ఐఏఎస్‌ అధికారి అనుమానాస్పద మృతి | IAS officer of Karnataka cadre, Anurag Tiwari found dead in lucknow | Sakshi
Sakshi News home page

ఐఏఎస్‌ అధికారి అనుమానాస్పద మృతి

Published Wed, May 17 2017 9:58 AM | Last Updated on Thu, Sep 27 2018 3:20 PM

ఐఏఎస్‌ అధికారి అనుమానాస్పద మృతి - Sakshi

ఐఏఎస్‌ అధికారి అనుమానాస్పద మృతి

లక్నో:  కర్ణాటక కేడర్‌కు చెందిన ఓ ఐఏఎస్‌ అధికారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. హజ్రత్‌జంగ్‌ మీరాబాయి గెస్ట్‌హౌస్‌ సమీపంలోని రోడ్డు పక్కన ఆయన మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఒంటిపై ఉన్న గుర్తులతో పాటు ఘటనా స్థలంలో లభించిన ఐడీ కార్డు  ఆధారంగా ఐఏఎస్‌ అధికారి అనురాగ్‌ తివారీగా పోలీసులు గుర్తించారు. గత రెండు రోజులుగా ఆయన మీరాబాయి అతిథిగృహంలోనే ఉంటున్నారు.

ఈ నేపథ్యంలో అనురాగ్‌ తివారీ అనుకోని విధంగా శవమై తేలారు. ఈ సమాచారం అందుకున్న సీనియర్‌ అధికారులు హుటాహుటీన ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాగా అనురాగ్‌ తివారీ అనుమానాస్పద రీతిలో మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆయన గడ్డం కింద చిన్న గాయం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అనురాగ్‌ తివారీ స్వస్థలం బహ్రెయిచ్ కాగా, 2007లో సివిల్‌ సర్వీస్‌లో చేరారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement