500 రైళ్ల వేళల్లో మార్పులు, 30 రైళ్లు రద్దు
500 రైళ్ల వేళల్లో మార్పులు, 30 రైళ్లు రద్దు
Published Wed, Jan 6 2016 10:40 AM | Last Updated on Sun, Sep 3 2017 3:12 PM
న్యూఢిల్లీ: భారతీయ రైల్వే శాఖ రైళ్ల వేళల్లో మార్పులను ప్రకటించింది. అననుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా కొన్ని రైళ్లను పూర్తిగాను, మరికొన్నింటిని పాక్షికంగాను రద్దు చేసింది. దేశవ్యాప్తంగా పొగమంచు కురుస్తుండడటంతో రైలు సేవలను అందించడంలో అంతరాయం ఏర్పడుతోందని తెలిపింది. విపరీతమైన మంచు కారణంగా రైళ్ల రాకపోకలను నియంత్రించక తప్పలేదని రైల్వేశాఖ ప్రకటించింది. జనవరి 8 నుంచి ఫిబ్రవరి 29 వరకు ఈ మార్పులు అమల్లో ఉంటాయని , ప్రయాణికులు గమనించాలని కోరింది.
దీనికి సంబంధించి రైల్వే వెబ్ సైట్ IRCTC లో ఈ జాబితాను ప్రకటించింది. రైళ్ల వేళల్లో మార్పులు, రద్దయిన రైళ్ల వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
దాదాపు 30 రైళ్లను రద్దుచేయగా, నాలుగు రైళ్లను పాక్షికంగా రద్దుచేసింది. మరో నాలుగు రైళ్లకు సంబంధించిన రెగ్యులర్ రూట్లను డైవర్ట్ చేసింది. ఈ 482 రైళ్లకు సంబంధించి కొన్ని రైళ్ల రూట్ల డైవర్షన్, ఫ్రీక్వెన్సీ తగ్గింపు లాంటి మార్పులు చేర్పులు చేసినట్టు తెలిపింది.
Advertisement
Advertisement