ఓటమితో అంతా అయిపోలేదు | Is not all, with the loser says sonia gandhi | Sakshi
Sakshi News home page

ఓటమితో అంతా అయిపోలేదు

Published Sat, Jun 14 2014 1:11 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

ఓటమితో అంతా అయిపోలేదు - Sakshi

ఓటమితో అంతా అయిపోలేదు

కాంగ్రెస్ అభ్యర్థులకు సోనియా లేఖలు

న్యూఢిల్లీ: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ పరాజయంతో కుదేలై దిగాలుపడ్డ పార్టీ నేతల్లో మనోస్థైర్యం నింపేందుకు అధినేత్రి సోనియాగాంధీ నడుం బిగించారు. ఓటమి పాలైన పార్టీ అభ్యర్థులందరికీ ఆమె లేఖలు రాశారు. ‘‘ఓడినంత మాత్రా న అంతా అయిపోయినట్టు కాదు. రాజకీయంగా చురుగ్గా ఉండండి.

మీ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ పని చేయండి’’ అని సూచించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అంబికా సోని శుక్రవారం ఈ మేరకు వెల్లడించారు. సోనియా నుంచి తనకు లేఖ వచ్చిందన్నారు. సోని కూడా ఎన్నికల్లో ఓటమి పాలైన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement