బాల కార్మికుల నిర్మూలన చట్టం ఓ మైలురాయి
జెనీవా కాన్ఫరెన్స్‌లో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ
సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశంలో బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలనకు చేసిన బాలకార్మికుల నిర్మూలన చట్టం సవరణ బిల్లు–2016 ఓ మైలురాయి అని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అభివర్ణిం చారు. జెనీవాలో రెండు రోజులుగా జరుగు తున్న అంతర్జాతీయ కార్మిక సంస్థ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాల కార్మికుల నిర్మూల నకు అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో) కన్వెన్షన్– 138, ప్రమాదకర పరిశ్రమల్లో 14 ఏళ్లలోపు బాలల నిషేధానికి నిర్దేశించిన కన్వెన్షన్–182 చట్టాలను భారత దేశం ఆమోదించిందని దత్తాత్రేయ తెలిపారు.దీనికి సంబంధించి రాష్ట్రపతి సంతకం చేసిన ఉత్తర్వులను ఐఎల్‌వోకు సమర్పించారు. భారతదేశంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టం అమలు కోసం ఫిర్యాదుల పరిష్కారానికి ‘పెన్సిల్’పేరుతో డిజిటల్ వేదికను రూపొందించామని తెలిపారు.
బాలల అక్రమ రవాణాను అరికట్టడానికి పట్టిష్ట మైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేశామన్నారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ కన్వెన్షన్లను భారత్ ఆమోదిం చడం చారిత్రాత్మక చర్యగా ఐఎల్‌వో డైరెక్టర్ జనరల్ రైడర్ కొనియాడారు. ఈ చట్టాలను ఆమోదింపజేయడంలో భారత ప్రభుత్వం చేసిన కృషి అభినందనీయమని పేర్కొ న్నారు. భారతదేశంలో కార్మికుల సామాజిక భద్రతకు ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి దత్తాత్రేయ ఈ సందర్భంగా వివరించారు.