
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా కేసులు రోజురోజుకు మరింత పెరిగిపోతున్నాయి. ఈరోజు కూడా దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,922 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడగా.. 418 మంది మృత్యువాత పడ్డారు. దేశంలో ఒక్కరోజులోనే దాదాపు 17వేలకు చేరువలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. తాజాగా వచ్చిన కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు 4,73,105 కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య 14,894గా ఉంది. కరోనా వైరస్ నుంచి 2,71,696 మంది పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 1,86,514 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment