మహారాష్ట్ర- మధ్యప్రదేశ్ సరిహద్దుల్లోని చింద్వారా సమీపంలో విమానం కూలి శిక్షణలో ఉన్న ఓ పైలట్ మరణించాడు.
మహారాష్ట్ర- మధ్యప్రదేశ్ సరిహద్దుల్లోని చింద్వారా సమీపంలో విమానం కూలి శిక్షణలో ఉన్న ఓ పైలట్ మరణించాడు. పుణెకు చెందిన సోహెల్ జహీరుద్దీన్ అన్సారీ (19) డైమండ్ డీఏ-40 చిన్న విమానాన్ని మూడు గంటల పాటు శిక్షణ కోసం అద్దెకు తీసుకున్నాడు. మహారాష్ట్రలోని బిర్సీ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో బయల్దేరాడు. మధ్యాహ్నం 3.30 గంటలకల్లా తిరిగి రావాల్సి ఉంది. కానీ, గంట తర్వాత విమానానికి గ్రౌండ్ కంట్రోల్తో సంబంధాలు తెగిపోయాయి.
బుధవారం ఉదయం మధ్యప్రదేశ్లోని చింద్వారా గ్రామస్థులు తాము సమీపంలోని కొండల వద్ద విమాన శిథిలాలను చూసినట్లు చెప్పారు. దాంతో పోలీసులు వెళ్లి గాలించగా విమాన శిథిలాలు, అన్సారీ మృతదేహం కనిపించాయి. అతడు ఉత్తరప్రదేశ్లోని ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉరన్ అకాడమీలో చదువుతున్నట్లు తెలిసింది.