కుటుంబానికి రూ.లక్ష ఆరోగ్య బీమా | Govt to provide health insurance of upto Rs.1 lakh per family: FM | Sakshi
Sakshi News home page

కుటుంబానికి రూ.లక్ష ఆరోగ్య బీమా

Published Mon, Feb 29 2016 11:49 AM | Last Updated on Sat, Apr 6 2019 9:38 PM

కుటుంబానికి రూ.లక్ష ఆరోగ్య బీమా - Sakshi

కుటుంబానికి రూ.లక్ష ఆరోగ్య బీమా

న్యూఢిల్లీ: ఆరోగ్య రంగానికి పెద్దపీట వేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఒక్కో కుటుంబానికి రూ.లక్ష వరకు ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తామని హామీయిచ్చారు. కేంద్ర 2016-17 ఆర్థిక బడ్జెట్ ను సోమవారం లోక్ సభలో ఆయన ప్రవేశపెట్టారు.

ఆయన ఇంకా ఏం చెప్పారంటే....
'ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగా పాడైతే కుటుంబ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. ఇందుకోం కొత్త పథకం ప్రవేశపెడుతున్నాం. కొత్త ఆరోగ్య బీమా పథకం కింద కుటుంబానికి లక్ష రూపాయలు, సీనియర్ సిటిజన్లకు అదనంగా రూ. 30 వేలు ప్రయోజనం అందజేస్తాం. జెనెరిక్ మందులను అందించేందుకు అదనంగా దుకాణాలు ఏర్పాటుచేయిస్తాం, ఈ మందులు మరింత చౌక కానున్నాయి.

మూత్రపిండాల వ్యాధులతో బాధపడేవారి కోసం డయాలసిస్ ఖర్చు ఏడాదికి రూ. 3 లక్షలు అవుతోంది. పీపీపీ మోడ్‌లో జాతీయ డయాలసిస్ సర్వీస్ కార్యక్రమం అన్ని జిల్లా ఆస్పత్రులలో ప్రారంభం అవుతుంది. డయాలసిస్ పరికరాల మీద బేసిక్ కస్టమ్స్, ఎక్సైజ్ పన్నులు మినహాయిస్తున్నాం. 300 జనరిక్ జౌషధ దుకాణాలను త్వరలోనే ప్రారంభిస్తాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement