ayurvedic medicines
-
ఆయుష్ ఔషధాల ప్రమాణాల నియంత్రణకు చర్యలు
న్యూఢిల్లీ: ఆయుర్వేద ఔషధాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఫుడ్ స్టాండర్డ్స్ అండ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనల మేరకు తయారైనట్లు సర్టిఫై చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నదో తెలపాలని మంగళవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాలలో వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి ఆయుష్ శాఖ మంత్రిని ప్రశ్నించారు. 2025 నాటికి ఆయుష్ ఔషధాల ఎగుమతులను 23 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఆయుర్వేద ఔషధాలు ప్రభావశీలంగా, ఇతరత్రా సమస్యలు తలెత్తకుండా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా నియంత్రించి వాటిని సర్టిఫై చేసేందుకు ఎలాంటి పరిశోధనలు, అధ్యయనాలు జరుపుతున్నదో వివరించాలని కూడా ఆయన కోరారు. ఈ ప్రశ్నలకు ఆయుష్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ మహేంద్రబాయ్ జవాబిస్తూ ఆయుష్ ఔషధాలను జీఎంపీ(గుడ్ మాన్యుఫాక్చరింగ్ సర్టిఫికెట్) నిర్దేశించిన ప్రమాణాల మేరకే తయారు చేయాల్సి ఉంటుందని చెప్పారు. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల మేరకు బయో మెడికల్ ప్రాడక్ట్‌గా సర్టిఫికెట్ పొందాల్సి కూడా ఉంటుందని తెలిపారు. ఆయుర్వేద ఉత్పాదనలు ఆయుష్ ప్రీమియం మార్క్ పొందడానికి క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సర్టిఫికెట్ సైతం అవసరం ఉంటుందని చెప్పారు. ఆయుష్ ఔషధాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసేందుకు థర్డ్ పార్టీ సర్వేల ద్వారా వాటి నాణ్యతను పరీక్షించడం జరుగుతుందని చెప్పారు. చదవండి: (తవాంగ్ ఘర్షణపై లోక్‌సభలో రాజ్‌నాథ్ కీలక ప్రకటన) -
ఎంత ఖర్చయినా పర్వాలేదు.. ఆరోగ్యం కావాలి!
Effect Of Corona: కరోనా వచ్చిన తర్వాత ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. ఆరోగ్యం కోసం మరింత ఎక్కవగా ఖర్చు పెట్టేందుకు వినియోగదారులు ఏ మాత్రం వెనుకాడడం లేదు. శారీరక, మానసిక ఆరోగ్యం దృఢంగా ఉండేందుకు శిక్షణ, సహజసిద్ధమైన ఆహారం, ఔషధాలు, ప్రత్యేకమైన ఆహర మెనూ కోసం ఖర్చు చేస్తున్నారు. కరోనా మహమ్మారి ఈ రకమైన మార్పునకు కారణమని ఈవై ఇండియా ‘ద సన్‌రైజ్ కన్జ్యూమర్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ సెక్టార్’ నివేదిక తెలియజేసింది. 94 శాతం మంది భారతీయులు తమ కుటుంబ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు. అంతర్జాతీయంగా ఇది 82 శాతంగానే ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ కరోనా మహమ్మారి వెళ్లిపోయిన తర్వాత కూడా కొనసాగుతుందని 52 శాతం మంది భారతీయలు సర్వేలో తెలిపారు. అంతర్జాతీయంగా చూస్తే ఇలా చెప్పిన వారు 39 శాతంగా ఉన్నారు. భారతీయులు ఇంటి చిట్కాలు, పరిష్కారాలకు, ఆరోగ్యకరమైన ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆధునిక ఆరోగ్య సమస్యలకు ఆయుర్వేదం, హెర్బల్ ఔషధాలే పరిష్కారమని భావిస్తున్నారు. ఆయుర్వేద ఉత్పత్తులకు డిమాండ్ పెరగడంతో ఇప్పటికే ఈ రంగంలో పనిచేస్తున్న కంపెనీలకు ప్రోత్సాహకరంగా మారింది. ఆరోగ్యాన్నిచ్చే ఉత్పత్తులకు అధికంగా ఖర్చు పెట్టేందుకు తాము సుముఖమని 40 శాతం మంది తెలిపారు. అంతర్జాతీయంగా ఇలా 29 శాతం మందే చెప్పారు. ఈవై ఫ్యూచర్ కన్జ్యూమర్ ఇండెక్స్ (2021 నవంబర్) ఆధారంగా, అంతర్జాతీయంగా 16,000 మంది, భారత్ నుంచి 1,002 మంది అభిప్రాయాలను సర్వే కింద పరిగణనలోకి తీసుకున్నారు. పెద్ద ఎత్తున మార్పు ‘‘కొంత మంది ఇది స్వల్పకాలమేనని భావిస్తున్నారు. కానీ, మేము మాత్రం వ్యక్తిగత ఆరోగ్యం, పరిశుభ్రత, ఫిట్నెస్ విషయంలో వినియోగదారుల ధోరణిని ఈ దశ పెద్ద ఎత్తున మార్పును తీసుకొస్తుందని, వేగవంతం చేస్తుందని భావిస్తున్నాం’’ అని ఈవై ఇండియా నేషనల్ లీడర్ అన్షుమన్ భట్టాచార్య తెలిపారు. (చదవండి: భారీగా పడిపోతున్న క్రిప్టో కరెన్సీ ధరలు..!) -
ఆయుర్వేదిక్ మందు వాడితే పిల్లలు చురుకుగా ఉంటారని చెప్పి..
సాక్షి, అమీర్‌పేట: తాను తయారు చేసిన ఆయుర్వేదిక్ మందు వాడితే పిల్లలు చురుకుగా ఉంటారని డబ్బులు కాజేసిన వ్యక్తులపై కేసు నమోదైన ఘటన ఎస్ఆర్నగర్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సైదులు వివరాల ప్రకారం.. నిజాంపేట బృందావనం కాలనీలో నివసించే ఉమారెడ్డి శ్రీకాంత్‌రెడ్డికి మూడు నెలల క్రితం ఓ వ్యక్తి తనకు తానే పరిచయమై తన పేరు గురప్ప అని, మీ అమ్మాయికి కంటి చూపు సరిగా లేదు కాదా అని అడిగాడు. అదేం లేదు.. కానీ.. వేరే పిల్లలాగా హుషారుగా ఉండటం లేదని శ్రీకాంత్ తెలిపాడు. మా అన్న కూతురు కూడా ఇలాగే ఉండేదని ఆయుర్వేదిక్ మందులు వాడితే తగ్గిందని కాసేపు మాట్లాడి శ్రీకాంత్ ఫోన్ నెంబర్‌కు తీసుకుని వెళ్లిపోయాడు. చదవండి: క్రికెట్ టోర్నీలో చాన్స్ ఇస్తామని చెప్పి.. మహిళా క్రికెటర్‌ను.. మరుసటి రోజు దుర్గప్ప అనే వ్యక్తి ఫోన్ చేసి గురప్ప మీ నెంబర్ ఇచ్చాడని, తాను మందు తయారు చేసిస్తానని శ్రీకాంత్ వద్దకు వచ్చాడు. ఇద్దరూ కలిసి ఎస్ఆర్నగర్లోని ఓ దుకాణానికి వెళ్లి అక్కడున్న హజ్రత్, రాకేష్‌లకు మందు తయారు చేసి ఇవ్వాలని గురప్ప సూచించాడు. పలు రకాల ఆయుర్వేదిక్ పదార్థాలు కలిపి తయారు చేసిన ఓ మందును శ్రీకాంత్ చేతికిచ్చి రూ.1.81 లక్షలు తీసుకున్నారు. రెండు నెలలుగా మందు వాడుతున్నా ఎలాంటి ఫలితం లేకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చదవండి: MBS Jewellers: నిజాం నగల పెట్టెలు.. విడిపించాక పంచుకుందాం -
ప్రాణం తీసిన ‘మందు’ జాగ్రత్త..
సాక్షి, అల్వాల్ (హైదరాబాద్): అనారోగ్యానికి గురి కాకుండా తీసుకున్న మందు వికటించి ఒకరు మృత్యువాత పడగా మరో ఇద్దరు చికిత్స పొందుతున్న సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ. పరుశురామ్ వివరాల ప్రకారం.. మచ్చబొల్లారం చంద్రనగర్‌లో నివసించే నరేష్కుమార్ (30), ప్రైవేట్ ఉద్యోగి. ఇదిలా ఉండగా ఓ చానల్లో సూచించిన ఆయుర్వేద మందు తీసుకుంటే కరోనాతో పాటు ఎలాంటి వ్యాధులు దరిచేరవని భావించి నరేష్కుమార్ బుధవారం తల్లి లక్ష్మీ, భార్య సంధ్యారాణిలతో కలిసి తాగారు. కాసేపటి తర్వాత ముగ్గురు వాంతులు విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురవ్వగా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నరేష్కుమార్ గురువారం మృతి చెందగా, లక్ష్మీ, సంధ్యారాణి చికిత్స పొందుతున్నారు. మృతుడి సోదరుడి శ్రవణ్‌కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఏపీ: ఆనందయ్య K మందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
-
ఆనందయ్య K మందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: ఆనందయ్య కె మందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆనందయ్య కె మందును నిపుణుల బృందం పరిశీలించిందని.. కె మందును పంపిణీ చేయొచ్చని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. కంటి చుక్కల మందుపై రెండు వారాల్లో నివేదిక అందించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 21కి కోర్టు వాయిదా వేసింది. కాగా, నెల్లూరు జిల్లా గొలగమూడిలో ఆనందయ్య మందు పంపిణీని ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి ఈ రోజు ప్రారంభించారు. రోజుకి 2 వేల నుంచి 3 వేలమందికి ఆనందయ్య మందు పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. కేవలం సర్వేపల్లితోనే ఆనందయ్య మందు ఆగిపోదు. త్వరలోనే ఇతర జిల్లాలకూ ఆనందయ్య మందు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే కాకాణి తెలిపారు. చదవండి: ఆనందయ్య మందు పంపిణీని ప్రారంభించిన ఎమ్మెల్యే కాకాణి ఏపీలో ఈనెల 20 వరకు కర్ఫ్యూ పొడిగింపు -
Black Fungus: బ్లాక్‌ఫంగస్‌కు ‘ఆయుర్వేదం’
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 వ్యాధి నుంచి బయటపడేందుకు స్టెరాయిడ్స్ తీసుకున్న వారిలో బ్లాక్‌ఫంగస్ (మ్యూకార్ మైకోసిస్) వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మధుమేహం ఉన్న వారిలో బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ లక్షణాలున్న వారికి మూడు రకాల ఆయుర్వేద ఔషధాలతో సత్ఫలితాలు వస్తాయని ఆయుష్ డిపార్ట్మెంట్ సూచిస్తోంది. వీటిని భోజనం తర్వాత వేసుకోవాలని వివరించింది. ► బ్లాక్‌ఫంగస్ లక్షణాలున్న వారు గోరు వెచ్చని నీటిని తాగాలి. ► వేడిగా ఉన్నప్పుడు భోజనం చేయాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. ► దానిమ్మ, ద్రాక్ష, బత్తాయి, బొప్పాయి, జామ, ఖర్జూర పండ్లను తీసుకోవాలి. ► ఇంటా, బయటా మాస్కు తప్పకుండా ధరించాలి. ► ఇంటి గదుల్లో గాలి ఆడేలా కిటికీలు, తలుపులు తెరిచి ఉంచాలి. ► రోజుకు 2 సార్లు ఆవిరి పట్టాలి. రక్తంలో చక్కెర స్థాయిలను పరీక్షించుకోవాలి. వీటికి దూరంగా ఉండాలి.. ► చల్లని పదార్థాలు, శీతల పానీయాలు, ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహారం తీసుకోవద్దు. ► బేకరీ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ► చల్లని గాలిలో (ఏసీ, ఎయిర్ కూలర్ వాడొద్దు) తిరగొద్దు. పెరుగు తినొద్దు. చదవండి: Black Fungus: బ్లాక్ ఫంగస్ పంజా.. ఒక్క రోజే 302 మంది.. -
ఆయుర్వేదం తో బ్లాక్ ఫంగస్ కు చెక్
-
Black Fungus: ఆయుర్వేదంతో చెక్
వెంగళరావునగర్ (హైదరాబాద్): బ్లాక్ ఫంగస్ వ్యాధిని ఆయుర్వేద ఔషధాలతో పూర్తిగా నియంత్రించవచ్చని తెలంగాణ ఆయుష్ డైరెక్టర్ డాక్టర్ అలుగు వర్షిణి అన్నారు. ఈఎన్టీ ఆస్పత్రిలో ఇప్పటికే పలువురు ఈ వ్యాధికి చికిత్స పొందుతున్నారని, ఆయా ఆస్పత్రుల్లో ఆయుర్వేద మందులను అందజేస్తున్నట్టు తెలిపారు. ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఈ మందుల వల్ల ఎలాంటి దుష్ప్రభావా లు ఉండవన్నారు. ఈ వ్యాధికి అల్లోపతి మందు లు ఇప్పటికే తీసుకుంటున్నా ఆయుర్వేద మందులు కూడా వాడొచ్చని స్పష్టం చేశారు. బ్లాక్ ఫంగస్ రాకుండా ప్రజలు ముం దుజాగ్రత్తగా కూడా ఈ మందులను వినియోగించుకోవచ్చన్నారు. రాష్ట్రవ్యా ప్తంగా ఉన్న అన్ని ఆయుర్వేద మందు ల షాపుల్లో ఈ మందులు దొరుకుతా యని, ప్రభుత్వం వీటిని ఉచితంగా కూడా అందుబాటులోకి తీసుకువచ్చిందని త్వరలోనే వీటిని ప్రజలకు అందజేయనుందని ఆమె వెల్లడించారు. సీనియర్ ఆయుర్వేద వైద్య నిపుణులు మాట్లాడుతూ.. కరోనా చికిత్సలో స్టెరాయిడ్స్, యాంటీబయోటిక్స్ వాడకం తగ్గిస్తే బ్లాక్ ఫంగస్ రాకుండా కాపాడుకోవచ్చన్నారు. సమావేశంలో రాష్ట్ర ఆయుర్వేద అదనపు సంచాలకులు డాక్టర్ కె.అనసూయ తదితరులు పాల్గొన్నారు. చదవండి: Koti ENT Hospital: బ్లాక్ ఫంగస్‌కు మెరుగైన చికిత్స -
అమ్మాయిల్లో విభిన్నం.. ఈ విభా!
మనకేదైనా ఆరోగ్య సమస్య ఎదురైన వెంటనే డాక్టర్ల దగ్గరకు పరుగెత్తుకెళ్లి్ ట్రీట్మెంట్ చేయించుకుని వారు చెప్పిన విధంగా మందులు వాడతాం. ఒకసారి సమస్య తీరితే అక్కడితో ఆవిషయాన్ని మర్చిపోతాం. బెంగళూరుకు చెందిన 25 ఏళ్ల విభా హరీష్ మాత్రం అలా చేయలేదు. తనకు వచ్చిన ఆరోగ్య సమస్యకు డాక్టర్లు ఇచ్చిన మందులు ఎలా పనిచేస్తున్నాయో జాగ్రత్తగా పరిశీలించి, వాటి పనితీరు నచ్చడంతో ఏకంగా ఒక మందుల తయారీ కంపెనీని ప్రారంభించి విజయవంతంగా నడుపుతోంది. దీంతో తాజాగా ఫోర్బ్స్ ప్రకటించిన ఏసియా అండర్ 30 జాబితాలో విభా హరీష్‌కు చోటు దక్కింది. విభా హరీష్ ఇంటర్మీడియట్ చదువుతుండ గా తనకి పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్(పీసీఓఎస్) ఉన్నట్లు వైద్యులు చెప్పారు. పీసీఓఎస్ నుంచి బయటపడేందుకు ఆయుర్వేద మెడిసిన్ బాగా పనిచేస్తుందని విభా వాళ్ల అమ్మ చెప్పడంతో.. ఆయుర్వేద మందులు వాడడం ప్రారంభించి అవి ఎలా పనిచేస్తున్నాయో చాలా జాగ్రత్తగా పరిశీలించేది. ఈ క్రమంలో తన పీసీఓఎస్ సమస్య పూర్తిగా నయం అయిన తరువాత.. ఆయుర్వేద మెడిసిన్స్ గురించి మరింత తెలుసుకోవాలన్న ఆసక్తి విభాకు కలగడంతో..∙వివిధ రకాల సమస్యలకు ఆయుర్వేద మందులు ఎలా పనిచేస్తున్నాయో తన మీదే ప్రయోగించి తెలుసుకునేది. అలా ఆయుర్వేద ప్రాముఖ్యాన్ని గుర్తించి ‘కాస్మిక్స్’ అనే ఓ స్టార్టప్‌ను ప్రారంభించింది. జీర్ణ వ్యవస్థ, కాలేయం, చర్మం, నిద్రలేమి, కేశ సంరక్షణకు సంబంధించి ఎనిమిది రకాల హెర్బల్ ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తోంది. కాస్మిక్స్ ప్రారంభించిన ఏడాది కాలంలోనే రెండు కోట్ల టర్నోవర్‌కు చేరింది. ఇంజినీరింగ్ చదువుతోన్న విభా మూలికా వైద్యం గురించి మరింత తెలుసుకోవడానికి ఆయుర్వేద ఔషధాలపై అధ్యయనం చేస్తోంది. విభా తన తల్లి ప్రోత్సాహంతో కాస్మిక్స్ సంస్థను విజయపథంలో నడిపిస్తోంది. విభా తల్లి హోమియోపతిలో శిక్షణ తీసుకోవడం వల్ల కాస్మిక్స్లో తయారయ్యే ఉత్పత్తులను ఆమె దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. విభా తన కంపెనీకి వచ్చే లాభాల్లో కొంత భాగాన్ని గ్రామీణ ప్రాంతాల్లో పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులకు మంచి ఆహారాన్ని అందించేందుకు ఖర్చు చేస్తుండడం విశేషం. విభా మాట్లాడుతూ..‘‘నాకు పీసీఓఎస్ ఎదురైనప్పుడు దానినుంచి బయటపడేందుకు అనేక ప్రయత్నాలు చేశాను. ఇందులో భాగంగా ..పీసీఓస్ గురించిన సమాచారం కోసం నెట్లో తీవ్రంగా వెదికేదాన్ని. ఆ సమయంలో చాలా మంది ఏం తినాలి? ఎటువంటి వ్యాయామాలు చేయాలి అనే దానిపై విభిన్న అభిప్రాయాలను చదివాను. వాటిలో ఏది కరెక్ట్, మనకు కచ్చితంగా పనిచేసేది ఏంటో తెలుసుకోవడం కష్టంగా ఉండేది. రకరకాల ప్రయత్నాల తరువాత మా అమ్మ సలహా మేరకు ఆయుర్వేదం మందులు వాడాను. అవి నాకు బాగా పనిచేశాయి. దీంతో నాలాగా ఇబ్బంది పడుతున్నవారికి ఇవి అందించాలని నిర్ణయించుకున్నా. ఈ క్రమంలో నేను ఆయుర్వేద మూలికలు గురించి లోతుగా తెలుసుకుని నాకు ఆయుర్వేదంపై ఒక అవగాహన వచ్చిన తరువాత కాస్మిక్స్ సంస్థను ప్రారంభించాను. పూర్తిగా ప్రకృతిసిద్ధమైన ఉత్పత్తులు కావడంతో మంచి స్పందన వచ్చింది. ఒక సంవత్సర కాలంలోనే కాస్మిక్స్ ఈ స్థాయికి చేరుకుంది. ఫోర్బ్స్ ఏసియా అండర్ 30 జాబితాలో నా పేరు కూడా ఉండడం ఎంతో సంతోషంగా ఉంది’’ అని విభా చెప్పింది. -
నిత్యావసరాలకు మాత్రమే ఓకే..
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో నిత్యావసర ఉత్పత్తులే సరఫరా చేయాలని ఈ–కామర్స్ సంస్థలు భావిస్తున్నాయి. నిత్యావసరయేతర ఉత్పత్తులకు తాత్కాలికంగా ఆర్డర్లు తీసుకోరాదని నిర్ణయించుకున్నాయి. ‘నిత్యావసరాలు, హెల్త్‌కేర్, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల కొనుగోలుదారులకు తోడ్పాటు అందించాలని నిర్ణయించుకున్నాం. ఫ్యాషన్, మొబైల్, యాక్సెసరీస్, ఎలక్ట్రానిక్స్ తదితర నిత్యావసరయేతర ఉత్పత్తులకు తాత్కాలికంగా కొత్త ఆర్డర్లు తీసుకోబోము‘ అని పేటీఎం మాల్ ఒక ప్రకటనలో తెలిపింది. డెలివరీలు సత్వరం చేసేందుకు వెసులుబాటు లభించేలా ప్రభుత్వ వర్గాలు, లాజిస్టిక్స్ సంస్థలతో సంప్రతింపులు జరుపుతున్నట్లు వివరించింది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో ఉపయోగపడే ఆయుర్వేద ఔషధాలు, హ్యాండ్ శానిటైజర్లు మొదలైనవి తక్షణం సరఫరా చేయగలిగే విక్రేతలతో కూడా చర్చలు జరుపుతున్నట్లు పేర్కొంది. ఆర్డర్ల డెలివరీల్లో జాప్యం: అమెజాన్ లాక్‌డౌన్‌పరమైన ఆంక్షల కారణంగా ఆర్డర్ల డెలివరీల్లో మరికాస్త జాప్యం జరిగే అవకాశం ఉందని అమెజాన్ ఇండియా తన వెబ్సైట్లో పేర్కొంది. ‘ప్రీపెయిడ్ పేమెంట్ విధానంలో అత్యవసర ఉత్పత్తులకు మాత్రమే కొత్త ఆర్డర్లు తీసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షించుకుంటూ, సాధ్యమైనంత త్వరగా డెలివరీ సేవలు పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నాం‘ అని వివరించింది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం..: ఫ్లిప్‌కార్ట్.. నిత్యావసర సరుకుల డెలివరీ సేవలను ప్రారంభించింది. ‘ఆర్డర్ల ప్రాధాన్యాన్ని బట్టి సాధ్యమైనంత త్వరగా మీకు డెలివర్ చేస్తాము. ఇతర ఉత్పత్తులకు ఆర్డర్లు తాత్కాలికంగా తీసుకోవడం లేదు. కానీ వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నాము‘ అని తమ వెబ్సైట్లో ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. స్థానిక అధికారుల తోడ్పాటుతో కార్యకలాపాలన్నీ యథావిధిగా ప్రారంభించినట్లు ఆన్లైన్ గ్రోసరీ సంస్థ గ్రోఫర్స్ వెల్లడించింది. అయితే, గ్రోఫర్స్ పోటీ సంస్థ అయిన బిగ్‌బాస్కెట్ వెబ్సైట్ మాత్రం కొత్త కస్టమర్ల నుంచి ఆర్డర్లు తీసుకోవడం లేదు. -
‘దశమూలారిష్టం’తో అరిష్టం కూడా!
సాక్షి, న్యూఢిల్లీ: ‘నా రోగి ఓ రైతు. ఆయనకు 40 ఏళ్లు. పచ్చ కామర్లతో (క్రానిక్ జాండీస్)తో బాధ పడుతున్న ఆయన ఓ రోజు చికిత్స కోసం నా వద్దకు వచ్చారు. ఆయనకు రక్త పరీక్షలు నిర్వహించగా బైల్‌రూబిన్ లెవల్స్ ఉండాల్సిన దానికన్నా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక కాలేయం ఎంజైమ్స్ ఉండాల్సిన దానికన్నా ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉన్నాయి. అన్నీ పరీక్షలు ఆయన మద్యం ఎక్కువగా సేవిస్తున్నాడనే తెలిపాయి. అయితే ఆ రోగి మాత్రం ఆ విషయాన్ని ఖండించారు. తాను జీవితం ఒక్క చుక్క కూడా మద్యం ముట్టుకోలేదని వాదించారు. ఆయన మరీ లావుగానీ, బక్కగాగానీ లేకుండా దృఢంగా ఉన్నారు. కాలేయ వ్యాధి ఎందుకు వచ్చిందో తెలుసుకునేందుకు ఆయనపై వివిధ రకాల వైరస్లు, బయాటిక్ పరీక్షలు నిర్వహించాం. అన్నీ నెగటివ్ ఫలితాలు వచ్చాయి. డెంగ్యూ, టైఫాయిడ్, అరుదైన క్యాన్సర్ పరీక్షలూ నిర్వహించాం. అయినా నెగటివ్ ఫలితాలే వచ్చాయి. రోజు రోజుకు రోగికి జాండీస్ జబ్బు పెరుగుతోంది. బయాప్సీ చేయాలని నిర్ణయించాను. ఒక్క క్యాన్సర్లకే కాకుండా జబ్బుకు అసలు కారణం ఏమిటో తెలుసుకోవడానికి కూడా ఈ బయాప్సీ ఉపయోగ పడుతుంది. రోగి అంగీకారంతో బయాప్సీ పరీక్ష నిర్వహించాం. అతిగా మద్యం తాగడం వల్ల వచ్చే ‘సీవియర్ ఆల్కహాలిక్ హెపటైటీస్’ ఉందని ఆ పరీక్షలో తేలింది. దాదాపు ప్రతిరోజు అతిగా తాగేవాళ్లకే ఈ జబ్బు వస్తుంది. రోగిని పిలిచి తిట్టాను నిజం చెప్పమని. తాను నిజమే చెబుతున్నానని, అబద్ధం చెప్పడం లేదని అన్నారు. లాభం లేదనుకొని ఆయన భార్య, కూతుళ్లను పిలిపించి వారిని ప్రశ్నించాను. రోగికి ఎప్పుడు కూడా మద్యం అలవాటు లేదని, తామంతా మూడు పూటలా కలిసే తింటామని, రాత్రిపూట కలిసే ఉంటామని వారు చెప్పారు. ఇంకా ఏమీ అలవాట్లు ఉన్నాయిని ప్రశ్నించాను. తిన్నాక రెండు పూటల తిన్నది అరిగేందుకు ఆయుర్వేదం మందు తాగుతారని ఆయన భార్య తెలిపింది. ‘దశమూలారిష్టం’ తీసుకుంటానని రోగి చెప్పారు. నాకు ఆశ్చర్యం వేసింది. అది కేరళలో ప్రతి రెండు ఇళ్లలో ఒకరి ఇంట్లో ఉంటుంది. ఎక్కువ మంది అన్నం జీర్ణం అయ్యేందుకే దాన్ని వాడుతుంటారు. దాన్ని 30 వన మూలికలతో తయారు చేస్తారు. అందులో ‘వుడ్ఫోర్డియా ఫ్రూటికోసా’ అని పువ్వులు కూడా కలుపుతారు. వాటిని మురగబెడితే ద్రాక్షలాగా ఆల్కహాల్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆ ఆల్కహాలే జీర్ణ వ్యవస్థకు ఎక్కువగా తోడ్పడుతుంది. కొంత మంది వైద్యులు ఆ పువ్వులు త్వరగా కుళ్లడానికి బ్రెడ్డులో వాడే బేకింగ్ పౌడర్‌ను వాడుతారు. మరికొందరు వైద్యులు నేరుగా ఆల్కహాలును కలిపి ఔషధాన్ని తయారు చేస్తున్నారు. కేరళలో మద్యపానంపై నిషేధం ఉండడం వల్ల ‘దశమమూలారిష్టం’ను ఎక్కువగా వాడుతున్నారని తోటి వైద్యుల ద్వారా తెల్సింది. అన్నం జీర్ణం కోసం వాడే వాళ్లు దీన్ని రోజుకు నాలుగుసార్లు వాడుతుండగా, మద్యం అలవాటున్నవాళ్లు ఎక్కువగా తాగుతున్నారని తెల్సింది. నాలుగు సార్లు తీసుకునే మందులో 35 గ్రాముల ఆల్కహాలు ఉంటుంది. ఆ మందులో మొత్తం ఆల్కహాలు శాతం ఎనిమిది నుంచి పది శాతం ఉంటుంది. కాలేయ వ్యాధి రావడానికి ఆ మాత్రం ఆల్కహాలు చాలు కనుక ఈ ఔషధం కారణంగా నా రోగికి కాలేయ వ్యాధి వచ్చిందని తెల్సి ట్రీట్మెంట్ మొదలుపెట్టాను. నా రోగిలో ఆల్కహాలిక్స్‌లో ఉండని లివర్‌ను దెబ్బతీసే ‘నెక్రోసిస్’ కూడా ఉందని మా ల్యాబ్ అసిస్టెంట్ ద్వారా తెల్సింది. నా రోగిని పిలిపించి ఇంకా ఏమేమి తాగుతావని అడిగాను. తన తోటలో పండించే పైనాపిల్ జ్యూస్ రోజు తాగుతానని చెప్పారు. ఆయన తినే పైనాపిల్స్‌ను తెప్పించి వాటిని ల్యాబ్‌లో పరీక్షించాం. వాటిల్లో ‘నికల్ టెట్రాకార్బనిల్’, అసెటిల్ పెంటాకార్బనిల్, కార్బామిక్ ఆసిడ్స్’ ఉన్నాయని తేలింది. ఎరువులు ఎక్కువగా వాడడంలో అవి అందులోకి వచ్చాయి. నా రోగికి ‘టాక్సిక్ హెపటైటీస్’ కూడా ఉంది కనుక, అది పైనాపిల్స్ వల్ల వచ్చిందని తేలింది. ట్రీట్మెంట్తో రోగి పూర్తిగా కోలుకున్నాడు. (కొచ్చీలోని ఈఎంసీ హాస్పిటల్‌కు అనుబంధమైన ‘గ్యాస్ట్రో ఎంట్రాలజీ యూనిట్’లో స్పెషలిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ సిరియాక్ అబీ ఫిలిప్స్ ‘ది అమెరికన్ జనరల్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ’ తాజా సంచికలో రాసిన వ్యాసానికి అనువాదం) -
అంతర్రాష్ట్ర నకిలీ ఆయుర్వేద మోసగాళ్లు అరెస్టు
తిరుపతి క్రైమ్: ఎలాంటి రోగాన్నైనా ఇట్టే తగ్గిస్తామంటూ నకిలీ ఆయుర్వేద మందులను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద రూ.6 లక్షల 90 వేల నగదు, రెండు ద్విచక్ర వాహనాలు, ఐదు సెల్ఫోన్లు, రూ.4 లక్షల 84 వేల విలువ చేసే చెక్కులు, రూ.5 లక్షల 10 వేలు విలువ చేసే ఆయుర్వేద మందులు, నకిలీ చూర్ణం స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం తిరుపతిలో క్రైమ్ డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద వైద్యశాలకు వచ్చే రోగులను లక్ష్యంగా చేసుకుని నకిలీ ఆయుర్వేద మందులను విక్రయిస్తూ నకిలీ వైద్యుల ముఠా రూ.లక్షలు గుంజు తుందని డీఎస్పీ తెలిపారు. ఇలా మోసం చేస్తున్నవారిపై ఫిర్యాదు వచ్చిం దన్నారు. కర్ణాటకకు చెందిన 13 మంది ముఠాగా ఏర్పడి నకిలీ ఆయుర్వేద వైద్యులుగా చలామణి అవుతున్నారని తెలిసిందన్నారు. ఈ ముఠాలోని ఇద్దరు కీలక వ్యక్తులను మంగళవారం అలిపిరి రోడ్డులోని యాత్రికుల నడకదారిలో అరెస్టు చేశామన్నారు. వీరిని కర్ణాటకకు చెందిన రవిశెట్టి అలియాస్ రవికుమార్ యాదవ్ (38), బాగల్‌కోట కుమార్ (42)లుగా గుర్తించామని చెప్పారు. మోసం ఇలా.. 13 మంది ముఠా ఎస్వీ ఆయుర్వేద హాస్పిటల్‌కు మోకాళ్లు, మెడ నొప్పులతో వచ్చే రోగులను గుర్తించేవారు. 15 రోజుల్లోనే ఆరోగ్యవంతులవుతారని నమ్మించి శ్రీ సిద్ధి వినాయక ఆయుర్వేద మందుల దుకాణానికి వెళ్లి వైద్యున్ని సంప్రదించాలనేవారు. అక్కడ రూ.30 వేలు నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసేవారని పేర్కొన్నారు. కేసును ఛేదించడంలో క్రైమ్ సీఐలు భాస్కర్‌రెడ్డి, అబ్బన్న, శరత్‌చం ద్ర, రసూల్ సాహెబ్, పద్మలత, ఎస్ఐ రమేశ్ బాబు, సిబ్బంది తదితరులు కృషి చేశారన్నాని డీఎస్పీ తెలిపారు. -
నగరంలో వృద్ధులే టార్గెట్..
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌లో నకిలీ ఆయుర్వేదిక్ మందులు తయారు చేస్తున్న ఓ ముఠాని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 19 మంది ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ. 2 లక్షల నగదుతో పాటు 24 సెల్ఫోన్లు, 11 బైకులను సీజ్ చేశారు. హైదరాబాద్ వ్యాప్తంగా వృద్ధులను టార్గెట్ చేసుకుని నకిలీ ఆయుర్వేదిక్ మందులను అమ్ముతున్నట్లు విచారణలో వెల్లడైంది. సైఫాబాద్, సుల్తాన్ బజార్, అంబర్పేట్, ఎస్సార్ నగర్ల లో భారీగా నకిలీ ఆయుర్వేదిక్ మందుల అమ్మకాలు జరిపినట్లు తెలిసింది. -
‘ఆయుర్వేదంలో ఆల్కహాల్ నిషేధం’ కొట్టివేత
పట్నా: ఆయుర్వేదం, హోమియోపతి మందుల్లోనూ ఆల్కహాల్ వాడటాన్ని నిషేధిస్తూ బిహార్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పట్నా హైకోర్టు కొట్టేసింది. బిహార్‌లో ఇప్పటికే మద్య నిషేధం అమల్లో ఉంది. ఆల్కహాల్ కలిగి ఉండే హోమియోపతి, ఆయుర్వేదం మందులు తయారుచేసే కంపెనీలకు తదుపరి లైసెన్సులు మంజూరు చేయరాదంటూ మార్చి 17న ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఇలాంటి ఆదేశాలిచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని కోర్టు తీర్పులో పేర్కొంది. -
ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది?
ఆయుర్వేద కౌన్సెలింగ్ నా వయసు 59 ఏళ్లు. నాకు విరేచనం సాఫీగా కావడం లేదు. బీపీ, షుగర్ వ్యాధులకు మందులు వాడుతున్నాను. నియంత్రణలోనే ఉన్నాయి. విరేచనం కోసం ఆయుర్వేద మందులు తెలియజేయగలరు. - వి.కె. రమణారావు, విశాఖపట్నం నిత్యవిరేచనం అవటంలో సమస్యలుంటే, దానిని ‘మలబంధం’ అనే పేరుతో వివరించింది ఆయుర్వేదం. జీర్ణకోశవ్యవస్థను ‘మహాకోష్ఠం’ అని చెప్పింది. ఇది పిత్తప్రధానంగా ఉండే ‘మృదుకోష్ఠం’. వాత ప్రధానంగా ఉంటే క్రూరకోష్ఠం. జీర్ణాశయ కర్మలన్నీ సజావుగా సాగిపోతే ‘సమకోష్ఠం’ మలబంధం వాతప్రకోపం వల్ల కలుగుతుంది. ఆహారంలో తీపి, పులుపు, ఉప్పు తగినంత ప్రమాణంలో లేకపోవడం, స్నిగ్ధాహారం లోపించడం (అంటే జిడ్డుగా మృదువుగా ఉండే పాయసాల వంటి ఆహారం), తాజా పండ్లు తినకపోవడం, పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆకుకూరలు, పచ్చిగా ఉండేవీ, ఎండుఫలాలూ సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోకపోవడం వంటివి దీనికి కారణాలు. దానికి తోడు కనీసం రోజూ 3 లీటర్ల నీరు తాగడం అవసరం. ప్రతిరోజూ 45 నిమిషాలపాటు ఏదో ఒక రూపంలో వ్యాయామం చేయాలి. ముఖ్యంగా పొట్టని కదిలించే ‘కపాలభాతి’ వంటి యోగప్రక్రియలు, ఇతర యోగాసనాలు విరేచనం సాఫీగా కావడానికి ఉపకరిస్తాయి. రాత్రిపూట జాగారం చేయడం, తగినంత నిద్ర లేకపోవడం, మద్యం, పొగతాగే అలవాటు వంటివి కూడా మలబంధానికి దారితీస్తాయి. మానసిక ఒత్తిడి వల్ల కూడా పొట్ట ఉబ్బరించడం, మలబంధం సంభవించవచ్చు. చికిత్స: మంచి ఆహార, విహారాలను పాటించడం అత్యవసరం షుగరు, బీపీల వంటి వ్యాధులైనా ఉంటే వాటిని నియంత్రించడం ఆహారంలో ఆకుకూరలు, పొట్లకాయ, బీరకాయ, పనసపొట్టు, చిక్కుడు జాతి కూరలు, అరటిదవ్వ తీసుకోవడం, బార్లీ ద్రవాలు ఎక్కువగా తాగడం రోజూ ఉదయం లేవగానే ఒక లీటరు నీళ్లను తాగడం (గమనిక : గుండె, మూత్రపిండాల జబ్బులు ఉన్నవారు నీళ్లు అధికంగా తాగకూడదు). ఔషధాలు: మృదువుగా మల విసర్జన అయ్యేలా చూసేవి... కరక్కాయ చూర్ణం (హరీతకీ) : 3 నుంచి 5 గ్రాములు నీళ్లతో రాత్రి సేవించాలి. త్రిఫలాచూర్ణ (కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ): 5 నుంచి 10 గ్రాములు వరకు నీళ్లతో కషాయం కాచుకొని 30 మి.లీ. రాత్రిపూట తాగాలి. ఆరగ్వధ (రేల) గుజ్జు; సునాముఖి ఆకు కూడా విరేచనం మృదువుగా అయ్యేలా చూసేవే. వీటిని వాడాలంటే మాత్రం వైద్యుడిని సంప్రదించాలి. తీక్ష్ణరేచకాలు : హేరండ (ఆముదం), దంతి (నేపాళం)... వీటిని కూడా వైద్యల పర్యవేక్షణలోనే వాడాలి. ‘అభయాదిమోదక’ మాత్రలు బజారులో లభిస్తాయి. వీటిని 1 మాత్ర రాత్రి నీళ్లతో తీసుకోవాలి. స్నిగ్ధం ఉండటం రేచకాలు (మలవిసర్జన మృదువుగా, సాఫీగా అయ్యేవి... ధాత్రీతైలం, హింగుత్రిగుణతైలం (మోతాదు 2 చెంచాలు, పాలతో రాత్రి). సూచన: మృదురేచకాలలో ఏదైనా ఒక్కటి తగిన మోతాదులో వాడుకోవచ్చు. అయితే విరేచనం కోసం కేవలం ఔషధాలపైన ఆధారపడటం శాస్త్రీయం కాదు. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్ హుమాయూన్‌నగర్, హైదరాబాద్ గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 48 ఏళ్లు. ఇటీవల నా బరువు అధికంగా పెరిగింది. దాంతో డాక్టర్ దగ్గరికి వెళ్లి కొన్ని పరీక్షలు చేయించుకున్నాను. వీటిల్లో ఫ్యాటీలివర్ అని తేలింది. అసలు ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి? దీని గురించి వివరించండి. - రామస్వామి, ఖమ్మం కాలేయం కొవ్వుకు కోశాగారం లాంటిది. ఇది కొవ్వు పదార్థాలను గ్రహించి, వాటిని శరీరానికి ఉపయోగపడేలా చేస్తుంది. ఇది ఒక సంక్లిష్టమైన చర్య. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా... కాలేయంలోని కొవ్వు వినియోగం కాకుండా, అందులోనే చేరుతూ ఉంటుంది. ఇదే క్రమంగా ఫ్యాటీలివర్‌కు దారితీస్తుంది. ఇది రెండు కారణాల వల్ల వస్తుంది. మొదటిది మద్యం ఎక్కువగా తీసుకోవడం, రెండోది మద్యం అలవాటుకు సంబంధించని కారణాలు. ఇందులో స్థూలకాయం, డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్, హైపోథైరాయిడిజమ్ వంటివీ వస్తాయి. సాధారణంగా ఫ్యాటీలివర్ సమస్య ఉన్నవారిలో ఎలాంటి లక్షణాలు బయటకు కనిపించవు. కేవలం అల్ట్రాసౌండ్ స్కానింగ్ (కడుపు భాగం), కాలేయ సంబంధ పరీక్షలు చేయించుకున్నప్పుడు ఈ సమస్య బయటపడుతుంది. ఇలా ఆ పరీక్షల ద్వారా కాలేయ కణాల్లో కొవ్వు చేరిందని తెలుసుకున్నప్పుడు దాన్ని ఫ్యాటీలివర్‌గా గుర్తిస్తారు. సాధారణంగా ఫ్యాటీలివర్ సమస్యవల్ల 80 శాతం మందిలో ఎలాంటి ప్రమాదమూ ఉండదు. అయితే 20 శాతం మందిలో అది రెండో దశకు చేరుకోవచ్చు. ప్రధానంగా ఇది మెటబాలిక్ సిండ్రోమ్ అనే సమస్యకు కారణమై... గుండెకు, మెదడుకు సంబంధించిన ప్రమాదాలకు దారితీసే ప్రమాదం ఉంది. మీకు ఫ్యాటీలివర్ ఉందని నిర్ధారణ అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకు దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేయించుకొని, దానికి కారణాలను కనుగొని, తగిన మందులు వాడాల్సి ఉంటుంది. కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం తగ్గించాలి. మామూలుగా మధ్యవయసులో ఉన్నవారికి చాలా పరిమితమైన కొవ్వులు సరిపోతాయి. ఇక జంతుసంబంధమైన కొవ్వులను చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. మీరు ఒకసారి మీకు దగ్గరలోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను ఒకసారి కలవండి. డాక్టర్ భవానీరాజు సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ కేర్ హాస్పిటల్స్ బంజారాహిల్స్ హైదరాబాద్ న్యూరో కౌన్సెలింగ్ మా బాబు వయసు 12 ఏళ్లు. వాడు మూడేళ్ల వయసున్నప్పుడు ఆటలాడుతూ ఒకసారి కిందపడ్డాడు. అప్పుడు వాడికి తలమీద గాయం తగిలింది. కానీ అప్పుడు ఏమీ కాలేదు. బొడిపెలాగ వాపు వచ్చి కొన్ని రోజుల తర్వాత అదే తగ్గిపోయింది. అయితే ఈమధ్య మా బాబు ఒకసారి స్కూల్లో ఫిట్స్ వచ్చి కళ్లు తిరిగి పడిపోయాడు. అప్పటినుంచీ అప్పుడప్పుడూ అలా వస్తూనే ఉంది. మా ఇంటి దగ్గర్లోకి డాక్టర్‌కి చూపెట్టాం. ఆయన కొన్ని మందులు రాసిచ్చారు. అప్పటికి తగ్గిపోయింది గానీ మాకు భయంగా ఉంది. వాడికేమీ గుర్తుండడం లేదు. చిన్నప్పుడు తలకు తగిలిన గాయం వల్ల మా బాబు మెదడుకు ఏమైనా హాని జరిగిందేమోనని మాకు భయంగా ఉంది. దయచేసి మా బాబు సమస్యకు తగిన పరిష్కారం చూపండి. - లక్ష్మి, తిరుపతి సాధారణంగా చిన్నవయసులో ఆటలాడుతున్నప్పుడు అందరూ కింద పడుతూనే ఉంటాం. శరీరానికి చాలా చోట్ల దెబ్బలు తగలడం, తగ్గిపోవడం జరుగుతుంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రమే పైకి కనిపించని దెబ్బలు శరీరంలో చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా తలకు చిన్నతనంలో ఎప్పుడైనా గాయం తగలితే ఎంతమాత్రమూ అశ్రద్ధ చేయకూడదు. వయసు పెరుగుతున్నకొద్దీ తలలో గాయం కూడా పెరుగుతుంటుంది. మీరు వివరించినట్లు మీ అబ్బాయికి చిన్నప్పడు ఆటల సందర్భంలో తగిలిన గాయం వల్లనే ఫిట్స్ రావడం, కళ్లు తిరిగి పడిపోవడం జరుగుతుండవచ్చు. మెదడులోని విద్యుత్ ప్రభావం వల్ల ఫిట్స్‌లా వచ్చి బయటపడుతుండవచ్చు. అయితే అది ఏస్థాయిలో ఉంది, దాని పరిమాణం ఎంత అనేది సీటీ స్కాన్, ఎమ్మారై లాంటి కొత్తగా అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక వైద్యపరిజ్ఞానంతో కనిపెట్టగలం. ఆ పరీక్షల తర్వాతనే చికిత్సా ప్రక్రియ కొనసాగుతుంది. అయితే నిష్ణాతులైన వైద్యులతో మీ బాబు సమస్యను పూర్తిగా తగ్గించవచ్చు. కాబట్టి అతడి విషయంలో ఎలాంటి భయాందోళనలు చెందవలసిన అవసరం లేదు. కానీ మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే మీ బాబుకి తగిన పరీక్షలు నిర్వహించి తగిన చికిత్సను అందించండి. అతడు పూర్తిగా కోలుకుంటాడు. డాక్టర్ పి. రంగనాథమ్ సీనియర్ న్యూరోసర్జన్ యశోద హాస్పిటల్స్ సోమాజీగూడ హైదరాబాద్ -
ఇదో ‘పార్సిల్ డబ్బా’ మోసం
కేసముద్రం, న్యూస్‌లైన్ : డ్రాలో గెలిచావంటూ ఓ యువకుడికి గుర్తుతెలియని మోసగాడు మందులు, చాక్‌పీసులతో కూడిన పార్సిల్ డబ్బాను పంపి, తన ఖాతాలో రూ.5 వేలు జమ చేయిం చుకుని మోసగించిన సంఘటన మండల కేంద్రంలో బుధవారం జరిగింది. బాధితుడి కథనం ప్రకారం.. కేసముద్రం స్టేషన్ శివారు కట్టుకాల్వ తండాకు చెందిన భుక్యా నరేష్ తన భార్యకు అనారోగ్యంగా ఉండడంతో నెలకొకసారి ఎంజీఎం ఆస్పత్రిలో ఆయుర్వేద మందులు తీసుకొస్తుంటాడు. పదిరోజుల క్రితం ఓ వ్యక్తి 09939141718 నంబర్ నుంచి ఇతడి సెల్‌కు ఫోన్ చేస్తూ నీవు ఆయుర్వేద మందులు తీసుకున్నందున డ్రా తీశామని ఇందులో నీ పేరు వచ్చిందన్నారు. ఇందుకుగాను నువ్వు రూ.5 వేలు పోస్టాఫీసులో చెల్లిస్తే నీకు రూ.75 వేలు, 10 గ్రాముల బంగా రం, ఒక సెల్‌ఫోన్ పార్సిల్లో వస్తుందని తెలిపాడు. మొదట నమ్మలో? వద్దో తెలియ ని వ్యక్తి రెండురోజులుగా నీకు పార్సిల్ పంపించాను తీసుకోలేదా అని మళ్లీ అడిగాడు. దీంతో నమ్మిన నరేష్ వెంటనే అప్పుగా రూ.5 వేలు తెచ్చి మరీ పోస్టాఫీసుకు వెళ్లాడు. అక్కడ విచారించగా సిబ్బంది అతడి పార్సిల్‌ను తీసుకొచ్చారు. దీనిపై రూ.5 వేలు చెల్లించాల్సి ఉంది.. చెల్లించాకే తీసుకెళ్లు అని చెప్పడంతో అతడు చేతిలో ఉన్న డబ్బును ఇచ్చేశాడు. ఎంతో ఆశతో ఆ డబ్బాను ఇంటికి తీసుకొచ్చి తెరిచి చూస్తే పాతబడ్డ మందులు, కాగితాలు, ప్లాస్టిక్ డబ్బాలు కనిపించడంతో అతడు ఒక్కసారి లబోదిబోమన్నాడు. చివరకు మళ్లీ పోస్టాఫీసు వద్దకు వెళితే తమకు సంబంధం లేదని తేల్చిచెప్పారు. దీంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. కాగా ఇంకా మరికొన్ని పార్సిల్ డబ్బాలు పోస్టాఫీసులో ఉండడం కొసమెరుపు.