ఐఎస్ నేతకు వైమానిక దాడిలో గాయాలు! | is leader of the injuries to the air raid | Sakshi
Sakshi News home page

ఐఎస్ నేతకు వైమానిక దాడిలో గాయాలు!

Published Wed, Apr 22 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 12:38 AM

ఐఎస్ నేతకు వైమానిక దాడిలో గాయాలు!

ఐఎస్ నేతకు వైమానిక దాడిలో గాయాలు!

లండన్: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్) అగ్రనేత అబూబకర్ అల్ బాగ్దాదీ.. పశ్చిమ ఇరాక్‌లో జరిగిన ఒక వైమానిక దాడిలో తీవ్రంగా గాయపడ్డట్లు వార్తలు వెలువడ్డాయి. ‘గార్డియన్’ పత్రిక కథనం ప్రకారం.. అమెరికా సారథ్యంలో గత నెల 18న జరిగిన దాడుల్లో బాగ్దాదీకి ప్రాణాంతక గాయాలయ్యాయి.

సిరియా సరిహద్దులోని అల్-బాజ్‌లో వద్ద జరిగిన ఈ దాడిలో బాగ్దాదీ గాయపడ్డాడని ఇరాక్ ప్రభుత్వ సలహాదారు హషిమి నిర్ధారించారు. బాగ్దాదీ చనిపోతాడని ఐఎస్ భావించిందని.. సమావేశాలు నిర్వహించి, కొత్త నాయకుడిని ప్రకటించాలనీ నిర్ణయించిందని.. అయితే బాగ్దాదీ నెమ్మదిగా కోలుకుంటున్నాడని ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement