస్తున్న దుస్తులపై తనకు ఫిర్యాదు చేసినట్లు సెర్మొన్‌ చెప్పారు. అలాంటి వారిని చర్చి వద్ద చూస్తుంటే తాము పాపాలకు గురౌతామని అబ్బాయిలు వాపోయినట్లు తెలిపారు. మహిళలు వాళ్ల సమస్యలపై ఫిర్యాదులు (పెళ్లి ఎందుకు జరగడం లేదనో, ఉద్యోగం ఎందుకు రావడం లేదనో తదితరాలపై) చేస్తారని.. అందుకు కారణం వారు ధరిస్తున్న దుస్తులేనని అన్నారు. చుడీదార్లు చాలా చక్కగా ఉంటాయని అమ్మాయిలు వాటినే ధరించాలని అన్నారు. కొంతమంది అమ్మాయిల్లో సతాను ప్రవేశించిందని అందుకే మోడరన్‌ దుస్తుల వైపు ఆకర్షితులౌతున్నారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement