కరాచీ సదస్సుకు ఐజేయూ ప్రతినిధులు | iju delegates to the conference in Karachi | Sakshi
Sakshi News home page

కరాచీ సదస్సుకు ఐజేయూ ప్రతినిధులు

Published Thu, Apr 30 2015 1:30 AM | Last Updated on Sun, Sep 3 2017 1:07 AM

కరాచీ సదస్సుకు ఐజేయూ ప్రతినిధులు

కరాచీ సదస్సుకు ఐజేయూ ప్రతినిధులు

హైదరాబాద్: ‘వన్ వరల్డ్-వన్ మీడియా’ అనే అంశంపై పాకిస్తాన్‌లోని కరాచీలో జరగనున్న అంతర్జాతీయ సదస్సుకు ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) ప్రతినిధులు హాజరుకానున్నారు. అంతర్జాతీయ సదస్సుకు హాజరు కావాలంటూ పాకిస్తాన్ ఫెడరల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (పీఎఫ్‌యూజే) నుంచి ఐజేయూకు ఆహ్వానం అందింది.

దీంతో ఈ సదస్సుకు ఐజేయూ ప్రధాన కార్యదర్శి దేవులపల్లి అమర్, కోశాధికారి షబీనా ఇందర్‌జీత్‌లను పంపాలని నిర్ణయించినట్లు యూనియన్ నాయకుడు కె. అమర్‌నాథ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మే నెల 1 నుంచి 4 వరకు జరిగే ఈ సదస్సుకు ఆసియా, ఆఫ్రికా, యూరోప్, అమెరికాతో పాటు దాదాపు 15 దేశాలకు చెందిన జర్నలిస్టు ప్రతినిధులు, వివిధ యూనియన్ల నేతలు పాల్గొంటారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement