‘భారత్‌లో మరిన్ని ఉగ్రదాడులు చేస్తాం’
ఇస్లామాబాద్: భారతదేశంలో మరిన్ని ఉగ్రవాద దాడులు చేస్తామని జమాత్ ఉద్ దావా(జేయూడీ) చీఫ్, ముంబై దాడుల సూత్రదారి హఫీజ్ సయీద్ హెచ్చరించాడు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో నిర్వహించిన ఒక ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘మీరు పఠాన్ కోట్ దాడినే చూశారు. మేము అత్యంత సులువుగా మరిన్ని దాడులను చేయగలం’ అని అన్నాడు. భారత సైన్యం కశ్మీర్ ప్రజలపై మారణ హోమం చేస్తోందని ఆరోపించాడు. మరోవైపు, సయీద్‌ను అదుపులో పెట్టాల్సిన బాధ్యత పాక్‌పై ఉందని భారత్ స్పష్టం చేసింది. పాక్‌లో సయీద్ కార్యకలాపాలపై ఆందోళన వ్యక్తం చేసింది.
నిజానికి సయీద్ చేస్తోంది ఉగ్రవాద కార్యకలాపాలని, ఉగ్రవాదానికి ఆర్థిక ఊతం అందించే చర్యలేనని స్పష్టం చేసింది. పాక్‌లో సయీద్ లాంటి ఉగ్రవాదులు స్వేచ్ఛగా తమ కార్యకలాపాలను నిర్వహించుకోవడం ఆందోళనకరమని పేర్కొంది.