జపాన్ ఆర్మీ చీఫ్ తో భారత ఆర్మీ చీఫ్ భేటీ | Army chief in Japan, discusses defence cooperation | Sakshi
Sakshi News home page

జపాన్ ఆర్మీ చీఫ్ తో భారత ఆర్మీ చీఫ్ భేటీ

Published Tue, Nov 17 2015 7:22 PM | Last Updated on Sun, Sep 3 2017 12:37 PM

Army chief in Japan, discusses defence cooperation

టోక్యో: జపాన్ ప్రధాన సైనికాధికారిని ఇతర అధికారులను భారత ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ కలిశారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య రక్షణకు సంబంధించిన ఆందోళనలపై పరస్పరం చర్చించుకున్నారు. ముఖ్యంగా ఇరు దేశాల మధ్య భద్రతా పరమైన సహకారం ఎప్పటికీ కొనసాగేదిశగా వారి మధ్య చర్చలు జరిగినట్లు భారత ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది.

నవంబర్ 16 నుంచి 19 వరకు దల్బీర్ సింగ్ జపాన్ లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆర్మీ విడుదల చేసిన ప్రకటనలో 'జనరల్ సింగ్ నారాసినో, సిమోసిజు, జపాన్ ఎయిర్ డిఫెన్స్ స్కూల్, ఫుజి క్యాంపు, జపాన్ మిడిల్ ఆర్మీకి చెందిన హెడ్ క్వార్టర్స్ లో పర్యటిస్తారు' అని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement