లాంటి అంతరాయం లేకుండా నాణ్యతతో కూడిన టీవీ ప్రసారాలు పొందేందుకు నిర్దేశించిన డిజిటలైజేషన్ ప్రక్రియ(సెట్ టాప్ బాక్సులు) మూడో దశ గడువును మార్చి 31వరకు పొడిగిస్తూ హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.
హైదరాబాద్ : ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యతతో కూడిన టీవీ ప్రసారాలు పొందేందుకు నిర్దేశించిన డిజిటలైజేషన్ ప్రక్రియ(సెట్ టాప్ బాక్సులు) మూడో దశ గడువును మార్చి 31వరకు పొడిగిస్తూ హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. కేబుల్ నెట్వర్క్ డిజిటలైజేషన్పై హైకోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే.
కేబుల్ టీవీ ద్వారా ప్రసారాలు పొందుతూ ఇప్పటికీ సెట్ టాప్ బాక్సులు తీసుకోనివారికి మార్చి 31 వరకు గడువును పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. డిజిటలైజేషన్ ప్రక్రియను దశలవారీగా పూర్తి చేయాలని ట్రాయ్ లక్ష్యంగా పెట్టుకుంది.