
మళ్లీ మనమే టాప్..!
న్యూఢిల్లీ: ప్రపంచంలో ఆయుధాల దిగుమతి దారుల్లో అన్ని దేశాలకన్నా భారతదేశమే ముందున్నట్లు తెలిసింది.
న్యూఢిల్లీ: ప్రపంచంలో ఆయుధాల దిగుమతి దారుల్లో అన్ని దేశాలకన్నా భారతదేశమే ముందున్నట్లు తెలిసింది. కొన్ని దేశాల ఆదాయాలతో పోలిస్తే తక్కువున్నప్పటికీ భారత్ మాత్రమే ఎక్కువగా ఆయుధాలను దిగుమతి చేసుకుంటుందని, ఈ విషయంలో చైనా, పాకిస్థాన్తోపాటు అత్యంత ధనిక దేశమైన సౌదీ అరేబియాను కూడా దాటేసిందని స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్(ఎస్ఐపీఆర్ఐ) పేర్కొంది. ప్రపంచంలో మొత్తం ఆయుధాల దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో 15శాతం ఆయుధాలను భారత్ దిగుమతి చేసుకుంటుందని వివరించింది. ఇలా ఆయుధ దిగుమతి దారుల్లో టాప్లో నిలవడం ఇది మూడోసారి అని పేర్కొంది.