ఆయుర్వేదం, హోమియోపతి మందుల్లోనూ ఆల్కహాల్ వాడటాన్ని నిషేధిస్తూ బిహార్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పట్నా హైకోర్టు కొట్టేసింది.
పట్నా: ఆయుర్వేదం, హోమియోపతి మందుల్లోనూ ఆల్కహాల్ వాడటాన్ని నిషేధిస్తూ బిహార్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పట్నా హైకోర్టు కొట్టేసింది. బిహార్‌లో ఇప్పటికే మద్య నిషేధం అమల్లో ఉంది.
ఆల్కహాల్ కలిగి ఉండే హోమియోపతి, ఆయుర్వేదం మందులు తయారుచేసే కంపెనీలకు తదుపరి లైసెన్సులు మంజూరు చేయరాదంటూ మార్చి 17న ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఇలాంటి ఆదేశాలిచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని కోర్టు తీర్పులో పేర్కొంది.