ఆ బిల్లులో మరిన్ని సవరణలకు సిద్ధం: గడ్కారీ | Government not averse to more amendments to Land Bill: Nitin Gadkari | Sakshi
Sakshi News home page

ఆ బిల్లులో మరిన్ని సవరణలకు సిద్ధం: గడ్కారీ

Published Thu, Apr 9 2015 12:56 AM | Last Updated on Sun, Sep 3 2017 12:02 AM

ఆ బిల్లులో మరిన్ని సవరణలకు సిద్ధం: గడ్కారీ

ఆ బిల్లులో మరిన్ని సవరణలకు సిద్ధం: గడ్కారీ

న్యూఢిల్లీ: భూసేకరణ బిల్లును పార్లమెంట్ గడప దాటించేందుకు ఎన్‌డీఏ సర్కారు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ బిల్లుకు మరిన్ని సవరణలు ప్రతిపాదిస్తే చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కారీ వెల్లడించారు. బుధవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాజాగా మరిన్ని సవరణలు తీసుకొచ్చేందుకు ఎటువంటి నియంత్రణా లేదని చెప్పారు. అయితే బిల్లును ఆలస్యం చేసేలా, రాజకీయ కోణంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా చేసే సవరణలను మాత్రం తాము అంగీకరించేది లేదని స్పష్టం చేశారు.

లోక్‌సభలో భూ బిల్లుకు సంబంధించి తొమ్మిది సవరణలకు తాము అంగీకరించామని, ఇప్పుడు కూడా సవరణలు ప్రతిపాదిస్తే తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాజ్యసభలో ఎన్‌డీఏకు మెజారిటీ లేదు కదా అని విలేకరులు ప్రశ్నించగా.. పెద్దల సభలోనూ తమకు మద్దతు లభిస్తుందని గడ్కారీ ఆశాభావం వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement