Timetable
-
కొన్ని కేటగిరీలకు ఉమ్మడి పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: గురుకుల ఉద్యోగాల భర్తీకి నిర్వహించే అర్హత పరీక్షలకు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) వ్యూహాత్మక కార్యాచరణ చేపట్టింది. పరీక్షలను సులభతరంగా నిర్వహించే క్రమంలో అభ్యర్థులకు వెసులుబాటు కల్పించింది. ఆగస్టు 1 నుంచి 22వ వరకు పరీక్షలు నిర్వహించనుంది. పరీక్షల వారీగా తేదీలను ఖరారు చేస్తూ రూపొందించిన వ్యూహాత్మక టైమ్‌టేబుల్‌ను టీఆర్‌ఈఐఆర్‌బీ వెబ్సైట్లో ఉంచింది. విద్యార్హతలు సమానమైన కేటగిరీ కొలువులకు పరీక్షలను ఉమ్మడిగా నిర్వహిస్తోంది. తద్వారా అభ్యర్థులు ఒక పేపర్లో అర్హత సాధిస్తే సంబంధిత పోస్టులకు అర్హత సాధించినట్లే. పేపర్ వన్, టూల్లోనే ఉమ్మడిగా.. టీఆర్‌ఈఐఆర్‌బీ రూపొందించిన పరీక్షల షెడ్యూల్ కాస్త ఒత్తిడి కలిగించే వి«ధంగా కనిపిస్తున్నప్పటికీ ఉమ్మడి పరీక్షలతో అభ్యర్థులకు భారీ ఊరట లభించనుంది. సులభతర పరీక్షా విధానం ఉండటంతో రోజుకు మూడు సెషన్లలో పరీక్షలు నిర్వహించేలా టైమ్‌టేబుల్ ఉందని అధికారులు చెబుతున్నారు. మొదటి సెషన్ కింద ఉదయం 8.30 గంటల నుంచి 10.30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యా హ్నం 12.30 గంటల నుంచి 2.30 గంటల వరకు, మూడో సెషన్ సాయంత్రం 4.30 గంటల నుంచి 6.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పలు పోస్టులకు పేపర్–1, పేపర్–2లను ఉమ్మడిగా నిర్వహిస్తోంది. పీజీ అర్హతతో ఉన్న పోస్టుగ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), జూనియర్ లెక్చరర్ (జేఎల్), డిగ్రీ లెక్చరర్ (డీఎల్) కేటగిరీ కొలువులకు పేపర్–1 పరీక్షను ఉమ్మడిగా నిర్వహిస్తున్నా రు. అంటే ఒక అభ్యర్థి ఈ మూడు పరీక్షలకు దరఖాస్తు చేసి.. కేవలం ఒకసారి పేపర్–1 పరీక్ష రాసి అర్హత సాధిస్తే మూడింటికీ పేపర్–1లో అర్హత సాధించినట్టేనన్నమాట. పీజీటీ, జేఎల్ కొలువుల పేపర్–2 పరీక్షలను కూడా ఉమ్మడిగా నిర్వహిస్తున్నారు. ఈ రెండు కేటగిరీలకు సంబంధించిన పెడగాగి (విద్యాబోధన శాస్త్రం) ఒకే రకంగా ఉండటంతో ఈ రెండు కేటగిరీలకు ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తున్నట్లు అధికారులు వివరిస్తున్నారు. ఇక పేపర్–3 పరీక్షలను వేర్వేరుగా నిర్వహిస్తున్నట్లు గురుకుల బోర్డు స్పష్టత ఇచ్చింది. పరీక్ష తేదీలు ఎక్కడా క్లాష్ కాకుండా పక్కా షెడ్యూల్ తయారు చేసినట్లు వివరించారు. పరీక్షలన్నీ సీబీటీ (కంప్యూటర్ బేస్డ్) పద్ధతిలో నిర్వహించడం ద్వారా ఫలితాలను కేవలం నెలరోజుల్లో విడుదల చేసేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. -
నిరుద్యోగులకు శుభవార్త
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే పట్టభద్రులైన నిరుద్యోగులకు శుభవార్త. తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎన్పీఎస్సీ) 2018 సంవత్సరానికి టైంటేబుల్‌ను శనివారం విడుదల చేసింది. ప్రభుత్వశాఖల్లోని 23 విభాగాల్లో 3,235 ఖాళీలు ఉన్నట్లుగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఖాళీలను మే నుండి అక్టోబరులోగా పోటీపరీక్షల ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపింది. డిగ్రీ, పీజీలు పూర్తి చేసిన విద్యార్దులు తమకు తగిన ప్రభుత్వం ఉద్యోగానికి పోటీ పరీక్షలకు సిద్దమయ్యేందుకు వీలుగా టీఎన్పీఎస్సీ ప్రతి ఏడాది ఖాళీల సంఖ్యను విడుదల చేయడం ఆనవాయితీ. ఈ ఆనవాయితీ ప్రకారం తాజాగా విడుదల చేసిన టైంటేబుల్లో 23 విభాగాల్లో 3,235 ఖాళీలున్నట్లు తెలియజేసింది. అయితే ఈ సంఖ్య పూర్తిగా తాత్కాలికమైనదని, దీనిలో మార్పులు జరిగే అవకాశం కూడా ఉందని తెలిపింది. ఈ పోస్టుల భర్తీలో కొన్ని స్థానాలకు అనివార్యమైన ఇబ్బందులు ఎదురైన పక్షంలో వచ్చే ఏడాది భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు చెబుతోంది. అంతేగాక అవసరమైన పక్షంలో టైంటేబుల్లో చూపని విభాగాలు, ఖాళీలను సైతం కొత్తగా చేర్చే పరిస్థితులు ఉత్పన్నం కావచ్చని స్పష్టం చేసింది. కొత్తగా చేర్చే అవకాశం ఉన్న ఖాళీలను పోటీ పరీక్షలకు ముందుగా లేదా తరువాత కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలిపింది. గత ఏడాది 12,218 ఖాళీ స్థానాలను చూపుతూ టైంటేబుల్ విడుదల చేశారు. అన్ని స్థానాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అంతేగాక టైంటేబుల్లో చూపని 24 ఖాళీలను ప్రకటించారు. వీటిల్లో 18 ఖాళీలకు పరీక్షలు నిర్వహించగా మిగిలిన ఆరు ఖాళీల భర్తీకి ఈనెల లేదా వచ్చేనెల పోటీ పరీక్షలు జరిపే అవకాశం ఉంది. అనేక పోటీ పరీక్షల కోసం 99 పాఠ్యాంశాలను విద్యావేత్తలు గత రెండేళ్ల కాలంలో సవరించి ఉన్నారు. గత ఐదేళ్ల కాలంలో పోటీ పరీక్షలు నిర్వహించినా కొన్ని పోస్టులకు అనివార్య కారణాల వల్ల ఫలితాలు వెల్లడి జాప్యం చేశారు. ఆ తరువాత మరలా ఫలితాలు వెల్లడించి నియామక ఉత్తర్వులు సైతం జారీచేశారు. అయితే ఈ ఏడాది ఆలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా అన్ని ఖాళీలకు పోటీ పరీక్షలు నిర్వహించి ఫలితాల వెల్లడి, నియామక ఉత్తర్వులు అందజేయగలమని టీఎన్పీఎస్సీ ధీమా వ్యక్తం చేస్తోంది. టీఎన్పీఎస్సీ తాజాగా విడుదల చేసిన టైంటేబుల్ ప్రకారం పోటీ పరీక్షల తేదీల వివరాలు ఇలా ఉన్నాయి. టీఎన్పీఎస్సీ విడుదల చేసిన పోటీ పరీక్షల పట్టిక : వ్రాత పరీక్షలు: పోస్టులు ఖాళీలు పరీక్ష తేది సహాయక సర్వేయర్ 56 మే, 6 మోటార్ వాహన ఇన్స్పెక్టర్ 113 జూన్ 10 ఉద్యానవ శాఖ సహాయకులు 805 జూన్, 9 వ్యవసాయ అధికారులు 183 జూన్, 10 అటవీ శాఖ ట్రైనీలు 158 జూన్ 16 మత్సశాఖ సంచాలకులు 72 జూలై 15 సహాయక ప్రభుత్వ న్యాయవాదులు 43 జూన్ 28, 29 అదేవిధంగా గ్రూప్ 2 లో 1547 పోస్టులకు ఇంటర్వ్యూలను ఆగస్టు 19వ తేది నిర్వహిస్తున్నట్టుగాను, గ్రూప్ 1 లో 57 పోస్టులకు అక్టోబర్ 14వ తేది వ్రాత పరీక్షలు జరుపుతున్నట్టు ప్రకటించారు. ఈ ఏడాదికిగాను పట్టికను టీఎన్పీఎస్సి వెబ్సైట్ www.tnpsc.gov.in లో విడుదల చేశారు. -
500 రైళ్ల వేళల్లో మార్పులు, 30 రైళ్లు రద్దు
న్యూఢిల్లీ: భారతీయ రైల్వే శాఖ రైళ్ల వేళల్లో మార్పులను ప్రకటించింది. అననుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా కొన్ని రైళ్లను పూర్తిగాను, మరికొన్నింటిని పాక్షికంగాను రద్దు చేసింది. దేశవ్యాప్తంగా పొగమంచు కురుస్తుండడటంతో రైలు సేవలను అందించడంలో అంతరాయం ఏర్పడుతోందని తెలిపింది. విపరీతమైన మంచు కారణంగా రైళ్ల రాకపోకలను నియంత్రించక తప్పలేదని రైల్వేశాఖ ప్రకటించింది. జనవరి 8 నుంచి ఫిబ్రవరి 29 వరకు ఈ మార్పులు అమల్లో ఉంటాయని , ప్రయాణికులు గమనించాలని కోరింది. దీనికి సంబంధించి రైల్వే వెబ్ సైట్ IRCTC లో ఈ జాబితాను ప్రకటించింది. రైళ్ల వేళల్లో మార్పులు, రద్దయిన రైళ్ల వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి. దాదాపు 30 రైళ్లను రద్దుచేయగా, నాలుగు రైళ్లను పాక్షికంగా రద్దుచేసింది. మరో నాలుగు రైళ్లకు సంబంధించిన రెగ్యులర్ రూట్లను డైవర్ట్ చేసింది. ఈ 482 రైళ్లకు సంబంధించి కొన్ని రైళ్ల రూట్ల డైవర్షన్, ఫ్రీక్వెన్సీ తగ్గింపు లాంటి మార్పులు చేర్పులు చేసినట్టు తెలిపింది. -
జీవో వస్తేనే జీతాలు
= టీచర్ల 50రోజుల సమ్మెలో 33 పనిదినాలు = వీటి భర్తీకి ప్రత్యేక టైమ్‌టేబుల్ = జీవో విడుదలలో సాంకేతిక ఇబ్బందులు? మచిలీపట్నం, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా సమ్మెలో పాల్గొన్న అనంతరం గురువారం నుంచి ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో బడిబాట పట్టనున్నారు. ఈ నెల 10న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో జరిగిన సమావేశంలో సమ్మె విరమిస్తున్నట్టు ఉపాధ్యాయులు ప్రకటించిన సంగతి తెలిసిందే. వారు మొత్తం 50 రోజులు సమ్మె చే శారు. అందులో సెలవులుపోను 33 రోజుల్ని పనిదినాలుగా గుర్తించారు. ఈ మొత్తం రోజులకు వేతనం ఇచ్చే అంశంపై పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్, ఉపాధ్యాయ సంఘం నాయకుల మధ్య మంగళవారం రాత్రి చర్చలు జరిగాయి. ఈ 33 పనిదినాలను మార్చి 9వ తేదీలోగా తరగతులు పెట్టి భర్తీచేస్తామని విద్యాశాఖాధికారులకు ఇచ్చిన లేఖలో ఉపాధ్యాయ నేతలు స్పష్టంచేశారు. దీనిపై ఇరువర్గాలవారు సంతకాలు చేశారు. ఉపాధ్యాయ సంఘం నాయకులు ఇచ్చిన లేఖలోని అంశాలతో ప్రభుత్వం సంతృప్తి చెందితే సమ్మెచేసిన కాలానికి వేతనం విడుదల చేసేందుకు ప్రత్యేక జీవో ఇవ్వాల్సి ఉంది. మరో 10 రోజుల వ్యవధిలో జీవో విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పోరాట సమితి కన్వీనరు మత్తి కమలాకరరావు ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా సమ్మెచేసిన ఉపాధ్యాయులకు 151 జీవో ప్రకారం వేతనాలు విడుదల చేశారని తెలిపారు. సమ్మె కాలంలో కోల్పోయిన పనిదినాలను భర్తీచేస్తామని తెలంగాణ టీచర్లు ఒప్పందం కుదుర్చుకోవడంతో అప్పట్లో ప్రభుత్వం వారికి వేతనాలు విడుదల చేసింది. ఇదే పద్ధతిని సీమాంధ్ర ఉపాధ్యాయులకు వర్తింపజేయాలని కోరినట్లు ఆయన తెలిపారు. సీఎం హామీతోనే సమ్మె విర మణ ముఖ్యమంత్రితో జరిగిన చర్చల్లో ఈ 33 పనిదినాలకు వేతనం ఇస్తామని ఆయన హామీ ఇచ్చినందునే తాము సమ్మె విరమించినట్లు కమలాకరరావు పేర్కొన్నారు. 2014 మార్చి 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు మొదలవుతాయని, ఆలోగా ఈ పనిదినాలను భర్తీ చేసేలా ఓ టైమ్‌టేబుల్ రూపొందించి విద్యాశాఖాధికారులకు అందజేశామన్నారు. అదనపు తరగతులు నిర్వహిస్తే తాము హాజరుకాబోమని సమ్మెలో పాల్గొనని సంఘాల ఉపాధ్యాయులు, నాయకులు తేల్చిచెప్పినట్లు ఆయన చెప్పారు. దీనిపై కూడా కొంత గందరగోళం నెలకొందన్నారు. అయితే సాంకేతికపరమైన ఇబ్బందుల దృష్ట్యా జీవో విడుదలలో కొంత జాప్యం జరిగినా.. సమ్మెలో పాల్గొన్న ఉపాధ్యాయులకు వేతనాల విడుదల విషయంలో అనుమానాలకు తావులేదని ఆయన చెప్పారు. కాగా, సమ్మెలో పాల్గొన్న ఉపాధ్యాయులకు వేతనాల విడుదల, నష్టపోయిన పనిదినాల భర్తీ తదితర అంశాలపై ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు అందలేదని డీఈవో డి.దేవానందరెడ్డి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ అంశాలపై ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. జీవో అమలుచేయాలి సమైక్య సమ్మెలో పాల్గొనని ఉద్యోగులకు వేతనాలు మంజూరుచేయాలని ప్రభుత్వం గత నెల 27న విడుదల చేసిన జీవోను అమలుచేయాలని పలువురు ఉద్యోగులు కోరుతున్నారు. ఏదైనా విభాగంలో డ్రాయింగ్ ఆఫీసర్‌గా ఉన్న అధికారి సమ్మెలో ఉంటే ఆయన తరువాత సీనియర్‌గా ఉన్న ఉద్యోగి ఆ బాధ్యత స్వీకరించి జీతాల బిల్లు చేసే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ప్రస్తుతం జీవో విడుదలైనా అమలుకు నోచుకోలేదని సమ్మె చేయని ఉద్యోగులు వాపోతున్నారు. విజయవాడ రూరల్ మండలానికి సంబంధించి ఉన్నత పాఠశాలలు మినహా మిగిలిన అన్ని పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సమ్మెకు దూరంగా ఉన్నారు. వీరికి కూడా వేతనాలు అందని పరిస్థితి నెలకొంది.