నెల్లూరు:నౌకయానం (నావిగేషన్) అవసరాలు తీర్చడానికి కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్న ఐఆర్ఎన్ఎస్ఎస్ 1డి ఉపగ్రహం సోమవారం శ్రీహరికోటకు చేరుకుంది. ఈ ఉపగ్రహాన్ని మార్చి రెండో వారంలో ప్రయోగిస్తారు. పీఎస్ఎల్వీ ద్వారా ప్రయోగించునున్న ఈ ఉపగ్రహం నావిగేషన్ అవసరాలను తీర్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని ఇస్రో అధికారులు తెలిపారు.