భోపాల్: చెప్పిన సమయానికి చెప్పిన ప్లేసులో దొంగతనం చేయబోతున్నా? ఎవరేం చేస్తారో చూస్తానంటూ ఓ దొంగోడు చోరీకి ముందు బహిరంగ లేఖ రాసి పోలీసులకే సవాలు విసిరాడు. ఈ అరుదైన ఘటన మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఆదివారం చింద్వారాలోని త్రిలోకి నగర్‌లోని ఆరవ నెంబర్ వీధిలో ఓ ఇంటి ముందు ఓ కవర్ కనిపించింది. అందులో ఉత్తరంతోపాటు గాజులు, బ్రాస్‌లేట్ కూడా ఉన్నాయి. ఇక ఆ ఉత్తరంలో "నేను దొంగతనం కోసం త్రిలోకిలో మళ్లీ అడుగు పెట్టబోతున్నాను. ఒక బైకును ఎత్తుకెళ్తాను. మీరేం చేసుకుంటారో చేసుకోండి. (చోరీ.. అతని హాబీ)
ఇంతకీ ఇది నా 50వ చోరీ. కావాలంటే మీ కార్లు, బైకులను ముందస్తుగా లాక్ చేసి పెట్టుకోండి. ఎలాగో మేము 15 మంది ఉన్నాం" అని రాసి ఉంది. దీంతో స్థానికులు దొంగల భయంతో హడలిపోతున్నారు. ఇప్పటికే ఒక్క త్రిలోకి నగర్‌లోని 6వ వీధిలోనే పన్నెండు దొంగతనాలు జరిగాయి. తాజాగా మరింత రెచ్చిపోయిన దొంగలు నిర్భయంగా చోరీకి వస్తామని హెచ్చరిస్తూ బహిరంగంగా లేఖ రాయడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (దొంగతనంతో కోర్టుకు కృతజ్ఞత!)
Comments
Please login to add a commentAdd a comment