
దేశం గర్వించేలా చేసిన సైన్యానికి ధన్యవాదాలు
సాక్షి, చెన్నై : పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళాలు మెరుపు దాడులు చేశాయి. భారత నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ) వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలపై మంగళవారం తెల్లవారు జామున 3.30 గంటలకు భీకర దాడులు జరిపాయి. ఈ దాడుల్లో సుమారు 200 నుంచి 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. భారత వైమానికి దాడులపై యావత్ భారత్ హర్షం వ్యక్తం చేస్తోంది. సర్జికల్ స్ట్రైక్-2తో భారత వాయుసేన.. పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్లకు ఘన నివాళులర్పించిందని భారత ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
ఉగ్రదాడిలో వీరమరణం పొందిన సైనిక కుటుంబాలు ఈ దాడి పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాయి. దేశం గర్వించేలా భారత వైమానిక దళాలు మెరుపుదాడులు చేశాయని ఉగ్రదాడిలో మృతి చెందిన తమిళ సైనికుడు సుబ్రహ్మాణ్యం భార్య కృష్ణవేణి హర్షం వ్యక్తం చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళాలు చేసిన మెరుపు దాడులతో తన భర్త ఆత్మకు శాంతి కలిగిందన్నారు. దేశం గర్వించేలా చేసిన సైన్యానికి ధన్యవాదాలు తెలిపారు. (బాంబుల వర్షం కురిసేటప్పుడు మోదీ అక్కడే ఉన్నారా..!)