సాక్షి, బెంగళూరు: బెంగళూరులో మళ్లీ ఐటీ దాడుల కలకలం రేగింది. నగర బీజేపీ నాయకుడు, ప్రముఖ వ్యాపారవేత్త కె.పి.నంజుండిపై ఈసారి గురిపెట్టారు. బెంగళూరులో నంజుండికి చెందిన లక్ష్మీ గోల్డ్ ప్యాలెస్ జువెలరీ షోరూంలు, సిల్క్ శారీ హౌస్‌లు, నివాసంతో పాటు ధార్వాడ తదితర ప్రాంతాల్లో ఉన్న జువెలరీ షోరూమ్‌లతో కలుపుకొని మొత్తం 12 ప్రాంతాల్లో గురువారం ఉదయం నుంచే ఏకకాలంలో దాడులు నిర్వహించారు.
బెంగళూరు, గోవాకు చెందిన 60 మంది ఐటీ అధికారుల బృందాలు ఇందులో పాల్గొన్నాయి. ఈ ఐటీ దాడులు గురువారం సాయంత్రం వరకు కొనసాగాయి. ఈ దాడుల్లో కొన్ని ముఖ్యమైన ఫైళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కాగా, కె.పి.నంజుండి బంధువుల ఇళ్లతో పాటు ఆయన జువెలరీ వ్యాపారంలో ఉన్నతస్థాయి ఉద్యోగుల నివాసాల్లోనూ ఐటీ సోదాలు జరిపారు.
ఆదాయాన్ని తక్కువగా చూపుతూ పన్నుల ఎగవేతకు పాల్పడ్డారన్న ఆరోపణల వల్లే నంజుండిపై దాడులు నిర్వహించినట్లు సమాచారం. ఈ దాడుల్లో భారీమొత్తంలో ఆస్తులు, నగదును ఐటీ అధికారులు గుర్తించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment