న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో 4,072 సెల్ టవర్లు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. మొబైల్ టవర్ ఫేజ్–2 కింద 10 రాష్ట్రాల్లో టవర్ల ఏర్పాటుకు టెలికం కమిషన్ ఆమోదం తెలిపింది. కేబినెట్ ఆమోదానికి ఈ ప్రతిపాదనను పంపింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సెల్ టవర్ల ఏర్పాటు ద్వారా మొబైల్ ఫోన్ల వాడకం పెరగడంతో కొంత మేర భద్రత సవాళ్లను అధిగమించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ కొత్త టవర్లలో జార్ఖండ్‌లో 1,054, ఛత్తీస్‌గఢ్‌లో 1,028, ఒడిశాలో 483, ఆంధ్రప్రదేశ్‌లో 429, బిహార్‌లో 412, పశ్చిమ బెంగాల్‌లో 207, ఉత్తరప్రదేశ్‌లో 179, మహారాష్ట్రలో 136, తెలంగాణలో 118, మధ్యప్రదేశ్‌లో 26 టవర్లను ఏర్పాటు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment