సాక్షి, ముంబై: లోకల్ రైళ్లలో మహిళలపై వేధింపుల కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి. 2013లో 41 వేధింపు కేసులు నమోదుకాగా, ఈ ఏడాది అక్టోబర్ 31 నాటికి 47 కేసులు నమోద య్యాయి. ముఖ్యంగా ఈ కేసులు కల్యాణ్, కుర్లా, దాదర్‌లలో ఎక్కువగా నమోదవుతున్నాయని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. మరో పక్క అత్యాచారానికి సంబంధించిన కేసులు గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది తక్కువగా నమోదయ్యాయి.
ఈ ఏడాది అత్యాచార కేసులు రెండు నమోదు కాగా, గత ఏడాది ఆరు నమోద య్యాయని గణాంకాలు చెబుతున్నాయి. కాగా, నమోదు కాని వేధింపు కేసులు కూడా చాలా ఉన్నాయని ప్రయాణికుల అసోసియేషన్ పేర్కొంది. రైల్ యాత్రి సంఘ్ అధ్యక్షుడు సుభాష్ గుప్తా మాట్లాడుతూ.. స్టేషన్లలో 10 శాతం మంది మాత్రమే పోలీసులను ఆశ్రయిస్తారని తెలిపారు. డివిజినల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ (డీఆర్‌యూసీసీ) సభ్యుడు రాజీవ్ సంఘాల్ మాట్లాడుతూ.. వేధింపుల కేసులను రైల్వే అధికారులు సీరియస్‌గా తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. స్టేషన్లలో సీసీ టీవీ కెమెరాలను అమర్చాలని సూచించారు.
రైళ్లలో పెరిగిన వేధింపుల కేసులు
Published Sat, Nov 8 2014 11:38 PM | Last Updated on Wed, Sep 26 2018 6:09 PM
Advertisement
Advertisement