ఇడ్లీ రుచి చూసిన శక్తిమంతమైన మహిళ | Indra Nooyi tastes South Indian dishes made from oats | Sakshi
Sakshi News home page

ఇడ్లీ రుచి చూసిన శక్తిమంతమైన మహిళ

Published Tue, Sep 13 2016 7:59 PM | Last Updated on Mon, Sep 4 2017 1:21 PM

ఇడ్లీ రుచి చూసిన శక్తిమంతమైన మహిళ

ఇడ్లీ రుచి చూసిన శక్తిమంతమైన మహిళ

చెన్నై: ప్రపంచ శక్తిమంతమైన వ్యక్తుల్లో ఒకరైన పెప్సికో చైర్మన్ అండ్ సీఈవో ఇంద్రా నూయి దక్షిణ భారత వంటలు రుచి చూశారు. తమిళనాడులోని చెన్నైలో జన్మించిన ఆమె ప్రస్తుతం అతి పెద్ద హోదాను అనుభవిస్తూ మంగళవారం వాడపలనిలోని వసంత భవన్ అనే హోటల్ సందర్శించారు. అక్కడ ఆమె వోట్స్తో తయారు చేసిన అప్పం, దోసా, ఇడ్లీవంటి వంటకాలను ఆరగించారు. అయితే, ఈ వోట్స్ కూడా క్వాకర్ అనే కంపెనీకి చెందినవి.

కాగా, క్వాకర్ వోట్స్కు దక్షిణ భారత దేశంలో కూడా విరివిగా ప్రచారం కల్పించే చర్యల్లో భాగంగానే ప్రత్యేకంగా ఆమెను ఆ హోటల్కు పిలిపించి వాటిని రుచి చూపించారని అదే హోటల్లో పనిచేసే ఓ పేరు చెప్పేందుకు ఇష్టపడని వ్యక్తి చెప్పాడు. వారి ఫేమస్ చెఫ్ వికాస్ ఖన్నానే ఆ వంటలు చేశాడని, మిగితావారంతా తమ హోటల్ సిబ్బంది అంతా అతడికి సహాయపడ్డారని ఆ వ్యక్తి చెప్పాడు. ఖన్నా పెప్సికో ఇండియాకు న్యూట్రిషన్ అంబాసిడర్ గా కూడా ఉన్నాడు. వంటలను రుచి చూసిన ఇంద్రా నూయి ఏ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement