పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాద దాడి ఘటనలో గురుదాస్‌పుర్ ఎస్పీ సల్వీందర్‌సింగ్ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పఠాన్‌కోట్: పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాద దాడి ఘటనలో గురుదాస్‌పుర్ ఎస్పీ సల్వీందర్‌సింగ్ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆయనను అదుపులోకి తీసుకొని విచారించాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) భావిస్తోంది. పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడిపై ఎన్‌ఐఏ బుధవారం అధికారికంగా దర్యాప్తు ప్రారంభించింది. ఈ దాడి విషయంలో సల్వీందర్ సింగ్ తీరు అసబద్ధంగా ఉందని ఎన్‌ఐఏ డీజీ శరద్‌కుమార్ అభిప్రాయపడ్డారు.
పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడికి ముందు ఎస్పీ సల్వీందర్ సింగ్ ప్రయాణిస్తున్న అధికారిక వాహనాన్ని ఉగ్రవాదులు అడ్డగించారు. అందులో ఉన్న ఎస్పీతోపాటు ఉన్న అతని స్నేహితుడు రాజేశ్‌వర్మ, వంటమనిషిని తాడుతో కట్టేసి చితకబాదారు. ఆ తర్వాత ఎస్పీ అధికారిక వాహనాన్ని హైజాక్ చేసి.. తమతోపాటు వర్మను బంధించి తీసుకెళ్లారు. ఉగ్రవాదుల నుంచి తప్పించుకున్న ఈ ముగ్గురు ఘటన గురించి తరచూ భిన్నమైన ప్రకటనలు చేస్తుండటం, ముఖ్యంగా ఎస్పీ సల్వీందర్ సింగ్ వైఖరి తరచూ మారుతుండటంతో ఆయన ఉగ్రవాదులకు సహకరించారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్పీ సల్వీందర్ సింగ్‌తోపాటు రాజేశ్‌వర్మ, వంటమనిషిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించాలని ఎన్‌ఐఏ భావిస్తోంది.