1983లో ఖైదీల మార్పిడిపై హైడ్రామా
1982లో ఖైదీల మార్పడికి భారత్ పాక్‌లు ఒప్పందం చేసుకున్న తర్వాత.. 1983లో పాక్‌ప్రభుత్వం ఈ కుటుంబాల సభ్యులను ‘తమ వారిని గుర్తించేందుకు’ రావాలని ఆహ్వానించింది. కుటుంబ సభ్యలకు చెందిన ఆరుగురు ప్రతినిధుల బృందం పాక్‌కు వెళ్లడానికి అనుమతించింది. కానీ.. అది చాలా రహస్యమైన పర్యటన అని, ఈ విషయం మీడియాకు తెలియరాదని స్పష్టం చేశారు. 1983 సెప్టెంబర్14న ఈ బృందం, కొందరు విదేశాంగ శాఖ అధికారులతో కలిసి పాక్‌లోని ముల్తాన్‌వెళ్లింది. అదే రోజున పటియాలా జైలులోని 25 మంది పాక్‌ఖైదీలను ఆ దేశ అధికారులు కలవాల్సి ఉంది. కానీ అలా జరగలేదు. ‘భారత్‌ఇచ్చిన మాటపై వెనుకడుగు వేసింది’ అంటూ పాక్‌పత్రికల్లో వార్తలు వచ్చాయి.
మరోవైపు సెప్టెంబర్15వ తేదీ ముల్తాన్‌జైలుకు భారత సైనికుల కుటుంబ సభ్యుల బృందం వెళ్లింది. తాంబే భార్య అక్కడ సందర్శకుల రిజిస్టర్‌లో సంతకం చేస్తుండగా.. అక్కడున్న జైలు అధికారి ‘మిసెస్‌తాంబే, క్షమించాలి. తాంబే ఇక్కడ లేరు’ అని వ్యాఖ్యానించారు. నిజానికి.. దాదాపు 200 మంది ఖైదీలను భారత్‌కు తిప్పి పంపిస్తామని పాక్‌అప్పటికే ప్రతిపాదించింది. అయితే.. ఆ ఖైదీలను గుర్తించాలని చెప్పింది. ఈ ఆరుగురు కుటుంబ సభ్యుల బృందానికి ఆరుగురు ఖైదీలను మాత్రమే చూపించారు. ఆ బృందం తాము వెదుకుతున్న వారిలో ఏ ఒక్కరినీ గుర్తించలేదు. ఇక వారిని వెళ్లిపోవాలని పాక్‌అధికారులు చెప్పారు.
ఈ ‘తరగతి’ ఖైదీల విషయంలో నాటి తమ ప్రధాని జియావుల్‌హక్‌ఆదేశాలను మాత్రమే తాము అమలు చేయగలమని స్పష్టంచేశారు. కుటుంబ సభ్యులు హతాశులై తిరిగివచ్చారు. అసలు పాక్200 మంది ఖైదీలను భారత్‌కు అప్పగిస్తామని చెప్పినపుడు.. ఇక గుర్తింపు ప్రక్రియలు ఎందుకనేది అర్థంకాని విషయమని భారత సైనికుల కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి. మేజర్‌అశోక్‌సూరి తండ్రి తన కుమారుడి కోసం ప్రయత్నిస్తూనే 1999లో కన్నుమూశారు. ఆ తర్వాత మళ్లీ అనేక దౌత్యప్రయత్నాల అనంతరం 2007 జూన్‌లో 14 మందితో కూడిన బంధువుల ప్రతినిధి బృందం పాక్‌లోని పలు జైళ్లను సందర్శించింది. కానీ ఒక్కరి జాడ కూడా లభించలేదు. అయితే.. తమ వారు పాక్‌జైళ్లలోనే ఉన్నారన్న వారి నమ్మకం మరింత బలపడింది.
టైమ్‌మేగజీన్‌లో మేజర్‌ఘోష్‌ఫొటో..: 1971 డిసెంబర్5న మేజర్‌ఎ.కె.ఘోష్‌అదృశ్యమయ్యారు. ఆ నెల 17వ తేదీన యుద్ధం ముగిసింది. ఆయన పాక్‌జైలులో కటకటాల వెనుక ఉన్న ఫొటో అదే నెల 27వ తేదీన అంతర్జాతీయ పత్రిక అయిన టైమ్‌మేగజీన్‌లో ప్రచురితమైంది. అంటే యుద్ధం ముగిసిన తర్వాత మేజర్‌ఘోష్‌పాక్‌నిర్బంధంలో ఉన్నారనేందుకు టైమ్‌మేగజీన్‌ఫొటోనే సాక్ష్యం. యుద్ధం తర్వాత 1972లో జరిగిన సిమ్లా ఒప్పందం ప్రకారం ఖైదీల అప్పగింత జరిగింది. పాక్‌ఖైదీలను భారత్‌ఆ దేశానికి అప్పగించింది. భారత్‌కు అప్పగించిన ఖైదీల్లో మేజర్ ఘోష్‌లేరు. ఒకవేళ ఈ మధ్యలోనే ఆయన పాక్‌జైలులో చనిపోయారని అనుకుంటే.. అందుకు సంబంధించిన రికార్డులన్నా ఉండాలి. అలాంటి వారు ఏమయ్యారనేది తెలుసుకునేందుకు భారత్ పాక్‌ప్రభుత్వాలు చర్చించుకోవచ్చు.
40 మంది యుద్ధ ఖైదీలు ఉన్నారు..: 1974లో భారత దేశానికి పాక్‌అప్పగించిన భారత ఖైదీల్లో మోహన్‌లాల్‌భాస్కర్‌ఒకరు. 1968 నుండి 74 వరకూ పాక్‌జైలులో ఉన్న ఆయన ‘మే భారత్‌కా జాసూస్‌థా’ పేరుతో ఒక పుస్తకం రాశారు.
ఒక కుట్ర కేసులో జైలు పాలైన పాక్‌రెండో పంజాబ్‌రెజిమెంట్‌అధికారి కల్నల్‌ఆసిఫ్‌షఫీ, మేజర్‌జనరల్‌అయాజ్‌అహ్మద్‌సిప్రాలను తాను ఫోర్ట్‌ఆఫ్‌అటాక్‌జైలులో కలిశానని.. భారత వైమానిక దళానికి చెందిన అధికారి గిల్‌ను, సైన్యానికి చెందిన కెప్టెన్‌సింగ్‌తనకు మిత్రులని 1965, 1971 యుద్ధాలకు సంబంధించి దాదాపు 40 మంది భారత యుద్ధ ఖైదీలు ఆ జైలులో ఉన్నారని, వారిని విడుదల చేసే అవకాశం లేదని సిప్రా తనకు వివరించినట్లు ఒక ప్రమాణపత్రంలో పేర్కొన్నారు. అనంతరం కుట్ర కేసులో జైలుకెళ్లిన పాక్‌సైనికాధికారి అయాజ్‌అహ్మద్‌ఆ తర్వాత కాలంలో అమెరికాలో ఉన్నపుడు ఆయనను స్వ్కాడ్రన్‌లీడర్‌జైన్‌అల్లుడు మనీష్‌జైన్2000 సంవత్సరంలో సంప్రదించారు. వింగ్‌కమాండర్‌గిల్‌ను పాక్‌జైలులో తాను కలిశానని షఫీ మరోసారి అనధికారికంగా ధృవీకరించారు.
హక్కుల ప్రతినిధి బృందం నిర్ధారణ..: కెనడాకు చెందిన భారతీయులతో కూడిన మానవ హక్కుల ప్రతినిధి బృందం ఒకటి 2003లో పాక్‌లో గూఢచర్యం ఆరోపణలతో మరణశిక్షను ఎదుర్కొంటున్న సరబ్జిత్‌సింగ్‌ను సందర్శించేందుకు లాహోర్‌సమీపంలోని కోట్‌లఖ్‌పత్‌జైలుకు వెళ్లింది. అప్పుడు కొన్ని బ్యారక్‌ల నుంచి వారికి కేకలు వినిపించాయి.
‘‘మేము 1971 యుద్ధ ఖైదీలం. గత 35 ఏళ్లుగా ఇక్కడ మగ్గిపోతున్నాం. ఈ నరకం నుంచి మమ్మల్ని బయటపడేయండి’’ అన్నది ఆ కేకల సారాంశం. దీంతో ఈ అంశంపై దృష్టి సారించిన ఆ బృందం.. అదృశ్యమైన 54 మంది భారత సైనికుల్లో చాలా మంది ఇంకా జీవించి ఉన్నారని, వారు పాకిస్తాన్‌జైళ్లలో యుద్ధ ఖైదీలుగా మగ్గుతున్నారని గుర్తించింది. కోట్‌లఖ్‌పత్‌జైలులో సుబేదార్‌అస్సాసింగ్‌సహా 11 మంది భారత యుద్ధ ఖైదీలు ఉన్నట్లు పేర్లు కూడా వెల్లడించింది. అలాగే మరికొంత మంది భారత యుద్ధ ఖైదీలు పాక్‌జైళ్లలోనే చనిపోయారని, వారి అస్తికలు అంత్యక్రియల కోసం వేచిచూస్తున్నయని కూడా పేర్కొంది. కానీ పాక్‌ప్రభుత్వం ఆ కథనాలన్నీ అవాస్తవాలని కొట్టివేసింది.
⇒ 1971 డిసెంబర్7వ తేదీన లాహోర్‌రేడియోలో చదివిన యుద్ధ ఖైదీల జాబితాలో కెప్టెన్‌రవీందర్‌కౌరా పేరును కూడా వెల్లడించారు.
⇒ పాక్‌సైనిక బలగాలు తాంబే సహా ఐదుగురు పైలట్లను సజీవంగా నిర్బంధించాయని ఢాకాకు చెందిన ఇంగ్లిష్‌దినపత్రిక సండే అబ్జర్వర్1971 డిసెంబర్5వ తేదీనే రావల్పిండి డేట్‌లైన్‌తో ప్రచురించింది.
⇒ మేజర్‌వారాయిచ్‌పాక్‌నార్త్‌వెస్ట్రన్‌ఫ్రాంటియర్‌ప్రావిన్స్‌లోని దార్గాయ్‌జైలులో ఖైదీగా ఉన్నారని అప్పటి ఆ రాష్ట్ర గవర్నర్‌జనరల్‌రియాజ్1972లో మ్యూనిచ్‌ఒలింపిక్స్‌వద్ద నాటి భారత బీఎస్‌ఎఫ్‌ఐజీ అశ్వినీకుమార్‌కు వ్యక్తిగత హోదాలో తెలిపారు. ఆ తర్వాత కొద్ది కాలానికే జనరల్‌రియాజ్‌రోడ్డు ప్రమాదంలో చనిపోయారు.
⇒ భారత గూఢచారిగా పనిచేస్తూ పాక్‌లోని వివిధ జైళ్లలో గడిపిన కిశోరిలాల్1974లో విడుదలయ్యారు. తాను కోట్‌లఖ్‌పత్‌జైలులో ఉన్నపుడు యుద్ధ ఖైదీలైన ఫ్లైట్‌లెఫ్టినెంట్‌విజయ్‌వసంత్‌తాంబే, మేజర్‌ఎ.కె.ఘోష్‌లను కలిసినట్లు వెల్లడించారు.
⇒ 1979లో పాక్‌లో మరణశిక్షకు గురైన బీబీసీ ప్రతినిధి విక్టోరియా స్కోఫోల్డ్‌రాసిన ‘భుట్టో: ట్రయల్‌అండ్‌ఎగ్జిక్యూషన్’ అనే పుస్తకంలో కోట్‌లఖ్‌పత్‌జైలులో తాను 1971 యుద్ధపు భారత ఖైదీల బ్యారక్‌పక్క సెల్‌లో ఉన్నట్లు రాశారు. యుద్ధ ఖైదీలను అర్ధరాత్రిళ్లు తీవ్ర చిత్ర హింసలకు గురిచేసేవారని వారి ఆర్తనాదాలు ఎంతో వేదన కలిగించేవని ఆమె వివరించారు.
⇒ పాక్‌జైళ్లలో తనతో పాటు 35 మంది భారత యుద్ధ ఖైదీలు ఉన్నారని, వారిని విడిపించేందుకు ప్రభుత్వం ద్వారా కృషి చేయాలని మేజర్‌కన్వల్‌జీత్‌సింగ్‌సంధూ 1980లో గుర్ముఖి భాషలో నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి ఒక లేఖ రాశారు. ఆ లేఖ ప్రతి ఆయన భార్య జస్బీర్‌కౌర్‌కు అదే సమయంలో అందింది.
⇒ చుక్‌యేగర్‌అనే ప్రఖ్యాత అమెరికా వైమానిక దళ అధికారి.. 1972 భారత్ పాక్‌యుద్ధం తర్వాత ఒక అసైన్‌మెంట్‌విషయమై పాకిస్తాన్‌వెళ్లారు. అదృశ్యమైన భారత వైమానిక దళ పైలట్లు చాలా మందిని తాను పాక్‌జైళ్లలో చూశానని ఆయన 1984లో ప్రచురించిన తన ఆత్మకథలో ప్రస్తావించారు.
⇒ గూఢచర్యం ఆరోపణలతో పాక్‌జైలులో ఎనిమిదేళ్లు గడిపిన భోగల్‌రామ్‌అనే భారతీయుడు 2000 సంవత్సరంలో విడుదలయ్యారు. 1971 యుద్ధ ఖైదీ అస్సాసింగ్‌ను కోట్‌లక్‌పత్‌జైలులో ఇంటరాగేషన్‌సెల్‌లో తాను చూసినట్లు ఆయన వెల్లడించారు. జైలు నుంచి రహస్యంగా భారత్‌లోని తన కుటుంబానికి ఒక లేఖను పంపించడానికి ప్రయత్నిస్తున్నాడన్న ఆరోపణలతో ఆయనను ఇంటరాగేట్‌చేయడానికి తీసుకువచ్చారని భోగల్‌రామ్‌తెలిపారు.
ఎప్పటికైనా చెర వీడేనా..?: 1971 యుద్ధంలో భారత్‌నిర్బంధించిన 93,000 మంది పాక్‌సైనికులను సిమ్లా ఒప్పందం ప్రకారం భారత్‌ఆ దేశానికి అప్పగించింది. పాక్650 మంది భారత యుద్ధ ఖైదీలను అప్పగించింది. కానీ నిజాయితీగా వ్యవహరించలేదు. ఆచూకీ లేకుండాపోయిన మరో 54 మంది భారత సైనికులు అక్కడే ఉన్నారని ఎన్ని ఆధారాలున్నా వారిని అప్పగించకుండా మోసం చేసింది’ అని భారత సైనికుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
పాక్‌లో మగ్గుతున్న భారత సైనికుల విషయాన్ని పార్లమెంటులో ఎన్నోసార్లు లేవనెత్తారు. కానీ.. ప్రభుత్వాల నుంచి ‘భారత సైనికులెవరూ తమ వద్ద ఖైదీలుగా లేరని పాక్‌చెప్తోంది’ అన్న సమాధానమే వస్తోంది. తెరవెనుక దౌత్య ప్రయత్నాలు చేసినా ఫలించటం లేదు. ‘ఇన్నాళ్ల తర్వాత భారత యుద్ధ ఖైదీలు తమ వద్ద ఉన్నారని పాక్‌అంగీకరించి విడుదల చేస్తే.. ఆ దేశానికి చాలా చెడ్డ పేరు వస్తుంది. మరోవైపు.. ఇన్నాళ్లుగా ఈ విషయంలో తాము ఏమీ చేయలేకపోయామన్న అపకీర్తిని భారత్‌కూడా మూటగట్టుకుంటుంది. కాబట్టి ఇరు దేశాలూ వ్యూహాత్మకంగా అదృశ్య వీరుల విషయంలో మైనం పాటిస్తున్నాయి’ అనేది పరిశీలకుల విశ్లేషణ.
ధరమ్‌పాల్‌సింగ్‌కోసం ఐసేజీలో కేసు వేయండి: హైకోర్టు
హవల్దార్‌ధరమ్‌పాల్‌సింగ్‌ను పాక్‌చెర నుంచి విడిపించాలంటూ ఆయన భార్య పాల్‌కౌర్‌తాజాగా పంజాబ్ హరియాణా హైకోర్టు పిటిషన్‌దాఖలు చేశారు. పంజాబ్‌లోని భటిండా జిల్లా లెహ్రా ధూద్‌కోట్‌కు చెందిన 78 ఏళ్ల ఆ మహిళ.. తన భర్తను విడిపించేలా కేంద్ర ప్రభుత్వానికి నిర్దేశించాలని ఆ పిటిషన్‌లో కోరారు. తన భర్త 1971 యుద్ధంలో పాకిస్తాన్‌తో పోరాడారని, అక్కడ పాక్‌సైన్యం ఆయనను నిర్బంధించిందని పాల్‌కౌర్‌తెలిపారు. అయితే.. ఆయన కనిపించడం లేని అదే ఏడాది డిసెంబర్‌లో పేర్కొనడంతో యుద్ధంలో అమరుడైనట్లుగా ప్రభుత్వం భావించిందని వివరించారు.
ధరమ్‌పాల్‌సింగ్‌మరణం పట్ల సంతాపం తెలుపుతూ నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కూడా తనకు లేఖ రాశారని పేర్కొన్నారు. కానీ తన భర్త యుద్ధంలో మరణించలేదని, పాకిస్తాన్‌లోని కోట్‌లఖ్‌పత్‌రాయ్‌జైలులో మగ్గుతున్నారని తన పిటిషన్‌లో వెల్లడించారు. ఫిరోజ్‌పూర్‌కు చెందిన సతీశ్‌కుమార్‌అనే మరో యుద్ధ ఖైదీ ఈ విషయాన్ని తనకు తెలియజేశారని చెప్పారు. ధరమ్‌పాల్‌సింగ్‌సజీవంగా ఉన్నారని, 197476 మధ్య తాను ఉన్న జైలులోనే ఆయన కూడా ఉన్నారని సతీశ్‌కుమార్‌చెప్పారు. ఆయన తను చెప్తున్న విషయాన్ని ప్రమాణపత్రం (అఫిడవిట్)లో కూడా వివరించారు. దీనిని విచారణకు స్వీకరించిన ధర్మాసనం గురువారం కేంద్ర హోంశాఖకు నోటీసు జారీ చేసింది.
యుద్ధ ఖైదీల విడుదల కోసం భారత్ పాక్‌ల మధ్య కుదిరిన సిమ్లా ఒప్పందం ప్రకారం.. యుద్ధ ఖైదీ అయిన ధరమ్‌పాల్‌సింగ్‌ను విడుదల కోరుతూ అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు దాఖలు చేయాలని కూడా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ఎం.ఎం.ఎస్. బేడీ కేంద్ర ప్రభుత్వానికి నిర్దేశించారు. నిజానికి.. 4వ సిఖ్‌రెజిమెంట్‌కు చెందిన హవల్దార్‌ధరమ్‌పాల్‌సింగ్‌మరణించినట్లు ప్రకటించినప్పటికీ.. ఆయన మృతదేహం లభ్యం కాకపోవడంతో అంత్యక్రియలు కూడా నిర్వహించలేదు. అదృశ్యమైన సైనికుల జాబితాలోనూ ఆయన పేరును చేర్చలేదు.
సంబంధిత వార్తలు
పాక్‌చెరలో ‘అదృశ్య’ బందీలు!!
ఈ 54 మంది ఏమయ్యారు?