భోపాల్ : ఇద్దరు యువతులు సరదాగా చేసిన పని వారి జీవితాలను రిస్క్‌లోకి నెట్టింది. అయితే పోలీసులు సకాలంలో స్పందించడంతో.. వారిద్దరు పెను ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలోని ఆరుగురు యువతులు పెంచ్ నది తీరానికి పిక్నిక్ వెళ్లారు. ఆ బృందలోని ఇద్దరు యువతులు నదిలోకి సెల్ఫీ దిగేందుకు వెళ్లారు. నది మధ్యలో ఉన్న బండపై కూర్చొని సెల్ఫీ దిగాలని భావించారు. అయితే వారు అక్కడికి వెళ్లగానే.. నదిలో నీటి మట్టం క్రమంగా పెరగడం ప్రారంభమైంది. దీంతో వారు నది మధ్యలోనే చిక్కుకుపోయారు. (భారతీయ విద్యార్థికి రూ.1.3కోట్ల స్కాలర్‌షిప్)
ఇది గమనించిన నది ఒడ్డున మిగతావారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు స్థానికుల సాయంతో వారిద్దరిని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.(‘ఇది ఊహించలేదు.. ఆనందంగా ఉంది’)
Comments
Please login to add a commentAdd a comment