సెట్‌టాప్‌ బాక్సుల తప్పనిసరిపై వివరణ ఇవ్వండి | high court seeks explanation of set top box rule | Sakshi
Sakshi News home page

సెట్‌టాప్‌ బాక్సుల తప్పనిసరిపై వివరణ ఇవ్వండి

Published Wed, Jan 25 2017 3:18 AM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM

సెట్‌టాప్‌ బాక్సుల తప్పనిసరిపై వివరణ ఇవ్వండి - Sakshi

సెట్‌టాప్‌ బాక్సుల తప్పనిసరిపై వివరణ ఇవ్వండి

కేంద్ర ప్రభుత్వానికి ఉమ్మడి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్‌: అన్ని మునిసిపాలిటీలు, మునిసిపల్‌ కార్పొరేషన్‌లలోని వీక్షకులు ఈ నెల 31 కల్లా సెట్‌టాప్‌ బాక్సులు ఏర్పాటు చేసుకోవాల్సిందేనంటూ జారీ చేసిన నోటిఫికేషన్‌పై ఉమ్మడి హైకోర్టు మంగళవారం కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్రంతో పాటు ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement