సాక్షి, న్యూఢిల్లీ : భారత సైనికులు యూనిఫామ్.. సరిహద్దు నగరాల్లో అత్యంత చౌకగా అమ్మేస్తున్నారు. రాజస్తాన్‌లో సైనిక దుస్తులను అక్రమంగా కేవలం రూ. 500, రూ. 1000కే విక్రయిస్తున్నారు. ఇటువంటి చర్యలు దేశ భద్రతకు, సైనికులు రక్షణకు సవాలు విసిరే అవకాశముంది.
రాజస్థాన్ సరిహద్దు పట్టణాల్లోని సైనిక వస్తువులు విక్రయించే దుకాణదారులు.. యధేచ్చగా నిబంధనలు అతిక్రమిస్తున్నారు. రక్షణ విభాగాల్లోని పనిచేస్తున్న సిబ్బంది వ్యక్తిగత గుర్తింపు కార్డు తప్పనిసరిగా చూసిన తరువాతే.. డిఫెన్స్ దుకాణదారులు వస్తువులు అమ్మాలన్న నిబంధన ఉంది. అయితే దీనిని దుకాణ యజమానులు తుంగలో తొక్కి యధేచ్ఛగా విక్రయాలు సాగిస్తున్నారు. పొరపాటున ఈ దస్తులు శత్రుసైనికుల చేతుల్లోకి వెళితే.. భద్రతాపరంగా పెనుముప్పుకు దారితీస్తుంది.
ముష్కరులు సైనిక దుస్తుల్లో వచ్చే.. పఠాన్‌కోట్‌పై దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఒక్క యూనిఫామ్ మాత్రమేకాకుండా.. బూట్లు, జాకెట్లు, బెల్ట్, బెడ్ రోల్స్ వంటివి కూడా.. బహిరంగంగా అమ్ముతున్నారు. ఇదిలావుండగా.. పఠాన్‌కోట్ ఘటన తరువాత పంజాబ్‌లో ఆర్మీ వస్తువుల అమ్మకాలపై నిషేధం విధించారు. సైనిక దుస్తులు, ఇతర వస్తువులు అవసరమైన వ్యక్తి తగిన గుర్తింపుకార్డులు పొందుపరిచి.. ప్రభుత్వం ఎంపిక చేసిన దుకాణాల్లో మాత్రమే కొనుగోలు చేయాలన్న నిబంధనను ప్రభుత్వం విధించింది.
Comments
Please login to add a commentAdd a comment