Chhindwara
-
నదిలో మధ్యలో సెల్ఫీ దిగుదామనుకుంటే..
భోపాల్ : ఇద్దరు యువతులు సరదాగా చేసిన పని వారి జీవితాలను రిస్క్‌లోకి నెట్టింది. అయితే పోలీసులు సకాలంలో స్పందించడంతో.. వారిద్దరు పెను ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలోని ఆరుగురు యువతులు పెంచ్ నది తీరానికి పిక్నిక్ వెళ్లారు. ఆ బృందలోని ఇద్దరు యువతులు నదిలోకి సెల్ఫీ దిగేందుకు వెళ్లారు. నది మధ్యలో ఉన్న బండపై కూర్చొని సెల్ఫీ దిగాలని భావించారు. అయితే వారు అక్కడికి వెళ్లగానే.. నదిలో నీటి మట్టం క్రమంగా పెరగడం ప్రారంభమైంది. దీంతో వారు నది మధ్యలోనే చిక్కుకుపోయారు. (భారతీయ విద్యార్థికి రూ.1.3కోట్ల స్కాలర్షిప్) ఇది గమనించిన నది ఒడ్డున మిగతావారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు స్థానికుల సాయంతో వారిద్దరిని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.(‘ఇది ఊహించలేదు.. ఆనందంగా ఉంది’) -
నది మధ్యలో సెల్ఫీ దిగుదామనుకుంటే..
-
పోలీసులకే సవాలు విసిరిన దొంగ
భోపాల్: చెప్పిన సమయానికి చెప్పిన ప్లేసులో దొంగతనం చేయబోతున్నా? ఎవరేం చేస్తారో చూస్తానంటూ ఓ దొంగోడు చోరీకి ముందు బహిరంగ లేఖ రాసి పోలీసులకే సవాలు విసిరాడు. ఈ అరుదైన ఘటన మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఆదివారం చింద్వారాలోని త్రిలోకి నగర్‌లోని ఆరవ నెంబర్ వీధిలో ఓ ఇంటి ముందు ఓ కవర్ కనిపించింది. అందులో ఉత్తరంతోపాటు గాజులు, బ్రాస్లేట్ కూడా ఉన్నాయి. ఇక ఆ ఉత్తరంలో "నేను దొంగతనం కోసం త్రిలోకిలో మళ్లీ అడుగు పెట్టబోతున్నాను. ఒక బైకును ఎత్తుకెళ్తాను. మీరేం చేసుకుంటారో చేసుకోండి. (చోరీ.. అతని హాబీ) ఇంతకీ ఇది నా 50వ చోరీ. కావాలంటే మీ కార్లు, బైకులను ముందస్తుగా లాక్ చేసి పెట్టుకోండి. ఎలాగో మేము 15 మంది ఉన్నాం" అని రాసి ఉంది. దీంతో స్థానికులు దొంగల భయంతో హడలిపోతున్నారు. ఇప్పటికే ఒక్క త్రిలోకి నగర్‌లోని 6వ వీధిలోనే పన్నెండు దొంగతనాలు జరిగాయి. తాజాగా మరింత రెచ్చిపోయిన దొంగలు నిర్భయంగా చోరీకి వస్తామని హెచ్చరిస్తూ బహిరంగంగా లేఖ రాయడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (దొంగతనంతో కోర్టుకు కృతజ్ఞత!) -
'ఆ పోలీసులను జైల్లో వేయండి'
-
యువకుడిని చితకబాదిన పోలీసులు
భోపాల్: ఓ యువకుడిని పోలీసులు ఎత్తిన లాఠీ దించకుండా కొట్టారు. దెబ్బలకు తాళలేక అతడు స్పృహ కోల్పోయినప్పటికీ వదిలిపెట్టకుండా తమ ప్రతాపాన్ని చూపించారు. ఈ ఘటన మధ్య ప్రదేశ్‌లోని చింద్వారాలో చోటు చేసుకుంది. చింద్వారాలో ఓ వ్యక్తిని పోలీసు లాఠీతో చితకబాదాడు. దీంతో అపస్మారక స్థితిలోకి చేరుకున్న అతను ఉన్నచోటే నేలపై పడిపోయాడు. అయినప్పటికీ అతడిని వదిలేయలేదు. ఈసారి మరో పోలీసు లాఠీ ఎత్తి గొడ్డును బాదినట్లు బాదాడు. కాలితో తలపై తన్నాడు. అప్పటికే అతడు చలనం లేకుండా పడి ఉన్నాడు. దీంతో అక్కడే ఉన్న మూడో వ్యక్తి పోలీసుల సాయంతో గాయపడిన వ్యక్తిని పోలీసు వ్యానులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. (మహారాష్ట్రలో 18 మంది పోలీసులు మృతి) దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన గురించి పోలీసు అధికారి శశాంక్ గార్గ్ మాట్లాడుతూ.. ఇది పాత వీడియోనని స్పష్టం చేశారు. పోలీసులు లాఠీ ఝుళిపిస్తోన్న వ్యక్తి ఇరుగు పొరుగువారిని ఇబ్బందులకు గురి చేసేవాడని తెలిపారు. అయితే అతనిపై ఎటువంటి కేసు నమోదు కాలేదని, ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించామన్నారు. మరోవైపు సోషల్ మీడియాలో ఈ వీడియోను చూసిన నెటిజన్లు పోలీసుల దాడిని క్రూరమైన చర్యగా అభివర్ణించారు. "యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేసిన పోలీసులను వెంటనే జైల్లో వేయండి" అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. (ఫైన్ లేకుండా వాహనాలు విడుదల) -
వాళ్లిదరి ఆచూకీ చెబితే రూ. 21 వేలు!
భోపాల్: ‘‘మహమ్మారి కరోనా సంక్షోభ సమయంలో కనిపించకుండా పోయిన చింద్వారా ఎమ్మెల్యే, ఎంపీ కోసం స్థానిక ప్రజలు వెదుకులాట ప్రారంభించారు. వాళ్లను చింద్వారాకు తీసుకువచ్చిన వారికి 21,000 క్యాష్ రివార్డు ఇస్తాం’’ అంటూ చింద్వారా నియోజకవర్గం ప్రజలు పలుచోట్ల పోస్టర్లు అంటించారు. విపత్కర సమయంలో తమకు అండగా నిలవకుండా బాధ్యతారాహిత్యానికి పాల్పడ్డారంటూ మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్, ఆయన కుమారుడు నకుల్‌నాథ్ ఫొటోలను పోస్టర్లపై ముద్రించి నిరసన తెలిపారు. కాగా చింద్వారా శాసన సభ స్థానం నుంచి కమల్‌నాథ్ ఎమ్మెల్యేగా గెలుపొందగా.. లోక్‌సభ స్థానం నుంచి ఆయన తనయుడు నకుల్‌నాథ్ ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.('కళ్ల ముందే ప్రాణం పోతుంటే ఏం చేయలేకపోయా') ఈ క్రమంలో లాక్డౌన్ కారణంగా తాము కష్టాలు పడుతున్నా పట్టించుకోవడం లేదంటూ వీరిద్దరిపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తూ ఇలా పోస్టర్లు వేయించారు. ఇక పోస్టర్లపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ అధికార బీజేపీ నాయకులే ఈ చర్యకు పాల్పడ్డారంటూ విమర్శలు గుప్పించారు. అయితే బీజేపీ నేతలు ఆ విమర్శలను కొట్టిపారేశారు. ఆ పోస్టర్లతో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. కాగా కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం కొనసాగిన జ్యోతిరాదిత్యా సింధియా కమల్‌నాథ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎగురవేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 21 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడంతో కమల్ సర్కారు కూలిపోగా.. ఆయన రాజీనామా అనంతరం శివరాజ్ సింగ్ చౌహాన్ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.(మిగిలిన టెన్త్ పరీక్షలు రద్దు.. సీఎం కీలక నిర్ణయం) -
ఉన్మాదిగా మారి తల్లీకూతుళ్లను..
భోపాల్ : ప్రేమోన్మాదిగా మారిన ఓ యువకుడు ఇద్దరి ప్రాణాలు తీశాడు. అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు... బంటీ రాజస్ (25) ప్రేమ పేరిట ఓ బాలికను వేధించేవాడు. ఇద్దరి ఇళ్లు పక్కపక్కనే ఉండటంతో తరచుగా ఆమెను కలిసేందుకు ప్రయత్నించేవాడు. ఈ క్రమంలో బాలిక తల్లిదండ్రులు అతడిపై మూడు నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇకపై బాలికను ఇబ్బంది పెట్టనని బంటీ పోలీసులతో చెప్పడంతో అతడిని విడిచిపెట్టారు. ఈ నేపథ్యంలో బాలికపై పగ పెంచుకున్న బంటీ సరైన సమయం కోసం వేచి చూశాడు. బాలిక తండ్రి, సోదరుడు పొరుగు ఊరు వెళ్లిన విషయం తెలుసుకుని గురువారం రాత్రి వారి ఇంట్లో ప్రవేశించాడు. వెంట తెచ్చుకున్న పదునైన ఆయుధంతో బాలికను పలుమార్లు పొడిచాడు. ఈ క్రమంలో అడ్డుపడిన బాలిక తల్లిపై కూడా పాశవికంగా దాడి చేశాడు. దీంతో వారిద్దరు గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో అక్కడి నుంచి పారిపోయిన బంటీ.. సమీపంలో ఉన్న సరస్సులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కాగా బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతున్న తల్లీకూతుళ్లను ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ వారు మృతి చెందినట్లు పేర్కొన్నారు. -
చింద్వారాలో చిందేస్తున్న వారసుడు
మధ్యప్రదేశ్‌లో మొదట్నించీ కాంగ్రెస్ కంచుకోట చింద్వారా లోక్‌సభ స్థానం. 1957లో అవతరించిన చింద్వారాలో పోలింగ్ ఈ నెల 29న జరుగుతుంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ 1980 నుంచి 2014 ఎన్నికవరకూ ఇక్కడ తొమ్మిదిసార్లు విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఆయన కొడుకు నకుల్‌నాథ్ పోటీచేస్తున్నారు. 1996లో ఓ కోర్టు కేసు కారణంగా కమల్‌నాథ్ పోటీ చేయలేదు. భార్య అల్కానాథ్ కాంగ్రెస్ టికెట్‌పై పోటీచేసి విజయం సాధించారు. ఈ కేసులో క్లీన్చిట్ రావడంతో 1997లో తన భార్యతో రాజీనామా చేయించగా జరిగిన ఉప ఎన్నికలో ఆయన పోటీచేసి బీజేపీ మాజీ సీఎం సుందర్‌లాల్ పట్వా చేతిలో ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి ఇదే మొదటిసారి. మళ్లీ 1998 నుంచీ కమల్‌నాథ్ గెలుస్తూ వచ్చారు. 44 ఏళ్ల నకుల్‌నాథ్ ఎన్నికల్లో పోటీచేయడం ఇదే తొలిసారి. 1996లో తన తల్లి అల్కా గెలుపులో ఆయన కీలక పాత్ర పోషించారు. అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో ఆయన ఎంబీఏ చదివారు. ఎన్నికల అనుభవం లేకున్నా చింద్వారాలో కమల్‌నాథ్ వేసిన పునాదులు నకుల్‌కు ఉపయోగపడతాయి. కిందటి ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థికి బదులు నాథన్ షా కర్వేటీకి బీజేపీ టికెట్ ఇచ్చారు. ఆరెసెస్ నేపథ్యం ఉన్న యువ ఆదివాసీ నేత నాథన్ షా. తొలి నుంచీ నియోజకవర్గ ప్రజల సమస్యలు తీర్చడం, ఢిల్లీలో వారి కోసం 24 గంటలూ పనిచేసే ఆఫీసు ఏర్పాటు చేయడం ద్వారా చింద్వారా ప్రజల్లో కమల్‌నాథ్ తిరుగులేని ఆదరణ సంపాదించారు. కాంగ్రెస్ గెలుపు సునాయాసమే! చింద్వారా సీటుకు నకుల్ పేరు ఒక్కటే ప్రతిపాదించడం, తండ్రి ముఖ్యమంత్రి పదవిలో ఉండడం, బలహీనమైన బీజేపీ ప్రత్యర్థి బరిలో ఉండడం వంటి కారణాల వల్ల నకుల్ గెలుపు నల్లేరుపై నడకగా వర్ణిస్తున్నారు. చిన్న వయసు నుంచీ తండ్రితోపాటు చింద్వారాలో జరిగే సమావేశాల్లో పాల్గొనడం, సెలవులు ఇక్కడే గడపడంతో నకుల్‌కు ఈ ప్రాంతం కొత్త కాదు. కిందటి డిసెంబర్లో తండ్రి ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుంచీ నకుల్ చింద్వారా వచ్చి కాంగ్రెస్ నాయకులతో సమావేశం కావడం ఎక్కువైంది. నకుల్కే కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలనే డిమాండ్ కార్యకర్తల నుంచి వచ్చింది. తండ్రికి సీఎం పదవి దక్కినప్పుడు కొడుకుకు లోక్‌సభ టికెట్ ఇవ్వడం కాంగ్రెస్‌లో కొత్తేమీ కాదు. -
కలెక్టర్‌కు మాజీ సీఎం వార్నింగ్
భోపాల్: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా గడుపుతున్న మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బుధవారం సహనం కోల్పోయారు. ఛింద్వారాలో తన హెలికాఫ్టర్ ల్యాండింగ్‌కు అనుమతి నిరాకరించడంతో ఆయన జిల్లా కలెక్టర్‌పై బెదిరింపులకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సాయంత్రం చౌహాన్ ఛింద్వారా జిల్లా ఉమ్రేత్లో పర్యటించాల్సి ఉంది. అందుకోసం చౌహాన్ హెలికాఫ్టర్‌లో సాయంత్రం 5.30 గంటలకు అక్కడికి వెళ్లేందుకు షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. అయితే జిల్లా అధికారులు మాత్రం సాయంత్రం 5 గంటల లోపే ఆయన హెలికాఫ్టర్ ల్యాండింగ్ అనుమతి ఇచ్చారు. దీంతో ఆగ్రహానికి లోనైనా చౌహాన్ కలెక్టర్‌పై విరుచుకుపడ్డారు. ‘పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ అక్కడ మా హెలికాఫ్టర్లు ల్యాండ్ కాకుండా అడ్డుకుంటుంది. ఇక్కడ మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. నేను ఇతర రాష్ట్రాల్లో ప్రచారంలో పాల్గొన్నాను. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పర్యటించాను. కానీ ఇలాంటి పరిస్థితి ఎక్కడ తలెత్తలేదు. నేను వారిని సాయంత్రం 6 గంటల వరకు అనుమతివ్వమని కోరాను. కానీ వారు అందుకు అంగీకరించలేదు. నేను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది అప్రజాస్వామిక చర్య. ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయి కానీ ఎవరు ఇలాంటి ఘటనలకు పాల్పడరాదు. ఓ తోలుబొమ్మ కలెక్టర్.. నేను తిరిగి అధికారంలోకి వస్తే అప్పుడు నీకు ఏం జరుగుతుందో తెలుసా’ అంటూ హెచ్చరించారు. మూడు సార్లు మధ్యప్రదేశ్ ముఖ్యంత్రిగా పనిచేసిన చౌహాన్ ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. -
హామీలు నెరవేర్చకుంటే బట్టలిప్పి కొట్టండి!
ధనోరా: లోక్‌సభ ఎన్నికల్లో ఛింద్వారా నుంచి తన కుమారుడు నకుల్‌నాథ్‌ను గెలిపించాలని మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ ప్రజలను కోరారు. ఒకవేళ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుంటే అతని దుస్తులను చించివేసి శిక్షించాలని సూచించారు. ధనోరా గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఛింద్వారా నియోజకవర్గంతో తన 40 ఏళ్ల అనుబంధాన్ని గుర్తుచేసుకున్న కమల్‌నాథ్..‘నకుల్ ప్రస్తుతమిక్కడ లేకపోయినా మీకు సేవ చేస్తాడు. నకుల్‌కు ఆ బాధ్యతను నేను అప్పగించాను. మీరిచ్చిన శక్తి, ప్రేమ వల్లే నేను ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాను. మనం త్వరలోనే సరికొత్త చరిత్రను సృష్టించడంతో పాటు కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాం’ అని అన్నారు. -
చింద్వాడా నుంచే కమల్‌నాథ్ పోటీ
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని తన సొంత జిల్లా చింద్వాడాలో కాంగ్రెస్ అత్యధిక ఆధిక్యంతో గెలుపొందిన నియోజకవర్గం నుంచి తాను త్వరలో పోటీ చేస్తానని మధ్యప్రదేశ్ కాబోయే సీఎం కమల్‌నాథ్ చెప్పారు. గత నెలలో జరిగిన ఎన్నికల్లో కమల్‌నాథ్ పోటీ చేయకపోయినప్పటికీ ఆయనను మధ్యప్రదేశ్ సీఎంగా కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేయడం తెలిసిందే. దీంతో నిబంధనల ప్రకారం సీఎం పదవిలో ఆయన కొనసాగాలంటే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల్లోపు శాసనసభకు ఎన్నిక కావడం తప్పనిసరి. ఇక చింద్వాడా జిల్లాలో మొత్తం ఏడు శాసనసభ నియోజకవర్గాలుండగా, వాటిలో నాలుగు ఎస్సీ/ఎస్టీ రిజర్వ్డు స్థానాలు. దీంతో మిగిలిన మూడు స్థానాలైన చింద్వాడా, చౌరాయ్, సౌన్సర్లలో ఏదో ఓ చోటు నుంచి కమల్ చేయొచ్చు. ఈ మూడు స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులే గెలవగా, ఈ మూడింటిలో అత్యధిక ఆధిక్యం కాంగ్రెస్‌కు చింద్వాడాలోనే లభించింది. కమల్ ఇల్లు, ఓటరు జాబితాలో పేరు చింద్వాడాలో ఉన్నాయి. దీంతో ఆయన అక్కడి నుంచే పోటీ చేసి శాసనసభకు ఎన్నికవుతారని సమాచారం. చింద్వాడాలో కాంగ్రెస్ తరఫున శాసనసభకు ఎన్నికైన దీపక్ సక్సేనా తన ఎమ్మెల్యే పదవిని త్యాగం చేయక తప్పని పరిస్థితి. ప్రమాణానికి రాహుల్, మమత కమల్‌నాథ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా సోమవారం ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్పర్స్న్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు హాజరుకానున్నారు. వీరితోపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తదితరులకు కూడా కమల్‌నాథ్ ఆహ్వానాలు పంపారని సమాచారం. -
కన్నతల్లిని కడతేర్చిన 15 ఏళ్ల బాలుడు
భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ 15 ఏళ్ల బాలుడు స్కూల్‌కు వెళ్లనందుకు మందలించిన కన్నతల్లినే కడతేర్చాడు. శనివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. 35 ఏళ్ల కుమారి ఉయ్క తన ఇద్దరు పిల్లలతో(ఒక కొడుకు, కూతురు) కలిసి జిల్లాలోని పిండ్రాయి సరఫ్ గ్రామంలో నివాసం ఉంటున్నారు. కుమారి భర్త జొగేశ్ ఉయ్కే కొన్నేళ్ల క్రితమే మరణించడంతో పిల్లల్ని పోషించడానికి ఆమె కూలీ పనికి వెళ్తుండేవారు. ఎంత కష్టపడైనా సరే పిల్లల్ని వృద్ధిలోకి తీసుకురావాలని భావిస్తున్న ఆమెకు 9వ తరగతి చదువుతున్న కొడుకు సక్రమంగా స్కూల్‌కు వెళ్లకపోవడం తీవ్ర బాధ కలిగించేది. ఎప్పటిలాగే ఆ బాలుడు శుక్రవారం కూడా బడికి వెళ్లలేదు. స్కూల్‌కు వెళ్లకుండా తన బంధువుల ఇంటికి వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న కుమారి తన కొడుకును అక్కడి నుంచి ఇంటికి తీసుకువచ్చింది. ఆ తరువాత స్కూల్‌కు వెళ్లనందుకు అతన్ని కర్రతో కొట్టారు. దీనిపై ఆగ్రహించిన ఆ బాలుడు పక్కనే ఉన్న ఇనుప రాడుతో తన తల్లిపై దాడి చేశాడు. దీంతో కుమారి అక్కడికక్కడే ప్రాణాలు కొల్పోయారు. ఆ తరువాత బాలుడు ఈ నేరం నుంచి తప్పించుకోవడానికి తన రక్తపు మరకలు అంటిన బట్టలను మార్చుకుని దగ్గర్లోని బంధువుల ఇంటికి పారిపోయాడు. తొలుత దీనిని అనుమానస్పద మృతిగా భావించి విచారణ చేపట్టిన హివర్‌కేది పోలీసులు.. ఆ ఇంట్లో దొరికిన ఆధారాలను బట్టి కుమారి కొడుకే ఈ హత్య చేశాడనే నిర్దారణకు వచ్చారు. దీనిపై పోలీసులు మాట్లాడుతూ.. నిందితున్ని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అతన్ని జువైనల్ కోర్టు ముందు హాజరు పరిచి జువైనల్ హోమ్‌కు తరలించినట్టు తెలిపారు. -
విమాన దుర్ఘటనలో ట్రైనీ పైలట్ మృతి
మహారాష్ట్ర- మధ్యప్రదేశ్ సరిహద్దుల్లోని చింద్వారా సమీపంలో విమానం కూలి శిక్షణలో ఉన్న ఓ పైలట్ మరణించాడు. పుణెకు చెందిన సోహెల్ జహీరుద్దీన్ అన్సారీ (19) డైమండ్ డీఏ-40 చిన్న విమానాన్ని మూడు గంటల పాటు శిక్షణ కోసం అద్దెకు తీసుకున్నాడు. మహారాష్ట్రలోని బిర్సీ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో బయల్దేరాడు. మధ్యాహ్నం 3.30 గంటలకల్లా తిరిగి రావాల్సి ఉంది. కానీ, గంట తర్వాత విమానానికి గ్రౌండ్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయి. బుధవారం ఉదయం మధ్యప్రదేశ్‌లోని చింద్వారా గ్రామస్థులు తాము సమీపంలోని కొండల వద్ద విమాన శిథిలాలను చూసినట్లు చెప్పారు. దాంతో పోలీసులు వెళ్లి గాలించగా విమాన శిథిలాలు, అన్సారీ మృతదేహం కనిపించాయి. అతడు ఉత్తరప్రదేశ్‌లోని ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉరన్ అకాడమీలో చదువుతున్నట్లు తెలిసింది.