న్యూఢిల్లీ: ఇకపై ఓడల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం విధించాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ నిర్ణయించింది. కేవలం మనదేశానికి చెందిన షిప్పులకు మాత్రమేగాక, ఇతర దేశ ఓడలు భారత జలాలపై తిరుగుతున్నపుడు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. భారత జలాల్లో ప్రవేశించే ముందే తమతో ఉన్న ప్లాస్టిక్ సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. 10 లీటర్ల నీటి కంటే తక్కువ పట్టే ప్లాస్టిక్ బాటిళ్లను కూడా నిషేధించనున్నారు. సముద్ర జలాల్లో వీటి అవశేషాలే ఎక్కువగా ఉంటున్న తేలిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment