black fungus ayush suggests three ayurvedic medicine - Sakshi
Sakshi News home page

Black Fungus: బ్లాక్‌ఫంగస్‌కు ‘ఆయుర్వేదం’

Published Sun, May 23 2021 7:10 AM | Last Updated on Sun, May 23 2021 1:33 PM

Black Funఒఆgus: Ayush Suggests Three Ayurvedic Medicine - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌–19 వ్యాధి నుంచి బయటపడేందుకు స్టెరాయిడ్స్‌ తీసుకున్న వారిలో బ్లాక్‌ఫంగస్‌ (మ్యూకార్‌ మైకోసిస్‌) వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మధుమేహం ఉన్న వారిలో బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ లక్షణాలున్న వారికి మూడు రకాల ఆయుర్వేద ఔషధాలతో సత్ఫలితాలు వస్తాయని ఆయుష్‌ డిపార్ట్‌మెంట్‌ సూచిస్తోంది. వీటిని భోజనం తర్వాత వేసుకోవాలని వివరించింది.

బ్లాక్‌ఫంగస్‌ లక్షణాలున్న వారు గోరు వెచ్చని నీటిని తాగాలి. 
► వేడిగా ఉన్నప్పుడు భోజనం చేయాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. 
 దానిమ్మ, ద్రాక్ష, బత్తాయి, బొప్పాయి, జామ, ఖర్జూర పండ్లను తీసుకోవాలి. 
► ఇంటా, బయటా మాస్కు తప్పకుండా ధరించాలి.  
► ఇంటి గదుల్లో గాలి ఆడేలా కిటికీలు, తలుపులు తెరిచి ఉంచాలి. 
► రోజుకు 2 సార్లు ఆవిరి పట్టాలి. రక్తంలో చక్కెర స్థాయిలను పరీక్షించుకోవాలి. 

వీటికి దూరంగా ఉండాలి.. 
►  చల్లని పదార్థాలు, శీతల పానీయాలు, ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహారం తీసుకోవద్దు.
►  బేకరీ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.
► చల్లని గాలిలో (ఏసీ, ఎయిర్‌ కూలర్‌ వాడొద్దు) తిరగొద్దు. పెరుగు తినొద్దు.  

చదవండి: Black Fungus: బ్లాక్‌ ఫంగస్‌ పంజా.. ఒక్క రోజే 302 మంది..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement