వెంగళరావునగర్ (హైదరాబాద్): బ్లాక్ ఫంగస్ వ్యాధిని ఆయుర్వేద ఔషధాలతో పూర్తిగా నియంత్రించవచ్చని తెలంగాణ ఆయుష్ డైరెక్టర్ డాక్టర్ అలుగు వర్షిణి అన్నారు. ఈఎన్‌టీ ఆస్పత్రిలో ఇప్పటికే పలువురు ఈ వ్యాధికి చికిత్స పొందుతున్నారని, ఆయా ఆస్పత్రుల్లో ఆయుర్వేద మందులను అందజేస్తున్నట్టు తెలిపారు. ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఈ మందుల వల్ల ఎలాంటి దుష్ప్రభావా లు ఉండవన్నారు. ఈ వ్యాధికి అల్లోపతి మందు లు ఇప్పటికే తీసుకుంటున్నా ఆయుర్వేద మందులు కూడా వాడొచ్చని స్పష్టం చేశారు.
బ్లాక్ ఫంగస్ రాకుండా ప్రజలు ముం దుజాగ్రత్తగా కూడా ఈ మందులను వినియోగించుకోవచ్చన్నారు. రాష్ట్రవ్యా ప్తంగా ఉన్న అన్ని ఆయుర్వేద మందు ల షాపుల్లో ఈ మందులు దొరుకుతా యని, ప్రభుత్వం వీటిని ఉచితంగా కూడా అందుబాటులోకి తీసుకువచ్చిందని త్వరలోనే వీటిని ప్రజలకు అందజేయనుందని ఆమె వెల్లడించారు. సీనియర్ ఆయుర్వేద వైద్య నిపుణులు మాట్లాడుతూ.. కరోనా చికిత్సలో స్టెరాయిడ్స్, యాంటీబయోటిక్స్ వాడకం తగ్గిస్తే బ్లాక్ ఫంగస్ రాకుండా కాపాడుకోవచ్చన్నారు. సమావేశంలో రాష్ట్ర ఆయుర్వేద అదనపు సంచాలకులు డాక్టర్ కె.అనసూయ తదితరులు పాల్గొన్నారు.
చదవండి: Koti ENT Hospital: బ్లాక్ ఫంగస్‌కు మెరుగైన చికిత్స
Comments
Please login to add a commentAdd a comment