ములాయం కన్నా అఖిలేశే మిన్న!
సీ-వోటర్ సర్వే
లక్నో: సమాజ్‌వాదీ పార్టీలో, యాదవ్ కుటుంబంలో నెలకొన్న సంక్షోభం ద్వారా ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ కుమార్ యాదవ్‌కు మేలు జరుగుతోందని.. తాజా సీ-వోటర్ సర్వేలో వెల్లడైంది. అఖిలేశ్ సీఎం కావాలనుకునే వారి సంఖ్యనెలరోజుల్లోనే గణనీయంగా పెరిగిందని తెలిపింది. సర్వేలో తండ్రి ములాయం కన్నా అఖిలేశ్‌కే ఎక్కువమంది మద్దతు తెలిపారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో సీ-వోటర్ సంస్థ రెండు వేర్వేరు సర్వేలు నిర్వహించింది. పార్టీలో, కుటుంబంలో అఖిలేశ్‌ను ఒంటరి చేస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. 403 నియోజకవర్గాల్లో 12,211 మందితో ఈ సర్వే చేయగా.. 75.7 శాతం మంది ములాయం కంటే అఖిలేశే సరైన సీఎం అభ్యర్థని అభిప్రాయపడ్డారు. ఎస్పీలో ఉన్న గుండారాజ్‌ను పక్కనపెట్టేందుకు అఖిలేశ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని 68 శాతం మంది అభిప్రాయపడ్డారు.