న్యూఢిల్లీ: భారత సైనిక ప్రధాన అధికారి జనరల్ దల్బీర్ సింగ్ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఏప్రిల్ 5 నుంచి 8 వరకు అమెరికాలో ఆయన పర్యటించనున్నారు. ఓ సదుద్దేశంతో ఈ పర్యటనకు తెరతీశారు. ఇరు దేశాల మధ్య అత్యున్నత స్థాయి సైనిక సంబంధాల్లో భాగంగానే ఈ పర్యటన ఖరారైంది. కాగా, ఈ పర్యటనలోనే దల్బీర్ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ తో సమావేశం కానున్నారు.
ఈ సందర్భంగా ఐక్యరాజ్య సమితి నిర్వహించే పలు కార్యక్రమాలకు భారత ఆర్మీ మరింత కట్టుబడి ఉంటుందనే విషయాన్ని బాన్ కీ మూన్ కు ఆయన తెలియజేయనున్నారు. దీంతోపాటు యూఎస్ సెంట్రల్ కమాండ్, యూఎస్ స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ వంటి సంస్థలను కూడా ఆయన సందర్శిస్తారు. ఈ సందర్భంగా రక్షణకు సంబంధించి కొన్ని ఒప్పందాలు కూడా చేసుకోనున్నట్లు సమాచారం.
అమెరికాకు ఇండియన్ ఆర్మీ చీఫ్
Published Mon, Apr 4 2016 7:58 PM | Last Updated on Fri, Aug 24 2018 7:24 PM
Advertisement
Advertisement