General Dalbir Singh
-
అమెరికాకు ఇండియన్ ఆర్మీ చీఫ్
న్యూఢిల్లీ: భారత సైనిక ప్రధాన అధికారి జనరల్ దల్బీర్ సింగ్ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఏప్రిల్ 5 నుంచి 8 వరకు అమెరికాలో ఆయన పర్యటించనున్నారు. ఓ సదుద్దేశంతో ఈ పర్యటనకు తెరతీశారు. ఇరు దేశాల మధ్య అత్యున్నత స్థాయి సైనిక సంబంధాల్లో భాగంగానే ఈ పర్యటన ఖరారైంది. కాగా, ఈ పర్యటనలోనే దల్బీర్ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ తో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్య సమితి నిర్వహించే పలు కార్యక్రమాలకు భారత ఆర్మీ మరింత కట్టుబడి ఉంటుందనే విషయాన్ని బాన్ కీ మూన్ కు ఆయన తెలియజేయనున్నారు. దీంతోపాటు యూఎస్ సెంట్రల్ కమాండ్, యూఎస్ స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ వంటి సంస్థలను కూడా ఆయన సందర్శిస్తారు. ఈ సందర్భంగా రక్షణకు సంబంధించి కొన్ని ఒప్పందాలు కూడా చేసుకోనున్నట్లు సమాచారం. -
జపాన్ ఆర్మీ చీఫ్ తో భారత ఆర్మీ చీఫ్ భేటీ
టోక్యో: జపాన్ ప్రధాన సైనికాధికారిని ఇతర అధికారులను భారత ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ కలిశారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య రక్షణకు సంబంధించిన ఆందోళనలపై పరస్పరం చర్చించుకున్నారు. ముఖ్యంగా ఇరు దేశాల మధ్య భద్రతా పరమైన సహకారం ఎప్పటికీ కొనసాగేదిశగా వారి మధ్య చర్చలు జరిగినట్లు భారత ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. నవంబర్ 16 నుంచి 19 వరకు దల్బీర్ సింగ్ జపాన్ లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆర్మీ విడుదల చేసిన ప్రకటనలో 'జనరల్ సింగ్ నారాసినో, సిమోసిజు, జపాన్ ఎయిర్ డిఫెన్స్ స్కూల్, ఫుజి క్యాంపు, జపాన్ మిడిల్ ఆర్మీకి చెందిన హెడ్ క్వార్టర్స్ లో పర్యటిస్తారు' అని పేర్కొంది.