బిహార్ ఎన్నికల్లో ఒక్కో రౌండు ముగిసేకొద్దీ మహాకూటమి ఆధిక్యాల్లో ముందుకు దూసుకెళ్తోంది. మొత్తం 243 స్థానాలున్న బిహార్ అసెంబ్లీలో ఇప్పటికి అందిన తాజా వివరాల ప్రకారం, మహాకూటమి 145 స్థానాల్లోను, ఎన్డీయే 85 స్థానాల్లోను ఇతరులు 8 స్థానాల్లోను ఆధిక్యంలో ఉన్నారు. ఇదే ట్రెండు కొనసాగితే మాత్రం మహాకూటమి అధికారంలోకి రావడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. మహాకూటమి నేతలు కూడా తమ ప్రభుత్వం మళ్లీ ఏర్పాటవుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
తొలి అంచెలో ఆధిక్యంలో ఉన్న ఎన్డీయే.. ఆ తర్వాత క్రమంగా వెనకబాటులోకి వెళ్లింది. అయితే ఈ ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యం వస్తే పర్వాలేదు గానీ లేకపోతే స్వతంత్ర అభ్యర్థులు కూడా కీలకంగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఆధిక్యాల్లో దూసుకెళ్లిన మహాకూటమి
Published Sun, Nov 8 2015 10:30 AM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM
Advertisement
Advertisement